Nargis Fakhri Haunted Story: 'నా ఫ్లాట్ పక్కనే స్మశానం.. ఒక దెయ్యం రోజూ నన్ను స్మశానానికి తీసుకెళ్లేది'
ముంబైలోని అపార్ట్‌మెంట్ లో తనకు ఎదురైన భయానక అనుభవాన్ని గుర్తు చేసుకుంది హీరోయిన్ నర్గీష్ ఫక్రీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన 'హాంటింగ్' కథను పంచుకుంది.
బాలీవుడ్ బ్యూటీ నర్గీష్ ఫక్రీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. న్యూయార్క్ నుంచి వచ్చిన ఈ అమెరికన్ మోడల్.. హిందీ సినిమాలలో హీరోయిన్ గా, ఐటమ్ గర్ల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే ఇండియాకి వచ్చిన కొత్తలో ముంబై అపార్ట్మెంట్ లో తనకు ఎదురైన భయంకరమైన అనుభవం గురించి తెలిపింది నర్గీస్.
ఇటీవల నర్గీస్ ఫక్రీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముంబైలో తన అపార్ట్‌మెంట్ పక్కనే స్మశానవాటిక ఉండేదని, ఆ ఇంట్లో ఎదురైన విచిత్రమైన అనుభవాల కారణంగానే ఢిల్లీకి వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెప్పింది. "బాంద్రాలోని హిల్ రోడ్ లో నాకు అపార్ట్‌మెంట్ దొరికింది. ఇంటికి దగ్గరలో ఓ శ్మశానవాటిక ఉండేది. ఆ అపార్ట్ మెంట్ లో ఉన్న సమయంలో నాకు రోజూ భయంకరమైన కలలు వచ్చేవి. రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు. భయంతో నేను వణికిపోయేదాన్ని రాత్రి మూడు గంటలకే నిద్ర లేచేదాన్ని" అని నర్గీస్ తెలిపింది.
"6 అడుగులు ఉండే ఓ దెయ్యం లాంటి వ్యక్తి అర్ధరాత్రి సమయంలో నన్ను బలవంతంగా స్మశానానికి తీసుకెళ్లేవాడు. చేతులతోనే సమాధులను తవ్వి శవాలను తినేవాడు. నన్ను కూడా ఆ ఎముకలను తినమని అడిగేవాడు. అదే పీడ కల నాకు వరుసగా మూడు నాలుగు రోజులు వచ్చింది. భయంతో వెంటనే మా టీమ్ కి చెప్పి, ఆ ఇల్లు వదిలేసి ఢిల్లీకి వచ్చేశాను" అని నర్గీస్ ఫక్రీ చెప్పుకొచ్చింది.
Read Also: వాస్తవ సంఘటన ఆధారంగా వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ 'మట్కా'
అయితే ముంబై అపార్ట్మెంట్ ఖాళీ చేసేటప్పుడు తన క్యాబినెట్ లో ఆరు పక్షి పిల్లలు చనిపోయాయి ఉన్నాయని ప్యాకర్స్ చెప్పారు. అది నాకు విచిత్రంగా అనిపించింది. అక్కడ ఏమి జరిగిందో నాకు అర్థం కాలేదు" అంటూ ఆ భయానక రోజులని నర్గీస్ గుర్తు చేసుకుంది. అంతేకాదు ఆ ఇంట్లో ఉన్న మూడు రోజుల్లోనే పనిమనిషి తన నగలను దొంగతనం చేసిందని చెప్పింది.
కాగా, మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నర్గీస్ ఫక్రీ.. 2011లో 'రాక్ స్టార్' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. మద్రాస్ కేఫ్, మెయిన్ తేరా హీరో, అజహర్, హౌస్ ఫుల్, బాంజో, వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని స్పెషల్ సాంగ్స్ చేసింది. 'స్పై' అనే హాలీవుడ్ చిత్రంలో కూడా కనిపించింది. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'హరి హర వీరమల్లు' చిత్రంలో రోషనార పాత్రలో నర్గీస్ నటిస్తోంది. క్రిష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇక నర్గీస్ త్వరలోనే ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతోంది.
Read Also: 1000 మంది డ్యాన్సర్లతో షారుఖ్ ఆట - ‘జవాన్’ పాటకు పెట్టిన ఖర్చుతో 2 చిన్న సినిమాలు తీయొచ్చు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial