Nag Mark-2: భారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం - నాగ్‌మార్క్-2 క్షిపణి ప్రయోగం విజయవంతం
New Missile: భారత రక్షణ దళం మరింత పటిష్ఠ పరిచేలా నాగ్‌మార్క్-2 క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఫైర్‌అండ్ ఫర్‌గెట్ టెక్నాలజీతో పని చేసే ఈ క్షిపణి అత్యంత కచ్చితంగా లక్ష్యాలను ఛేదిస్తుంది.
Nag Mark-2: భారత రక్షణ వ్యవస్థలో మరో కీలక ముందడుగు పడింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి నాగ్ మార్క్-2( Nag Mark-2)ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్(Pokhran)లో ఈ క్షిపణిని రక్షణదళ అధికారులు పరీక్షించారు. మూడో తరానికి చెందిన ఫైర్ అండ్ ఫొర్గెట్ క్షిపణి (Missile)అయిన నాగ్‌మార్క్-2 అనుకున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. మొత్తం మూడుసార్లు ఈ క్షిపణిని ప్రయోగించగా... అన్నిసార్లు కచ్చితత్వమైన టార్గెట్‌ను చేరుకుంది. ఈ క్షిపణి గరిష్ఠ, కనిష్ఠ లక్ష్యాలను(Targets) ఛేదించడంతో దీని పరిధి సైతం నిర్థరించారు. నాగ్ క్షిపణికి సంబంధించిన క్యారియర్ వెర్షన్-2 కూడా పరీక్షించినట్లు వారు వివరించారు. పూర్తిస్థాయిలో పరీక్షలన్నీ పూర్తవ్వడం... అనుకున్న లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించడంతో నాగ్ ఆయుధ వ్యవస్థ మొత్తం... భారత సైన్యం(Indian Army)లో ప్రవేశించేందుకు సిద్ధమైంది. నాగ్‌మార్క్-2 పరీక్ష విజయవంతంతో భారత్ సత్తా మరోసారి ప్రపంచానికి చాటామని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh)అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో పాలుపంచుకున్న సిబ్బందితో పాటు DRDO, భారత సైన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Nag Mk2 Anti-Tank Fire-and-Forget Guided Missile destroyed precisely all the targets at maximum and minimum range during Field Evaluation Trials at Pokhran, thus validating its firing range and making system ready for inductionhttps://t.co/k5RlQQjhpv pic.twitter.com/oAKoIdUFtu
— DRDO (@DRDO_India) January 13, 2025
అత్యంత కచ్చితత్వం
ఫైర్ అండ్ ఫర్‌గెట్ టెక్నాలజీ ద్వారా పనిచేసే ఈ క్షిపణి ప్రయోగానికి ముందు లాక్ చేయవచ్చు. అలాగే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇది టార్గెట్‌ను కచ్చితంగా చేరుకుంటుంది. పేలుడు రియాక్టర్ ఆర్మర్ సహా ఆధునిక ఆర్మర్డ్ బెదిరింపులను నిలువరించడానికి రూపొందించిన నాగ్‌మార్క్-2(Nag Mark -2) భారత సైన్యానికి బహుముఖ ఆయుధ వ్యవస్థలాంటింది. అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన యుద్ధ ట్యాంకులను ఈ క్షిపణి సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అలాగే యుద్ధక్షేత్రంలోకి దీన్ని తీసుకెళ్లడం, ప్రయోగించడం కూడా అత్యంత సలుభతరమని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్షిపణిని భారత సైన్యంలో చేర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు DRDO ఛైర్మన్ సమీర్ V.కామత్ తెలిపారు. గతేడాది ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4ను భారత రక్షణదళం ప్రయోగించగా...అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది.
నాగ్‌మార్క్-2 గురించి మరిన్ని వివరాలు
* నాగ్ మార్క్ 2 క్షిపణి దేశీయంగా అభివృద్ధి చేసిన మూడోతరం ఫైర్ అండ్ ఫర్గెట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి
* ప్రయోగ దశలో గరిష్ఠ,కనిష్ఠ దూరాలను నాగ్‌మార్క్-2 అత్యంత ఖచ్చితంగా ఛేదించింది. దీంతో ఈ క్షిపణి రేంజ్ ఎంతో నిర్థరించడం జరిగింది.
* ఈ క్షిపణి అధునాత ఫైర్ అండ్ ఫర్‌గెట్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ప్రయోగించడానికి ముందే నిర్ధేశిత లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో లాక్ చేయవచ్చు. అలాగే యుద్ధభూమిలోనూ ఇది అంతే ఖచ్చితత్వంతో టార్గెట్‌లను కొల్లగొడుతుంది.
చైనాకు కళ్లెం
సరిహద్దు అవతల దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు కళ్లెం వేసేందుకు నాగ్‌మార్క్-2 క్షిపణి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా అరుణాచల్ భూభాగంలోకి చొచ్చుకొస్తున్న చైనాను నిలువరించేందుకు ఇలాంటి ప్రయోగాలు ఎంతో స్ఫూర్తినిస్తాయని రక్షణ రంగ నిపుణులు తెలిపారు. ఆక్రమిత పాక్‌లో చైనా పెద్ద రోడ్డు మార్గాలను నిర్మిస్తోంది. దీని ద్వారా యుద్ధ ట్యాంకులను ఆయా ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. వాటిని ఎదుర్కొవాలంటే భారత్‌కు అత్యాధునిక ట్యాంకు విధ్వంసక క్షిపణులు ఎంతో అవసరం.