By: ABP Desam | Updated at : 05 Mar 2022 08:20 AM (IST)
ప్రభాస్
'రాధే శ్యామ్' బడ్జెట్ ఎంత? యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ హీరో ప్రభాస్ మాటల్లో చెప్పాలంటే... 300 కోట్ల రూపాయలు. అవును... ప్రేమకథను దృశ్య కావ్యంగా తెరకెక్కించే క్రమంలో అంత ఖర్చు పెట్టారు. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో సినిమా బడ్జెట్ రివీల్ చేశారు ప్రభాస్. ఇంకా ఓ రిక్వెస్ట్ కూడా చేశారు.
'ప్రేమకు, విధికి జరిగిన యుద్ధం' అంటూ 'రాధే శ్యామ్'ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. చివరకు... ప్రేమ గెలిచిందా? విధి గెలిచిందా? ఈ సందేహం ఓ తమిళ విలేకరికి వచ్చింది. ప్రభాస్‌ను అడిగారు. "అది ఎలా చెబుతాను సార్? కనీసం 50 రూపాయల టికెట్ అయినా కొని సినిమా చూడండి. ప్రొడ్యూసర్స్ రూ. 300 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు. ఇప్పుడు నేను మీ ప్రశ్నకు సమాధానం చెబితే నన్ను చంపేస్తారు" అని ప్రభాస్ సమాధానం ఇవ్వడంతో అందరూ ఒక్కసారి నవ్వేశారు.
Also Read: 'రాధే శ్యామ్'లో మరో హీరోయిన్! రిలీజ్ ట్రైలర్‌లో ఆ అమ్మాయిని గుర్తు పట్టారా?
'రాధే శ్యామ్' సినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటించిన సంగతి తెలిసిందే. ఆయన జోడీగా ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీధ 'రాధే శ్యామ్' సినిమాను నిర్మించారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
Also Read: తమన్ ట్వీట్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి! ఎందుకంటే?
Kiran Abbavaram: సొంతింటి కలను నెరవేర్చుకున్న కిరణ్ అబ్బవరం - కొత్త ఇంట్లో సందడి చూశారా?
'ఆర్.ఆర్.ఆర్, 'పుష్ప' సినిమాల్లో ఏముందని చూడటానికి? బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా షాకింగ్ కామెంట్స్
'జవాన్' మూవీపై స్పందించిన దళపతి విజయ్ - షారుఖ్ రిప్లై ఇది!
సినిమాలకి బ్రేక్ ఇచ్చినా తగ్గని సమంత క్రేజ్ - సోషల్ మీడియాలో సామ్ నయా రికార్డ్!
'స్కంద'కి సీక్వెల్ - థియేటర్స్‌లో సర్ప్రైజ్ చేసిన బోయపాటి, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !
Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర
Nara Bramhani Politics : టీడీపీలో మోస్ట్ వాంటెడ్ లీడర్‌గా నారా బ్రాహ్మణి - రాజకీయాల్ని ఇక సీరియస్‌గా తీసుకుంటారా ?
Vivo Price Cut: రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో - ఇప్పుడు రూ.12 వేల లోపుకే!
/body>