Union Budget 2025 Top 10 Unknown Facts | కేంద్ర బడ్జెట్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీకు తెలుసా.? | ABP Desam
నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టాక పెడుతున్న ఫస్ట్ బడ్జెట్ కావటంతో ఈ ఏడాది బడ్జెట్ పై చాలా చాలా అంచనాలు ఉన్నాయి. సేమ్ టైమ్ బడ్జెట్ ఎప్పుడు పెట్టినా కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా ఉంటాయి. ఇప్పటివరకూ ప్రవెశపెట్టిన బడ్జెట్స్ లో టాప్ 10 ఇంట్రెస్టింగ్ అంశాలు ఈ వీడియోలో.
1.
1860 సంవత్సరం ఏప్రిల్ 7న మన దేశంలో తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈస్టిండియా కంపెనీకి చెందిన జేమ్స్ విల్సన్ అనే స్కాటిష్ ఎకనమిస్ట్ అండ్ పొలిటీషియన్ భారత్ లో తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆర్కే షణ్ముఖం చెట్టి 1947 నవంబర్ 26న తొలిసారి ఆర్థికశాఖమంత్రిగా దేశంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కానీ అది మధ్యంతర బడ్జెట్ ఏడున్నర నెలల వ్యవధి కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్. సో అది స్వతంత్ర భారత్ లో ఫస్ట్ బడ్జెట్ గా హిస్టరీ బుక్స్ లో నిలిచిపోయింది.
2.
ఎప్పుడు బడ్జెట్ ప్రసంగం అయినా చాలా లెంగ్తీగా గంటల తరబడి ఉంటుంది కదా కానీ మీకెప్పుడైనా ఆలోచన వచ్చిందా అతి చిన్న బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు అని. 1977లో అప్పటి ఆర్థిక శాఖమంత్రి హీరూ భాయ్ ముల్జీ భాయ్ పటేల్ కేవలం 800పదాలతోనే వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
3.
కేంద్ర బడ్జెట్ ల్లో లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్ గా నిలిచిపోయింది ఏదో తెలుసా 2020లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2గంటల 42 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. అదే ఏడాది నుంచి ఫిబ్రవరి 1 న బడ్జెట్ ప్రసంగం చేయటం మొదలు పెట్టారు. 1999 వరకూ ఫిబ్రవరి ఆఖరి వర్కింగ్ డే రోజున బడ్జెట్ ను ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది అది కూడా సాయంత్రం 5గంటలకు. కానీ 99లో యశ్వంత్ సిన్హా దాన్ని ఉదయం 11గంటలకు మార్చారు. 2017లో అరుణ్ జైట్లీ ఈ ఫిబ్రవరి ఆఖరి వర్కింగ్ డే సంప్రదాయాన్ని మార్చేసి ఫిబ్రవరి 1 న బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిసైడ్ చేశారు.
4.
బడ్జెట్ ప్రిపేర్ చేసే ముందు హల్వా వేడుకను చేయటం సంప్రదాయంగా వస్తోంది. బడ్జెట్ పేపర్స్ తయారీలో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు ఈ హల్వా సెర్మనీలో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక శాఖమంత్రి స్వయంగా గరిటె తిప్పుతూ హల్వా తయారు చేసి ఎంప్లాయిస్ తో కలిసి తినటం అనేది సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది.
5.
1950 లో బడ్జెట్ పేపర్స్ ముందుగానే లీక్ అయ్యాయి. ఫైనాన్స్ మిస్టర్ జాన్ మథాయ్ ఉన్న టైమ్ లో ప్రింటింగ్ చేస్తున్నప్పుడు బడ్జెట్ పేపర్స్ బయటకు వచ్చేశాయి. దీంతో అప్పటి నుంచి ప్రింటింగ్ ప్రాసెస్ ను రాష్ట్రపతి భవన్ నుంచి మింటో రోడ్ కు మార్చేశారు. ఆ తర్వాత అంటే 1980ల నుంచి మింటో రోడ్ నుంచి బడ్జెట్ పేపర్స్ ప్రింటింగ్ నార్త్ బ్లాక్ బేస్మెంట్ కి మారిపోయింది. సెక్యూరిటీని టైట్ చేయటంతో పాటు ప్రింటింగ్ కంప్లీట్ అయ్యి బడ్జెట్ ప్రవేశపెట్టేవరకూ ఈ ఎంప్లాయిస్ ఎవ్వరూ ఇంటికి వెళ్లరు. ఎవరితోనూ మాట్లాడరు.
