అన్వేషించండి
Paruchuri Abhinay Tej Wedding: కొత్తపల్లి గీత కుమారుడి పెళ్లి వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి - ఫోటోలు చూశారా?
పరుచూరి రామకోటేశ్వరరావు, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతుల తనయుడు అభినయ్ తేజ్ వివాహం అక్షతతో ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆ ఫోటోలు చూశారా?
పరుచూరి రామకోటేశ్వరరావు, కొత్తపల్లి గీత తనయుడు అభినయ్ తేజ్ వివాహ మహోత్సవానికి హాజరైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు - ఇంకా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
1/8

పరుచూరి రామ కోటేశ్వరరావు, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతుల తనయుడు పరుచూరి అభినయ్ తేజ్ వివాహం పలువురు సినీ రాజకీయ అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా జరిగింది. మాధవి, కోటపాటి సీతారామారావు గారి అమ్మాయి అక్షతతో అభినయ్ ఏడు అడుగులు వేశారు. ఈ వివాహం డిసెంబర్ 25వ తేదీన (బుధవారం) రాత్రి 12.37 గంటలకు జరిగింది. ఈ వివాహ వేడుకలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మాజీ కేంద్ర మంత్రి - బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, ఆరోగ్య మంత్రి సత్య కుమార్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు - ఎంపీ పురంధేశ్వరి సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
2/8

పరుచూరి రామ కోటేశ్వరరావు - కొత్తపల్లి గీత దంపతులతో పాటు కొత్త జంట అభినయ్ తేజ్, అక్షతతో తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
Published at : 26 Dec 2024 08:48 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















