Radhe Shyam Movie Update: అమితాబ్ బచ్చన్‌ను 'రాధే శ్యామ్'లోకి అలా తీసుకొచ్చిన ప్రభాస్!
ప్రభాస్ షూటింగ్ చేస్తున్న ప్రజెంట్ సినిమా 'ప్రాజెక్ట్ కె'. అందులో అమితాబ్ బచ్చన్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన్ను 'రాధే శ్యామ్'లోకి కూడా తీసుకు వచ్చారు యంగ్ రెబల్ స్టార్.
![Radhe Shyam Movie Update: అమితాబ్ బచ్చన్‌ను 'రాధే శ్యామ్'లోకి అలా తీసుకొచ్చిన ప్రభాస్! Radhe Shyam Movie Update Actor Amitabh Bachchan's Voiceover For Radhe Shyam movie Radhe Shyam Movie Update: అమితాబ్ బచ్చన్‌ను 'రాధే శ్యామ్'లోకి అలా తీసుకొచ్చిన ప్రభాస్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/22/2019b40c0a5cae00b137d7b23040fb5a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ప్రాజెక్ట్ కె'. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. అందులో అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొంటున్నారు. సినిమాలో ఆయన ఓ స్పెషల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'ప్రాజెక్ట్ కె'లో మాత్రమే కాదు... 'రాధే శ్యామ్' సినిమాలోకి అమితాబ్‌ను తీసుకు వచ్చారు ప్రభాస్. ఆ సినిమాలో ఆయన కనిపించరు... వినిపిస్తారంతే!
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధే శ్యామ్'. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 11న విడుదల కానుంది. ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే... అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్. సినిమాలో ఆయన గళం వినిపిస్తుందని ఈ రోజు 'రాధే శ్యామ్' బృందం ప్రకటించింది.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)