Anantapur News Today: బీజేపీ, జనసేనతోనే టీడీపీ ముప్పు- సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు
Anantapur Latest News: మిత్రపక్షాలతో టీడీపీ ప్రమాదం ఉందని వైసీపీ నేతలు హెచ్చరించారు. అనంతపురంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Anantapur Latest News Updates: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే భవిష్యత్ అంతా వైసీపీదేనంటున్నారు ఆ పార్టీ నేతలు. అనంతపురం జిల్లా కమిటీ సమావేశంలో ఆ పార్టీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితులు వస్తాయని జోస్యం చెప్పారు. ఆ పార్టీకి మిత్ర పక్షాల నుంచి ముప్పు పొంచి ఉందని బీజేపీ, జనసేనను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు.
వైసీపీ అనంతపురము జిల్లా కమిటీ సమావేశం
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షతన వైసీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశమైంది. జిల్లా కమిటీ కార్యవర్గం, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు తలారి రంగయ్య, విశ్వేశ్వరరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వీరాంజనేయులు, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి హాజరయ్యారు. ముందుగా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన నాయకులు అనంతరం పార్టీ విధివిధానాలపై చర్చించారు.

క్షేత్రస్థాయి నుంచి వైసీపీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై అనంత వెంకటరామిరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఏడు నెలల్లోనే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై గ్రామ స్థాయి నుంచి పోరాటం చేద్దామని కేడర్‌కు సూచించారు. నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలను త్వరలోనే నియమిస్తామని వెల్లడించారు.
Also Read: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
త్వరలో జిల్లా వైసీపీ కార్యాలయం ప్రారంభమిస్తారమన్నారు వెంకటరామిరెడ్డి. అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు అందుబాటులోకి రావాలని సూచించారు. సమన్వయకర్తలు, జిల్లా కమిటీలోని నాయకులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని హితవుపలికారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మన పార్టీ ఆఫీస్ గుర్తుకు రావాలని దిశానిర్దేశం చశారు. అక్కడికి వెళ్తే సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడతాయన్న భరోసా కల్పించాలన్నార.
కేడర్ కూడా మరింత యాక్టివ్‌గా ఉండాలని వెంకటరామిరెడ్డి సూచించారు. పార్టీ ఒక్క పిలుపు ఇస్తే గ్రామ స్థాయి నుంచి క్యాడర్ అంతా కదలాలని ఉత్సాహం నింపారు. వైసీపీకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులందరిపై కూడా ఉందని సూచించారు. జమిలి వస్తాయో లేదో తెలియదు కానీ అంతకుముందే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని అందరూ సమాయత్తం కావాల తెలిపారు.
Also Read: పవన్ కళ్యాణ్ కి చిత్తశుద్ధి ఉంటే ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి - జక్కంపూడి రాజా డిమాండ్
కార్యకర్తల విషయంలో గతంలో జరిగిన తప్పిదాలు ఇకపై జరగబోవని హామీ ఇచ్చారు వెంకటరామిరెడ్డి. తప్పకుండా పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేస్తున్నారని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొందామన్నారు. ఈ సమావేశంలోనే వైసీపీ బలోపేతంపై నియోజకవర్గాల సమన్వయకర్తలు సూచనలు, సలహాలు ఇచ్చారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేద్దామని, అందరూ ఐకమత్యంతో కలిసి ముందుకెళ్దామని పిలుపునిచ్చారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన అనంత వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలం అయ్యారని ఆరోపించారు. ధనార్జనే ధ్యేయంగా టీడీపీ కూటమి నేతలు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై పోరాటాలు ఉద్ధృతం చేస్తామన్నారు. టీడీపీ కూటమి ఎమ్మెల్యేల కనుసన్నల్లో పోలీసులు పని చేయడం బాధాకరమని అన్నారు. క్షేత్రస్థాయిలో వైఎస్సార్ సీపీ ని బలోపేతం చేస్తామన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తీర్మానం చేశామని గుర్తు చేశారు వెంకటరామిరెడ్డి. వైఎస్ జగన్ కృషి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11500 కోట్లు మంజూరు అయ్యాయని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాపిటీవ్ మైన్ కేటాయించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేయాలన్నారు.
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై దీటుగా పోరాటం చేస్తామన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ వల్ల చంద్రబాబుకే నష్టం వాటిల్లిందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయని అభిప్రాయపడ్డారు. మిత్రపక్షమే టీడీపీని మింగేస్తుందని రాజకీయ విశ్లేషకులు బహిరంగంగా చెబుతున్నారని తెలిపారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతుక పనిచేస్తుందన్నారు.






















