Radhe Shyam Valentine Glimpse: పెళ్లి ఎందుకు కాలేదు ప్రభాస్? - పూజా హెగ్డే ప్రశ్న! 'రాధే శ్యామ్' వాలంటైన్ గ్లింప్స్ చూశారా?
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధే శ్యామ్'. ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు.
ప్రేమకథా చిత్రానికి ప్రేమికుల రోజు కంటే మించిన సందర్భం ఏం ఉంటుంది? అందుకే, ఈ రోజు 'రాధే శ్యామ్' సినిమా నుంచి స్పెషల్ వాలెంటైన్ గ్లింప్స్ విడుదల చేశారు. లవ్ ఫీల్‌తో సాగిన ఈ ప్రచార చిత్రం ఎలా ఉందో చూడండి.
విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్న సినిమా 'రాధే శ్యామ్'. ఆల్రెడీ విడుదలైన పాటల్లో విజువల్స్ ప్రేక్షకులకు నచ్చాయి. ఇప్పుడీ గ్లింప్స్ చూస్తే... 'మళ్ళీ లైఫ్ లో వాడి మొహం చూడను' అని పూజా హెగ్డే చెప్పిన డైలాగ్‌తో ప్రారంభం అయ్యింది. ఓ బస్‌లో ఉన్న ప్రభాస్, మరో బస్‌తో పూజా హెగ్డేను పిలవడం... ఆ తర్వాత విజువల్స్ కూడా బావున్నాయి. 'మన హాస్పటల్‌లో మన పేషెంట్స్ ముందు నీకు ముద్దు పెడతానని అంటాడా?' అని మరో డైలాగ్ కూడా ఉంది. బహుశా... పూజా హెగ్డేతో ఆమె ఫ్రెండ్ చెప్పే డైలాగ్ అయ్యి ఉంటుంది. 'కుక్ చేస్తావ్. బాగా మాట్లాడతావ్. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లి ఎందుకు కాలేదు?' అని ప్రభాస్‌ను పూజా హెగ్డే అడగటం బావుంది.
Also Read: 'నాకు మొదటి నుంచి రికార్డ్స్ బ్రేక్ చేయడమే అలవాటు' పునీత్ 'జేమ్స్' టీజర్ రిలీజ్ చేసిన ప్రభాస్
కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, భాగ్య శ్రీ, మురళీ శర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన 'రాధే శ్యామ్' సినిమాను గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించారు. హిందీలో టీ - సిరీస్ నిర్మాణ భాగస్వామి. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందించగా... మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ హిందీలో పాటలకు స్వరాలు అందించారు.
Also Read: పరువు తీశావయ్యా చిరంజీవి, జగన్‌ను అడుక్కోవాలా? తమ్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
View this post on Instagram