Akhil Mishra Death : హైదరాబాద్‌లో ప్రమాదవశాత్తూ బాలీవుడ్ యాక్టర్ మృతి
Bollywood Actor Akhil Mishra Died In Hyderabad : హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ ప్రమాదంలో బాలీవుడ్ నటుడు ఒకరు మరణించారు.
హైదరాబాద్ నగరంలో ఓ విషాదం చోటు చేసుకుంది. హిందీ చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు ఒకరు మరణించారు. దాంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కి గురి అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
'3 ఇడియట్స్' నటుడు అఖిల్ మిశ్రా మృతి
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన '3 ఇడియట్స్' సినిమా గుర్తు ఉందిగా! అందులో లైబ్రేరియన్ దూబే పాత్రలో నటించిన వ్యక్తి గుర్తు ఉన్నారా? ఆయన పేరు అఖిల్ మిశ్రా (Akhil Mishra). '3 ఇడియట్స్' కంటే ముందు హిందీలో పలు సినిమాలు, సీరియళ్లు చేశారు.
అఖిల్ మిశ్రా గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ నగరంలో ఉండగా... అపార్ట్మెంట్ కిచెన్‌లో ప్రమాదవశాత్తూ ఆయన కింద పడి ఉండటాన్ని గమనించారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అయితే... అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మృత దేహాన్ని పోస్ట్ మార్టం కోసం తీసుకు వెళ్లారు. రిపోర్ట్స్ వస్తే గానీ అసలు మృతికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం లేదు.
హైదరాబాద్ ఎందుకు వచ్చారు?
అఖిల్ మిశ్రా భార్య సుజానే కూడా నటి. ఓ షూటింగ్ నిమిత్తం ఆమె హైదరాబాద్ వచ్చారు. భార్య వెంట భర్త కూడా నగరానికి వచ్చారు. అఖిల్ మిశ్రా మరణ వార్తను సుజానే ధృవీకరించారు. ''నాలో సగ భాగం వెళ్ళిపోయింది'' అని ఆమె హిందీ మీడియాతో మాట్లాడారు.
అఖిల్ మిశ్రా ఏయే సినిమాల్లో నటించారు?
'గాంధీ మై ఫాదర్', 'హజారోన్ ఖవైశేన్ ఐసీ' సినిమాలతో పాటు టీవీ సిరీస్ 'ప్రధానమంత్రి'లో అఖిల్ మిశ్రా నటించారు. అయితే... '3 ఇడియట్స్' సినిమా ఆయనకు గుర్తు తెచ్చింది. టీనా దత్తా, రష్మీ దేశాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఉత్తరన్'లో ఉమెద్ సింగ్ బుండేలా పాత్రలో నటించారు.
Also Read : వాట్సాప్ ఛానల్ స్టార్ట్ చేసిన తెలుగు, హిందీ హీరో హీరోయిన్లు ఎవరు? ఎవరి ఫాలోయింగ్ ఎంత?
Actor Akhil Mishra, who has worked in films like Aamir Khan-starrer ‘3 Idiots’, 'Hazaaron Khwaishein Aisi', passed away after an accident in the kitchen. He was 58.
— ABP LIVE (@abplive) September 21, 2023
Click on the 🔗 to know more: https://t.co/NdN41XwMe4#AkhilMishra #EntertainmentNews #ABPLive pic.twitter.com/IcJGKudfEa
అఖిల్ మిశ్రాకు సుజానే రెండో భార్య!
అఖిల్ మిశ్రాతో పాటు హైదరాబాద్ సిటీలో ఉన్న సుజానే ఆయనకు రెండో భార్య. తొలుత మంజు మిశ్రాతో 1983లో అఖిల్ వివాహం జరిగింది. ఆయన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ 'డాట్ తేరే... కి'లో ఆమె నటించారు. తర్వాత 'గృహలక్ష్మి క జిన్' సీరియల్ కూడా చేశారు. మంజు 1997లో మరణించారు. ఆ తర్వాత జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ (Suzanne Bernert)ను ఫిబ్రవరి 2009లో పెళ్లి చేసుకున్నారు.
Also Read : బాలకృష్ణ, రవితేజకు గట్టి పోటీ, దసరా బరిలో సిక్సర్ - 'జైలర్', 'జవాన్' సక్సెస్ రిపీట్ చేసేదెవరు?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial