RRB Group D Recruitment: రైల్వేలో 32,438 గ్రూప్ డి ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరి తేదీ ఎప్పుడంటే?
RRB Group D Vacancies: రైల్వేలో 32,438 గ్రూప్ డి(లెవెల్-1) పోస్టులకు జనవరి 23 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB GroupD Recruitment 2025: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) దేశ వ్యాప్తంగా వివిధ వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న మొత్తం 32,438 గ్రూప్ డి(లెవెల్-1) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీనిలో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ టీఆర్‌డీ, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ పోస్టులు ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు సమర్సించవచ్చు.
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 32,438.
* గ్రూప్ డి లెవెల్-1 పోస్టులు
పోస్టుల వారీగా ఖాళీలు..
➥ అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ): 2012 పోస్టులు
➥ అసిస్టెంట్ (వర్క్‌షాప్): 3077 పోస్టులు
➥ అసిస్టెంట్ (బ్రిడ్జ్): 301 పోస్టులు
➥ అసిస్టెంట్ లోకో షెడ్ (డిజిల్): 420 పోస్టులు
➥ అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్): 950 పోస్టులు
➥ అసిస్టెంట్ ఆపరేషన్స్(ఎలక్ట్రికల్): 744 పోస్టులు
➥ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ: 1041 పోస్టులు
➥ అసిస్టెంట్ టీఆర్‌డీ: 1381 పోస్టులు
➥ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ(వర్క్‌షాప్): 625 పోస్టులు
➥ అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్): 799 పోస్టులు
➥ అసిస్టెంట్ పీ-వే: 247 పోస్టులు
➥ అసిస్టెంట్ (సీ అండ్ డబ్ల్యూ): 2587 పోస్టులు
➥ పాయింట్స్‌మన్ బి: 5,058 పోస్టులు
➥ ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4: 13,187 పోస్టులు
రైల్వే వారీగా ఖాళీలు..
➥ వెస్ట్రన్ రైల్వే (ముంబయి): 4672 పోస్టులు
➥ నార్త్ వెస్ట్రన్ రైల్వే (జైపూర్): 1433 పోస్టులు
➥ సౌత్ వెస్ట్రన్ రైల్వే (హుబ్లి): 503 పోస్టులు
➥ వెస్ట్ సెంట్రల్ రైల్వే (జబల్‌పూర్): 1614 పోస్టులు
➥ ఈస్ట్ కోస్ట్ రైల్వే (భువనేశ్వర్): 964 పోస్టులు
➥ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (బిలాస్పూర్): 1337 పోస్టులు
➥ నార్తర్న్ రైల్వే (న్యూఢిల్లీ): 4785 పోస్టులు
➥ సదరన్ రైల్వే (చెన్నై): 2694 పోస్టులు
➥ నార్త్ ఈస్టర్న్ రైల్వే (గోరఖ్‌పూర్): 1370 పోస్టులు
➥ నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (గువాహటి): 2048 పోస్టులు
➥ ఈస్టర్న్ రైల్వే (కోల్‌కతా): 1817 పోస్టులు
➥ సెంట్రల్ రైల్వే (ముంబయి): 3244 పోస్టులు
➥ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (హాజీపూర్): 1251 పోస్టులు
➥ నార్త్ సెంట్రల్ రైల్వే (ప్రయాగ్రాజ్): 2020 పోస్టులు
➥ సౌత్ ఈస్టర్న్ రైల్వే (కోల్‌కతా): 1044 పోస్టులు
➥ సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్): 1642 పోస్టులు
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ లేదా తత్సమానం లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) మంజూరు చేసిన అప్రెంటిషిప్ సర్టిఫికెట్(NAC)తో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.07.2025 నాటికి 18 - 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది.
ప్రారంభ వేతనం: నెలకు రూ.18,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
పరీక్ష విధానం: సీబీటీలో నాలుగు ప్రధాన విభాగాలు ఉంటాయి. జనరల్ సైన్స్: 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్: 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: 30 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్: 20 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు తీసివేయబడతాయి, సరైన సమాధానానికి 1 మార్కు ఇవ్వబడుతుంది.
ముఖ్యమైన తేదీలు..
🔰 నోటిఫికేషన్ విడుదల తేదీ: 28.12.2024.
🔰 నోటిఫికేషన్ జారి తేదీ: 22.01.2025.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23.01.2025.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.02.2025.
🔰 దరఖాస్తుల సవరణకు తేదీలు: 25.02.2025 నుంచి 06.03.2025(23:59 Hrs)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

