Coolie Movie: రజినీకాంత్ 'కూలీ' మూవీ షూటింగ్ కంప్లీట్ - స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన మూవీ టీం, రిలీజ్ డేట్ ఎప్పుడో?
Rajinikanth Movie: సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ మూవీ 'కూలీ' షూటింగ్ పూర్తైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది.

Rajini Kanth's Coolie Movie Shooting Completed: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబో అవెయిటెడ్ మూవీ 'కూలీ' (Coolie). ఈ మూవీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, ఈ మూవీపై ఫ్యాన్స్‌కు టీం అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది.
స్పెషల్ వీడియో రిలీజ్
'కూలీ' మూవీ షూటింగ్ పూర్తైందని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. రజినిపై తీసిన కొన్ని మేకింగ్ సీన్స్ వీడియోలో చూపించారు. అలాగే, నాగార్జున, సౌబిన్, శ్రుతిహాసన్, సత్యరాజ్ కూడా కనిపించారు. అయితే, మూవీలో ఉపేంద్ర నటిస్తుండగా ఆయన్ను వీడియోలో ఎక్కడా చూపించలేదు. హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నారు.
It's a super wrap for #Coolie 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @Dir_Chandhru @PraveenRaja_Off pic.twitter.com/ulcecQKII1
— Sun Pictures (@sunpictures) March 17, 2025
రిలీజ్ డేట్ ఎప్పుడు..?
ఈ మూవీ రిలీజ్ ఎప్పుడా..? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా వారి సస్పెన్స్ వీడలేదు. రిలీజ్ డేట్‌కు సంబంధించి మూవీ టీం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో వస్తోన్న ఈ మూవీలో కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్‌లో చేస్తుండగా.. ఉపేంద్ర, సౌబిన్, శ్రుతిహాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు.
#Coolie filming wrapped🌟@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @Dir_Chandhru @PraveenRaja_Off pic.twitter.com/571wwp1Gi0
— Sun Pictures (@sunpictures) March 18, 2025
సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్'తో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన 'వేట్టయాన్' మంచి టాక్ సాధించినా వసూళ్లు అనుకున్నంతగా రాలేదు. ఈ మూవీతో మరో హిట్ ఖాయమని రజినీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అటు, ఖైదీ, విక్రమ్, లియో వంటి హిట్ మూవీస్ తర్వాత లోకేశ్ కనగరాజ్ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ 'అమెజాన్ ప్రైమ్ వీడియోస్' దాదాపు రూ.120 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read: మరోసారి థియేటర్లలోకి బాలకృష్ణ 'ఆదిత్య 369' - ఈ సమ్మర్‌కు వచ్చేస్తోంది, రీ రిలీజ్ ఎప్పుడో తెలుసా..?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

