Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Congress: ఇండియా మ్యాప్ లో కశ్మీర్ లేకుండా మ్యాప్‌లను ఫ్లెక్సీల్లో ప్రింట్ చేసింది కాంగ్రెస్ పార్టీ . సిడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్న బెళగావిలో వీటిని ఏర్పాటు చేయడం వివాదంగా మారింది.
Congress party has printed flexi maps without Kashmir in India map: కాంగ్రెస్ పార్టీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాలు కర్ణటాకలోని బెళగావిలో జరుగుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో ఇండియా మ్యాప్ ను ముుద్రించారు. కశ్మీర్ తో పాటు లెహ్ లేకుండా ఆ ఫ్లెక్సీ ఉంది.
Mohabbat ki Dukaan of @RahulGandhi has given away Aksai Chinh & Leh regions to some other country. pic.twitter.com/uSilxh6qJ9
— B L Santhosh (@blsanthosh) December 26, 2024
ఈ అంశంపై బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే ఇలా చేస్తోందని దేశానికి వెన్నుపోటు పొడుస్తోందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బీఎల్ సంతోష్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసి ఘాటు విమర్శలు చేశారు.
The @INCIndia's actions are not mere mistakes; they expose a calculated and dangerous agenda.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) December 26, 2024
This betrayal of national interest cannot be ignored.
Shameful! https://t.co/WUBBVb9tSy
ఈ ఫ్లెక్సీల వివాదం బీజేపీ జాతీయ నేతలు కూడా తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
Official Congress posters for its CWC (Commission With Collection) meeting have displayed a distorted map of India, inaccurately depicting Kashmir as part of Pakistan.
— BJP Telangana (@BJP4Telangana) December 26, 2024
To please its patron Soros, Congress party is compromising on matters of national security and integrity.… pic.twitter.com/giLE29mCBy
RaGa's Mohabbat ki Dukaan is always open for China!
— BJP (@BJP4India) December 26, 2024
They would break the nation. They've done it once. They'll do it again. pic.twitter.com/JKXXLEnFxB
మరో వైపు ఈ వివాదంపై కాంగ్రెస్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఆ ఫ్లెక్సీలను కూడా తీసేయలేదుని తెలుస్తోంది. ఇండియా మ్యాప్ ను కేంద్రం అధికారికంగా ప్రకటిస్తుంది. అలా కాకుండా వేరే వేరే మ్యాప్ లను ప్రచురించడం వల్ల అంతర్జాతీయంగా చర్చ జరుగుతుందని కశ్మీర్,లెహ్ ప్రాంతాలు ఇండియాలో భాగం కాదన్నది కాంగ్రెస్ పార్టీ విధానమన్నట్లుగా ఉంటాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ విధానమేంటో స్పష్టం చేయలేదు.