Nithin Thammudu Movie : నితిన్ 'తమ్ముడు'లో బెంగళూరు బ్యూటీ - 'కాంతార' భామ కాకుండా మరో అమ్మాయి!
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'తమ్ముడు'. ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్. ఆమె కాకుండా మరో హీరోయిన్ ఉన్నారని తెలిసింది. ఆవిడ ఎవరంటే?
నితిన్ (Nithin) హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న సినిమా 'తమ్ముడు' (Thammudu Movie). ఈ టైటిల్ వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది పవన్ కళ్యాణ్ సినిమా. ఇప్పుడీ సినిమా చేస్తున్న హీరో, దర్శకుడు, నిర్మాత కూడా పవన్ ఫ్యాన్స్ కావడం విశేషం. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
నితిన్ సరసన 'కాంతార' సప్తమి గౌడ!
'తమ్ముడు' చిత్రంలో నితిన్ సరసన కథానాయికగా సప్తమి గౌడ (Sapthami Gowda) ను ఎంపిక చేశారు. ఆమె 'కాంతార'తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత హిందీ సినిమా 'వ్యాక్సిన్ వార్' చేశారు. అది ఈ నెలాఖరున విడుదల కానుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు నితిన్ 'తమ్ముడు'తో సప్తమి గౌడ పరిచయం కానున్నారు. ఆమె కాకుండా సినిమాలో మరో కథానాయిక కూడా ఉన్నారని తెలిసింది.
కీలక పాత్రలో వర్షా బొల్లమ్మ!
అవును... నితిన్ 'తమ్ముడు'లో వర్షా బొల్లమ్మ (Varsha Bollamma) కూడా యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. అయితే... ఆమెది కథానాయిక పాత్ర కాదు. తమిళ హిట్ '96'తో వర్షా బొల్లమ్మ గుర్తింపు తెచ్చుకున్నారు.
View this post on Instagram
తెలుగులో 'మిడిల్ క్లాస్ మెలోడీస్', 'స్వాతి ముత్యం', 'స్టాండప్ రాహుల్' సినిమాలు చేశారు. ఇప్పుడు 'తమ్ముడు' సినిమాకు సైన్ చేశారు. ఆల్రెడీ జరిగిన ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణలో కూడా పాల్గొన్నారట. నిడివి తక్కువ అయినప్పటికీ... కీలకమైన పాత్రలో వర్ష కనిపిస్తారని సమాచారం. ఒకప్పటి కథానాయిక లయ సైతం ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.
Also Read : వాట్సాప్ ఛానల్ స్టార్ట్ చేసిన తెలుగు, హిందీ హీరో హీరోయిన్లు ఎవరు? ఎవరి ఫాలోయింగ్ ఎంత?
'తమ్ముడు' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 1న షూటింగ్ స్టార్ట్ అయ్యింది. 'వకీల్ సాబ్' తర్వాత వేణు శ్రీరామ్ చేస్తున్న చిత్రమిది.
Also Read : ప్రమాదవశాత్తూ హైదరాబాద్‌లో బాలీవుడ్ యాక్టర్ మృతి
దర్శకుడిగా పరిచయమైన 'ఓ మై ఫ్రెండ్', 'మిడిల్ క్లాస్ అబ్బాయి', 'వకీల్ సాబ్'... 'దిల్' రాజు నిర్మాణ సంస్థలోనే వేణు శ్రీరామ్ సినిమాలు చేశారు. ఇప్పుడీ 'తమ్ముడు'ను కూడా ఆ సంస్థలో చేస్తున్నారు. 'దిల్', 'శ్రీనివాస కళ్యాణం' తర్వాత 'దిల్' రాజు నిర్మాణ సంస్థలో నితిన్ చేస్తున్న మూడో చిత్రమిది. ''రక్త సంబంధం కంటే అనుబంధం బలమైనది. కొత్త తమ్ముడు వస్తున్నాడు'' అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పేర్కొంది.
ఇప్పుడు నితిన్ చేస్తున్న సినిమాలకు వస్తే... వక్కంతం వంశీ దర్శకత్వంలో, సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' చేస్తున్నారు. అందులో శ్రీ లీల కథానాయిక. క్రిస్మస్ కానుకగా ఆ డిసెంబర్ 23న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కాకుండా తనకు 'భీష్మ' వంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. అందులోనూ శ్రీ లీల కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో సినిమా సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial