Ranveer Singh: ‘యానిమల్’ మూవీపై రణవీర్ సింగ్ రివ్యూ - ఆశ్చర్యపోయిన దర్శకుడు
Animal Movie: ‘యానిమల్’ మూవీ ఎంతోమంది సినీ సెలబ్రిటీల ప్రశంసలు అందుకుంది. కానీ హీరో రణవీర్ సింగ్ ఈ మూవీపై ఇచ్చిన రివ్యూ మాత్రం దర్శకుడిని ఆశ్చర్యపరిచిందట.
Ranveer Singh Review on Animal: సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకులు ఎంతగా ఫిదా అయ్యారో.. సినీ సెలబ్రిటీలు కూడా అదే విధంగా ఆదరించారు. చాలామంది సినీ సెలబ్రిటీలు ‘యానిమల్’ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అందులో కొందరు ఈ సినిమాను విమర్శించారు కూడా. అయినా ‘యానిమల్’ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. 3 గంటల 21 నిమిషాల నిడివితో థియేటర్లలో విడుదలయిన ఈ మూవీని మళ్లీ మళ్లీ చూడడానికి ప్రేక్షకులు ముందుకొచ్చారు. ఇక ‘యానిమల్’ చూసిన తర్వాత రణవీర్ సింగ్ రియాక్షన్ ఏంటో దర్శకుడు బయటపెట్టాడు.
రణవీర్ సింగ్ రివ్యూ..
‘యానిమల్’ సినిమా చూసిన తర్వాత పలువురు సినీ సెలబ్రిటీలు తనతో పర్సనల్‌గా రివ్యూలను షేర్ చేసుకున్నారని ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బయటపెట్టాడు. మూవీ విడుదలయ్యి ఇన్ని రోజులు అయినా.. ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకున్నా కూడా సందీప్ ఇంటర్వ్యూలలో పాల్గొనడం మాత్రం ఆపడం లేదు. అలా తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ‘యానిమల్’ చూసిన తర్వాత హీరో రణవీర్ సింగ్ రియాక్షన్ ఏంటని ఈ దర్శకుడు బయటపెట్టాడు. రణవీర్ సింగ్ ఇచ్చిన రివ్యూను తాను మర్చిపోలేనని, అంతే కాకుండా అది తాను ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగా.
నాలుగుసార్లు చదువుకున్నా..
‘యానిమల్’ చూసిన తర్వాత రణవీర్ సింగ్ తనకు ఫోన్ చేసి 40 నిమిషాల పాటు మాట్లాడాడని సందీప్ రెడ్డి వంగా బయటపెట్టాడు. ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత సినిమాను పొగుడుతూ ఒక పెద్ద మెసేజ్ కూడా పెట్టాడట. ఆ మెసేజ్ తాను నాలుగు సార్లు చదువుకున్నానని, అది చదివిన ప్రతీసారి తనకు చాలా ఆనందం కలిగిందని సంతోషాన్ని బయటపెట్టాడు సందీప్. సినిమా గురించి చాలా విషయాలను ఆ మెసేజ్‌లో రాశాడని, అందులో అన్ని విశేషాలు ఉన్నాయా అని తానే ఆశ్చర్యపోయానని తెలిపాడు. రణవీర్ సింగ్ మాత్రమే కాదు.. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సైతం ‘యానిమల్’లోని ప్రతీ అంశాన్ని ఇష్టపడడంతో పాటు పలు సందర్భాల్లో ఆ ఇష్టాన్ని బయటపెట్టారు కూడా.
రీమేక్స్ చేయడు..
ఇక ‘యానిమల్’ మూవీని చూసిన ప్రేక్షకులు ‘కబీర్ సింగ్’ పాత్రకు కూడా రణబీర్ కపూరే సూట్ అవుతాడు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించాడు. రణబీర్ కపూర్‌కు ముందు నుండి రీమేక్‌లు చేయడం అంటే నచ్చదు. అదే విషయాన్ని ‘కబీర్ సింగ్’ సమయంలో సందీప్‌తో చెప్పాడట. అందుకే ఆ సినిమాతో తనతో చేయలేదని, ‘యానిమల్’ను వర్కవుట్ అయ్యేలా చేశానని దర్శకుడు రివీల్ చేశాడు. ఇక ‘యానిమల్’కు సీక్వెల్‌గా త్వరలోనే ‘యానిమల్ పార్క్’ కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ‘యానిమల్’కంటే సీక్వెల్‌లో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయని, ఎక్కువ థ్రిల్లింగ్‌గా ఉంటుందని సందీప్ బయటపెట్టాడు. ఇందులో ఊహించని యాక్షన్ ఉంటుందని, రణబీర్ కపూర్ పాత్ర కూడా మరింత వైలెంట్‌గా ఉంటుందన్నాడు.
Also Read: ఈవారం థియేటర్, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే