Work For Free: వాట్ యాన్ ఐడియా! శాలరీ లేకుండా ఫ్రీగా జాబ్ చేస్తానంటూ టెకీ పోస్ట్ - స్కిల్స్ చూస్తే షాక్
Viral News: రెండేళ్లు ప్రయత్నించినా ఉద్యోగం దొరకకపోవడంతో బెంగళూరుకు చెందిన టెకీ వినూత్నంగా ఆలోచించాడు. జీతం తీసుకోకుండా పనిచేస్తా, జాబ్ ఇవ్వాలని చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

BTech Graduate Offers To Work For Free Remotely | బెంగళూరు: దేశంలో నిరుద్యోగం ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. బయటకు వచ్చే విద్యార్థులు ఎక్కువ, జాబ్స్ తక్కువ కావడంతో ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో నిరుద్యోగులుగా మారుతున్నారు. స్కిల్స్ ఉన్నప్పటికీ ఎక్కడా ఉద్యోగం రాకపోవడంతో ఓ బీటెక్ గ్రాడ్యుయేట్ చేసిన ప్రయత్నం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. బెంగళూరుకు చెందిన బీటెక్ గ్రాడ్యుయేట్ సాఫ్ట్‌వేర్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరి అస్త్రాన్ని బయటకు తీశాడు. ఉచితంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోం చేయడానికి అవకాశం ఇవ్వాలని రెడ్డిట్ లో అతడు చేసిన పోస్ట్ ట్రెండింగ్ అవుతోంది.
యువకుడు రెడ్డిట్ లో చేసిన పోస్ట్ ప్రకారం.. 2023లో ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో బీటెక్ పూర్తి చేశాను. అయితే ఎక్కడా జాబ్ దొరకడం లేదు. ఉద్యోగం కోసం చేయని ప్రయత్నం లేదు. దాంతో విసికి వేసారి పోయాను. నాకు పైథాన్, జావా, డేవ్ ఆప్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మేషిన్ లెర్నింగ్ తెలుసు. వీటితో పాటు వెబ్ స్క్రాలర్స్ బిల్డ్ చేయగలను, ఏపీఐల ఇంటిగ్రేషన్, ఏఐ మోడల్స్ డెవలప్ చేయడం తనకున్న స్కిల్స్ అని వెల్లడించాడు.
తాను సీఐ/సీడీ పైప్ లైన్స్, డాకర్, క్యూబర్‌నెట్స్ లో వర్క్ చేసినట్లు తెలిపాడు. వెబ్ క్రాలర్స్, ఏపీఐ టెస్టింగ్, ఎంఎల్ సిస్టమ్స్ లో ప్రాడక్ట్ ఇంజినీర్ గా, టెక్నికల్ ఇంటర్న్‌షిప్ కూడా చేశాడు. డీప్ లెర్నింగ్ అండ్ ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ మీద ప్రాజెక్టులు, ఐఈఈఈ మీద చేసిన రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయింది. కానీ జాబ్ దొరకడం లేదు. నా స్కిల్స్ మెరుగు చేసుకోవాలని, రియల్ టైమ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ సైతం కోరుకుంటున్నాను. అందుకోసం వర్క్ ఫ్రమ్ హోం ద్వారా ఎలాంటి శాలరీ తీసుకోకుండానే ఉచితంగా జాబ్ (Work For Free) చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
Comment
byu/employed-un from discussion
inIndianWorkplace
తన అంకుల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, ఆయనకు పక్కటెముకలు విరిగి హాస్పిటల్ లో పాలయ్యారు. బెడ్ రెస్ట్ మీదున్న ఆయనకు ప్రస్తుతం తన అవసరం ఉందని.. తనకు ఎవరైనా జాబ్ ఇస్తే త్వరలోనే రిమోట్ లొకేషన్ నుంచి ఆఫీసుకు వచ్చి వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని బెంగళూరు యంగ్ టెకీ స్పష్టం చేశాడు. కోటి విద్యలు కూటి కోరకే అని పెద్దలు ఊరకే అనలేదు. కానీ రియల్ టైం ఎక్స్‌పీరియన్స్ కోసం, స్కిల్స్ సైతం మెరుగు చేసుకునేందుకు యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చేసిన ప్రయత్నానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
బ్రో నీ రెజ్యుమ్ నాకు సెండ్ చేయండి. నేను ఉద్యోగులను రిక్రూట్ చేస్తానని ఒకరు రిప్లై ఇచ్చారు. వర్క్ ఫ్రం హోం లేక హైబ్రిడ్ మోడల్ లో జాబ్ ఇస్తానని మరొకరు ఆ యువకుడి రెడ్డిట్ పోస్టుకు స్పందించారు. అతడికి జాబ్ ఇవ్వాలని, మంచి ప్రయత్నం చేశాడని మెచ్చుకుంటున్నారు. జీతం కూడా ఇవ్వాలని, లేకపోతే రోజువారీ ఖర్చులకు ఇబ్బంది అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

