Thaman - Radhe Shyam Movie: తమన్ ట్వీట్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి! ఎందుకంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'రాధే శ్యామ్' మీద సంగీత దర్శకుడు తమన్ అంచనాలు పెంచేస్తున్నారు. ఆయన ట్వీట్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
![Thaman - Radhe Shyam Movie: తమన్ ట్వీట్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి! ఎందుకంటే? Radhe Shyam Movie Update Music Director Thaman raises expectations on Prabhas, Pooja Hegde starrer Radhe Shyam movie Thaman - Radhe Shyam Movie: తమన్ ట్వీట్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి! ఎందుకంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/28/84aabe0d0d273f4667d86092826a8ab3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'రాధే శ్యామ్'పై సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ అంచనాలు పెంచేస్తున్నారు. ఈ సినిమాకు ఆయన నేపథ్య సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ విడుదలైన పాటలకు మాత్రం వేరే సంగీత దర్శకులు పాటలు అందించారు. 'భీమ్లా నాయక్' విడుదల తర్వాత ఈ సినిమా పనుల మీద తమన్ దృష్టి పెట్టారు. 'రాధే శ్యామ్' సినిమాకు సంబంధించి ఆయన చేస్తున్న ట్వీట్స్, ప్రభాస్ ఫ్యాన్స్‌కు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే... సినిమాపై నెలకొన్న అంచనాలను తమన్ విపరీతంగా పెంచేస్తున్నారు.
"ఈ సినిమా (రాధే శ్యామ్) కోసం మనసు పెట్టి పని చేస్తున్నాను. ఈ సినిమాపై నా ప్రేమను వ్యక్తం చేయడానికి ఎమోజీలు సరిపోవు. 'రాధే శ్యామ్' సినిమాలో పెర్ఫార్మన్స్‌లు, సంగీతం, విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ నేను మరోసారి ప్రేమలో పడేలా చేశాడు. నా హృదయాన్ని చాలా బలంగా తాకిందీ సినిమా. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునేలా చేశాడు రాధాకృష్ణ కుమార్" అని తమన్ ట్వీట్ చేశారు.
Also Read: పెళ్లి ఎందుకు కాలేదు ప్రభాస్? - పూజా హెగ్డే ప్రశ్న!
PUT My heart ❤️ for this Film #BlockBusterRadheShyam 🧿💕💗❤️♥️
— thaman S (@MusicThaman) February 27, 2022
Emojis on hearts Not Enough to express my love 😍 !! #RadheShyamOnMarch11 Will be Romantic Spectacle One ▶️ Creamy Sound and Lusshy Visuals 💕💗 pic.twitter.com/yxHGjOH3oX
This Guy !! Made me Fall in love 🥰 Again 💃💕
— thaman S (@MusicThaman) February 28, 2022
After a long time feeling the butterflies 🦋 in Stomach !! 🍭 @director_radhaa Dude !! U have Made me find A New me and Hit my Heart very hard !! 💗 #BlockBusterRadheShyam #RadheShyamOnMarch11th 🦋🦋🦋🦋 pic.twitter.com/3WFfVYzi67
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన చిత్రమిది. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Also Read: అమితాబ్ బచ్చన్‌ను 'రాధే శ్యామ్'లోకి అలా తీసుకొచ్చిన ప్రభాస్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)