అన్వేషించండి

Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి

Karimnagar News: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయనపై నమోదైన కేసులన్నీ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు.

BRS MLA Padi Kaushik Reddy Got Bail: బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి (Padi Kaushik Reddy) ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కరీంనగర్ (Karimnagar) రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జస్టిస్ ప్రేమలత మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. 2 కేసుల్లో రూ.25 వేల చొప్పున రూ.50 వేల పర్సనల్ బాండ్ సమర్పించాలని ఆదేశించారు. ఆయనకు రిమాండ్ విధించాలన్న పోలీసుల రిపోర్టును కొట్టేశారు. అన్ని కేసులు కూడా బెయిలబుల్ సెక్షన్లు కావడంతో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. అంతకు ముందు కరీంనగర్ పీఎస్‌లోనే పాడి కౌశిక్‌రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం జడ్జి ఎదుట హాజరుపరిచారు. కౌశిక్ రెడ్డికి రిమాండ్ విధించాలన్న పోలీస్ రిపోర్టుపై వాదనలు సాగాయి.

ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు, 2 కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు బీఆర్ఎస్ లీగల్ టీం తెలిపింది. సోమవారం సాయంత్రం ఆయన్ను అరెస్ట్ చేసి హైడ్రామా క్రియేట్ చేశారని.. 2 కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. రిమాండ్ రిపోర్టులో ఏమైనా మారుస్తారేమో చూడాల్సి ఉందని పేర్కొంది. కాగా, పాడి కౌశిక్‌రెడ్డిపై మొత్తం 5 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కరీంనగర్ వన్ టౌన్‌లో 3 కేసులు, త్రీటౌన్ పీఎస్‍‌లో 2 కేసులు నమోదయ్యాయి.

ఇదీ జరిగింది

కాగా, కరీంనగర్ కలెక్టరేట్‌లో ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో కౌశిక్ రెడ్డి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తోపులాట జరగ్గా.. కరీంనగర్ పోలీసులకు సంజయ్‌తో పాటు కొందరు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు కాగా.. సోమవారం సాయంత్రం ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి కరీంనగర్‌కు తరలించారు. రాత్రంతా కౌశిక్‌రెడ్డి జైల్లోనే ఉండగా.. ఉదయం వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. మరోవైపు, కౌశిక్‌రెడ్డి అరెస్టుతో కరీంనగర్ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొనగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి, కోకాపేటలోని వారి నివాసాల వద్ద భారీగా మోహరించారు. నేతలను ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఎలాంటి ఆందోళనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

'అక్రమ అరెస్టులకు భయపడేది లేదు'

అక్రమ అరెస్టులకు తాను భయపడేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) తెలిపారు. మంగళవారం కరీంనగర్ త్రీ టౌన్ పీఎస్ నుంచి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చేందుకు తీసుకెళ్తుండగా.. పోలీస్ వాహనం నుంచే ఆయన మీడియాతో మాట్లాడారు. 'అమ్ముడుపోయిన ఒక ఎమ్మెల్యేను నిలదీసినందుకు నాపై అక్రమ కేసులు పెట్టారు. పండుగ పూట రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. 6 గ్యారెంటీలు అమలయ్యే వరకూ ప్రశ్నిస్తూనే ఉంటాను. జై తెలంగాణ.' అంటూ నినాదాలు చేశారు.

Also Read: Cyber Fraud: సైబర్ మోసంతో రూ.2.42 కోట్లు కొట్టేశారు - బాధితుల్లో శాస్త్రవేత్త, వాట్సార్ గ్రూపులో చేర్చి మరీ..

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget