Animal Park Update : 'యానిమల్' సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడో తెలుసా?
Animal : మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ 'యానిమల్' పార్క్ సినిమా గురించి తాజాగా రణబీర్ కపూర్ మాట్లాడారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలు కాబోతోంది అనే క్రేజీ అప్డేట్ ను ఆయన షేర్ చేసుకున్నారు.
Ranbir Kapoor : బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ గత రెండు సినిమాలు 'బ్రహ్మాస్త్ర', 'యానిమల్'లతో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సూపర్ సక్సెస్ తో దూసుకెళ్తున్న రణబీర్ కపూర్ ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ కూడా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే బ్రహ్మస్త్ర, యానిమల్ సినిమాలలో ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తున్నది మాత్రం 'యానిమల్' సీక్వెల్ గురించే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్లను ఇచ్చారు. ముఖ్యంగా 'యానిమల్' సీక్వెల్ గురించి ఆయన ఇచ్చిన క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోవాల్సిందే.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన 'యానిమల్' మూవీ 2023 ఎండింగ్లో రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందనే విషయాన్ని అప్పుడే ప్రకటించారు. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి కలిసి ఈ సీక్వెల్ ను స్టార్ట్ చేస్తారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం రణబీర్ కపూర్... నితీష్ తివారి దర్శకత్వంలో 'రామాయణం' సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన రాముడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జెడ్డాలో జరుగుతున్న రెడ్ సీ ఫెస్టివల్ సందర్భంగా రణబీర్ కపూర్ మీడియాతో మాట్లాడుతూ 'యానిమల్ పార్క్' షూటింగ్ ను ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారో వెల్లడించారు.
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా మరో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా, 'యానిమల్ పార్క్' మూవీ 2027లో సెట్స్ పైకి వెళ్తుందని రణబీర్ కపూర్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ 'యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను మూడు భాగాలుగా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడు. రెండవ భాగానికి యానిమల్ పార్క్ అనే టైటిల్ ను పెట్టాము" అని చెప్పుకొచ్చారు. అంతేకాదు 'యానిమల్ పార్క్' లో తన పాత్ర ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా వివరంగా చెప్పుకొచ్చారు రణబీర్ కపూర్. సీక్వెల్లో తను రెండు పాత్రలు పోషించబోతున్నానని చెప్తూ ఎగ్జైట్ అయ్యారు. అందులో ఒకటి హీరో కాగా, మరొకటి విలన్.
"ఎందుకంటే యానిమల్ క్లైమాక్స్ లో విలన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని, హీరోలా మారిపోతాడు. కాబట్టి సీక్వెల్ యానిమల్ పార్క్ అక్కడ నుంచి స్టార్ట్ కాబోతోంది" అని 'యానిమల్' సీక్వెల్ లో తన పాత్ర రెండు విభిన్నమైన షేడ్ లో ఉండబోతోందనే విషయాన్ని రణబీర్ కపూర్ వెల్లడించారు. ఇక 'బ్రహ్మస్త్రా' విషయానికి వస్తే, అది ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉందని, ఈ మూవీ మొదటి భాగానికి 'శివ' అనే టైటిల్ని పెట్టగా, రెండో భాగానికి 'దేవ్' అనే పేరు పెట్టాము అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పార్ట్ 2 లో కూడా అలియా భట్ కూడా భాగం కాబోతుందని కన్ఫర్మ్ చేశారు.
కాగా ప్రస్తుతం రణబీర్ కపూర్ 'రామాయణం పార్ట్ 1' షూటింగ్ను పూర్తి చేశారు. ఇందులో సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, యష్ రావణునిగా నటిస్తున్నారు. మరోవైపు విక్కీ కౌశల్ తో కలిసి సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ అండ్ మోర్' షూటింగ్లో అలియా, రణబీర్ బిజీగా ఉన్నారు. ఇక సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో 'స్పిరిట్' అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే .
Also Read: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్