6
2017 వరకూ వార్షిక బడ్జెట్ సపరేట్ గా రైల్వే బడ్జెట్ సపరేట్ గా ప్రవేశపెట్టారు. రైల్వే బడ్జెట్ చాలా సుదీర్ఘంగా ఉండటంతో ఇలా విడివిడిగా ప్రవేశపెట్టేవారు. కానీ 2017లో అంటే దాదాపు 92 ఏళ్ల తర్వాత ఈ రెండింటీని కలిపేశారు. వార్షిక బడ్జెట్ లో భాగంగానే రైల్వే బడ్జెట్ కూ నిధుల కేటాయింపులు జరపటం మొదలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం.
7.
బడ్జెట్ లో షార్టెస్ట్ బడ్జెట్ 800 పదాలు అయితే లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్ ఎవరో ఇచ్చారో తెలుసా. దివంగత నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఆయన 1991 లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు కు ఆర్థిక మంత్రిగా ఉండేవారు. ఆ టైమ్ లో నే ఆర్థిక సంస్కరణల ఆలోచనలు ఉండగా..అప్పుడు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో ఏకంగా 18వేల 650 పదాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ 2018లో అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 18వేల 604 పదాలు ఉన్నాయి. అప్పుడు ఏకంగా డైట్లీ గంటా 49నిమిషాలు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి టైం తీసుకున్నారు.
8.
1955 వరకూ వార్షిక బడ్జెట్ కేవలం ఇంగ్లీషులోనే ఉండేది. ఆ తర్వాత అంటే 1955 - 56 వార్షిక సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ, ఇంగ్లీషుల్లోనూ బడ్జెట్ పేపర్స్ తయారు చేయటం మొదలుపెట్టింది. అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ సీడీ దేశ్ ముఖ్ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు.
9.
వార్షిక బడ్జెట్ ను అత్యధికంగా ఇప్పటివరకూ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 సార్లు ప్రవేశపెట్టారు. 1962 నుంచి 1969 మధ్య కాలంలో 10 వార్షిక బడ్జెట్ లను ప్రవేశపెట్టారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ 8వ సారి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. పీ చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్ వీళ్లు కూడా ఐదు సార్లు ఎక్కువ సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
10.
2021 వరకూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను కాగితాల మీదనే ప్రింట్ చేసి తీసుకువచ్చేది. ఆ పేపర్స్ లో రెడ్ ఎన్వలప్ లేదా బ్లాక్ బ్యాగ్ లో కానీ తీసుకువచ్చేవారు. కానీ 2021 నుంచి పేపర్ లెస్ ఫార్మెట్ వచ్చింది. అప్పటి నుంచి ట్యాబ్ ను రెడ్ బ్యాగ్ లో పెట్టి తీసుకువస్తున్నారు నిర్మలా సీతారామన్. ఈ మార్పు రావటానికి కారణం కోవిడ్ మహమ్మారి. ఆ టైమ్ లో పది మంది గుంపుగా పనిచేయించటం కష్టమైన పని కాబట్టి...అసలు ప్రింటింగ్ అవసరం లేకుండా నేరుగా సాఫ్ట్ కాపీల రూపంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ప్రారంభించారు.
సో ఇవి బడ్జెట్ హిస్టరీ నుంచి టాప్ 10 ఇంట్రెస్టింగ్ విశేషాలు





















