Sachin Vs Team India: సచిన్ కూడా బాడీగార్డు వాడలేదు, మీకెందుకు..? బాలీవుడ్ కల్చర్ ను ఫాలో కావద్దు.. భారత క్రికెటర్లపై మాజీ క్రికెటర్ ఫైర్
బీసీసీఐ రూపొందించిన పది పాయింట్ల మార్గదర్శకాలపై చర్చ జరుగుతోంది. అభిమానలుతోపాటు మాజీ ప్లేయర్లు కూడా స్వాగతిస్తున్నారు. గతంలో ఇవి ఉండేవని, వాటిని ఎవరు టాంపర్ చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

BCCI New Guidelines: టీమిండియా ఇటీవలి ఘోర ప్రదర్శనల రిత్యా బీసీసీఐ తీసుకొచ్చిన పది పాయింట్ల మార్గదర్శకాలను మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సమర్థించాడు. జట్టులో కొన్నిఅనవసర పోకడలు ఉన్నాయని, వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమా తారాల్ల క్రికెటర్లు ఫీలవుతున్నారని, ఇది సరికాదాని పేర్కొన్నారు. గతేడాది సెకండ్ హాఫ్ నుంచి భారత టెస్టు క్రికెట్లో పతనం ప్రారంభమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సొంతగడ్డపై న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో టీమిండియా క్లీన్ స్వీప్ కు గురైంది. దీంతో 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయింది. అలాగే ఆసీస్ పర్యటనలో 1-3తో ఐదు టెస్టుల బోర్డర్- గావస్కర్ ట్రోఫినీ ఓడిపోయింది. దీంతో పదేళ్ల తర్వాత బీజీటీని ఆసీసీ కైవసం చేసుకుంది. అప్పటి నుంచి టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ ద్వయం విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ స్థానాలపై ప్రశ్నలు రేకెత్తాయి. దీంతో బీసీసీఐ నష్ట నివారణ చర్యలకు గాను పది పాయింట్ల గైడ్ లైన్లను తీసుకొచ్చింది.
సచిన్ కూడా అలా చేయలేదు..
టీమిండియాలో బాలీవుడ్ కల్చర్ పెరుగుతుందని, సొంత బాడీగార్డులను ప్లేయర్లు ఉపయోగించడంపై సంజయ్ మంజ్రేకర్ ఫైరయ్యాడు. తాము క్రికెట్ ఆడే రోజుల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రేజ్ ఆకాశంలో ఉండేదని, తానెప్పుడు బౌన్సర్లను గానీ వ్యక్తగత భద్రతా సిబ్బందిని కానీ వాడలేదని గుర్తు చేశాడు. సిరీస్ ఆద్యంతం జట్టుతోనే ఉండేవాడని, మధ్యలో విరామం తీసుకునేవాడు కదాని వెల్లడించాడు. ప్రస్తుతం కొంతమంది క్రికెటర్లు మ్యాచ్ నిర్ణీత సమయానికి ముందే అయిపోయి, తర్వాత మ్యాచ్ కు మధ్య గ్యాప్ ఉన్నట్లయితే జట్టును వదిలి ఇంటికి వెళ్లిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇది సరికాదని మంజ్రేకర్ తెలిపాడు. జట్టుతోనే కలిసి ప్లేయర్లంతా ఉండాలని, భద్రతా వ్యవహారాలు టీమ్ మేనేజ్మెంట్ చూసుకుంటుందని తెలిపాడు. నిజానికి బోర్డు మంచి మార్గదర్శకాలు ఏర్పాటు చేసిందని, అయితే ఇలాంటివి జట్టు ఘోర ప్రదర్శన చేసేటప్పుడు కాకుండా, విజయంవంతంగా ఉన్నప్పుడు చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉండేదని తెలిపాడు. ఇప్పుడు జట్టు వైఫల్యాల నుంచి ఫోకస్.. ఈ గైడ్ లైన్లపైకి మళ్లిందని పరోక్షంగా అన్నాడు.
ఫ్యామిలీతో గడపాలనుకుంటే బ్రేక్ తీసుకోండి..
ఆటగాళ్లు ఎంతో ఒత్తడితో కూడుకుని ఉన్న క్రికెటింగ్ కెరీర్లో ఉన్నారని, అలాంటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని మంజ్రేకర్ సూచించాడు. ఫ్యామిలీని మిస్సయ్యామని భావిస్తే, ఆట నుంచి బ్రేక్ తీసుకుని, ఫ్యామిలీతోనే గడపాలని సూచించాడు. తాము ఆడేరోజుల్లో చిన్న టూర్లకు కుటుంబ సభ్యులు వచ్చేవారు కాదని, సుదీర్ఘ టూర్లో అది కూడా చివరి రెండు వారాలకు మాత్రమే ఫ్యామిలీలు వచ్చేవని తెలిపాడు. ఏ నిర్ణయమైన ఆటగాని చేతిలో ఉంటుందని, ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటూ బ్రేక్ తీసుకోవాలని తెలిపాడు. మరోవైపు తన గైడ్ లైన్లలో బీసీసీఐ కఠినమైన మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని పాటించకపోతే మ్యాచ్ ఫీజులో కోతతోపాటు సస్పెన్షన్, ఐపీఎల్ లాంటి టోర్నీల నుంచి ఉద్వాసన పలకడం ఖాయమని పేర్కొంది. ముఖ్యంగా దేశవాళీల్లో అందరూ ప్లేయర్లు ఆడాలని ఆదేశించింది.
Also Read: ICC Champions Trophy: ఆ ప్లేయర్ టీనేజరేం కాదు.. బెంచ్ పై కూర్చోపెట్టి అవమానించొద్దు.. తప్పకుండా ఆడించాల్సిందే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

