News
News
X

Trivikram Vs Bandla Ganesh: వైసీపీతో త్రివిక్రమ్ ప్లాన్? అందుకే, 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్‌కు బండ్ల గణేష్ దూరమా? లీక్డ్ ఫోన్ కాల్‌లో నిజమెంత?

వైసీపీతో కలిసి త్రివిక్రమ్ ఏదో ప్లాన్ చేశారని, తనను 'భీమ్లా నాయక్' ప్రీ-రిలీజ్ వేడుకకు రానివ్వడం లేదని బండ్ల గణేష్ మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్  స్పీచ్ ఒకటి లీకైంది.

FOLLOW US: 

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మధ్య రాజకీయ పరంగా పోటీ ఉంది. ఇరు పార్టీల మధ్య ఉప్పు - నిప్పు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీతో కలిసి త్రివిక్రమ్ ఏదో ప్లాన్ చేశారని బండ్ల గణేష్ మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్ ఒకటి లీకైంది. త్రివిక్రమ్ డౌన్ అవుతారని, తనను 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ వేడుకకు రానివ్వడం లేదని అందులో బండ్ల వ్యాఖ్యానించినట్టు ఉంది. అసలు, ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమానుల్లో బండ్ల గణేష్ ఒకరు. పవన్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అంటే బండ్ల గణేష్ స్పీచ్ స‌మ్‌థింగ్‌ స్పెషల్ అన్నట్టు ఉంటుంది. 'గబ్బర్ సింగ్' నుంచి 'వకీల్ సాబ్' వరకూ ఆయన తన స్పీచ్‌ల‌తో చెలరేగిపోయారు. అభిమానులకు పూనకాలు తెప్పించేలా మాట్లాడారు. ముఖ్యంగా 'ఈశ్వరా... పవనేశ్వరా' అంటూ బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ విపరీతంగా వైరల్ అయ్యింది. పవన్ లేటెస్ట్ సినిమా 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ ఏం మాట్లాడతారోనని పవన్ ఫాన్స్, బండ్ల గణేష్ స్పీచ్‌ల‌కు అభిమానులుగా మారిన ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. అయితే... 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ వేడుకకు బండ్ల గణేష్‌కు ఆహ్వానం అందలేదని కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్, మీడియా వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందులో నిజమెంత? అనేది పక్కన పెడితే...

'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బండ్ల గణేష్ వస్తున్నారా? లేదా? అనేది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఒకరు ఆయనకు ఫోన్ చేసినట్టు, అందులో త్రివిక్రమ్ మీద బండ్ల గణేష్ విమర్శలు చేసినట్టు మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్ ఒకటి వైరల్ అవుతోంది. "నేను స్పీచ్ రెడీ చేశా. కానీ, వాళ్ళు (భీమ్లా నాయక్ ఈవెంట్‌కు) పిలవలేదు. త్రివిక్రమ్ రావొద్దన్నాడట. వాడు డౌన్ అవుతానని. అదే ఆలోచిస్తున్నాను. నాకు వెళ్ళాలని ఉంది. మంచి డైలాగ్స్ కూడా రాసుకున్నాను. వైసీపీ వాళ్ళతో త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నారట" అని ఆ లీక్డ్ ఫోన్ కాల్ రికార్డింగులో బండ్ల గణేష్ వ్యాఖ్యానించినట్టు ఉంది. పవన్ కల్యాణ్‌కు త్రివిక్రమ్ ఆప్తమిత్రులు. పవన్ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయరనేది ఇండస్ట్రీ చెప్పే మాట. ఆయన వైసీపీతో కలిసి ప్లాన్ చేశారనేది తనను 'భీమ్లా నాయక్' ఈవెంట్‌కు పిలవలేదనే ఆవేశంలో బండ్ల గణేష్ చేసి ఉంటారని పవన్ అభిమానులు, ఇండస్ట్రీ జనాలు భావిస్తున్నారు.

'నువ్ లేకపోతే మేం చాలా మిస్ అవుతాం అన్నా' అని ఫోన్ చేసిన వ్యక్తి అంటే... "అందరూ బండ్లన్న ఎక్కడ? అని అరవండి. నేను వచ్చేస్తా. నేను వెంటనే వచ్చేస్తా" అని బండ్ల గణేష్ అనడం కూడా లీక్డ్ ఫోన్ కాల్ రికార్డింగులో ఉంది.

Also Read: ఇది కదా మాస్ అంటే - పవన్, రానా క్లాష్ వేరే లెవల్ - భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేసింది!

లీక్డ్ ఫోన్ కాల్ రికార్డింగులో ఉన్నది బండ్ల గణేష్ వాయిస్ అని ఇండస్ట్రీ జనాలు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బండ్ల గణేష్ కూడా అది తన వాయిస్ కాదని చెప్పలేదు. ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం ఆయన పలు ట్వీట్స్ చేశారు 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పీచ్ వీడియో క్లిప్స్ రీట్వీట్స్ చేశారు. దాంతో త్రివిక్రమ్, బండ్ల గణేష్ మధ్య ఏదో జరిగిందనే గుసగుసలు మొదలయ్యాయి. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో  సోమవారం రాత్రి జరగాల్సిన 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఈసారైనా బండ్ల గ‌ణేష్‌కు ఆహ్వానం అందుతుందో? లేదో? చూడాలి. 

Also Read: 'వేడుక చేసుకోవడానికి మనసు అంగీకరించడం లేదు' పవన్ ప్రకటన

Published at : 22 Feb 2022 09:04 AM (IST) Tags: Trivikram Bandla Ganesh Trivikram Vs Bandla Ganesh Trivikram YCP Plan Bandla Ganesh Bheemla Nayak Pre Release Event Bheemla Nayak Pre Release Latest Details

సంబంధిత కథనాలు

Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?

Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?

SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!

SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!

Prabhas: 'సీతారామం' ఎఫెక్ట్ - ప్రభాస్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్!

Prabhas: 'సీతారామం' ఎఫెక్ట్ - ప్రభాస్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్!

Bimbisara: 'బింబిసార' రేర్ ఫీట్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

Bimbisara: 'బింబిసార' రేర్ ఫీట్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

టాప్ స్టోరీస్

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?