Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Chennai: చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో మరో వ్యక్తిని నిందితుడిగా చేర్చారు. అతను కూడా ఆ విద్యార్థిని రేప్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు.

Chennai Roadside vendor threatened rape victim to keep meeting after assault: ఓ అమ్మాయి అత్యాచారనికి గురైంది. ఆ విషయం తెలిస్తే ఎవరైనా వెళ్లి సాయం చేసి ఆస్పత్రికి తీసుకెళ్తారు. కానీ చెన్నైలో యూనివర్శిటీ ఎదురుగా కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి మాత్రం ఆ విద్యార్థిని ఫోన్ నెంబర్ తీసుకుని తాను రమ్మన్నప్పుడల్లా రాకపోతే అందరికీ చెబుతానని బెదిరించి పోయాడు. ఆ విద్యార్థిని పోలీసులకు తనపై జరిగిన అత్యాచారం ఘటనపై ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసుల దర్యాప్తులో ఈ విషయంలో వెల్లడి కావడంతో అతడని కూడా అరెస్టు చేశారు.
క్యాంపస్‌లోనే విద్యార్థినిని రేప్ చేసిన డీఎంకే కార్యకర్త
అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ 19 ఏళ్ల విద్యార్థిని క్యాంపస్ బయటకు వచ్చింది. అక్కడే స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వారి వద్దకు వచ్చారు. బాధితురాలి స్నేహితుడిని విపరీతంగా కొట్టి విద్యార్థినిని క్యాంపస్‌లో ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి వీడియో తీశారు. తాము రేప్ చేసినట్లుగా ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించారు.
యూనివర్శిటీ అధికారులుకు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
తీవ్రంగా గాయపడిన ఆమెను అక్కడే వదిలేసి ఆ ఇద్దరూ పరారయ్యారు. తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. యూనివర్శిటీ అధికారులకూ ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని సేకరించి నిందితులను గుర్తించారు. నిందితుడు రోడ్లపై బిర్యానీలు అమ్ముకునే 37 ఏళ్ల జ్ఞానశేఖర్ అని తెలిపారు. మరో నిందితుడి పట్టుకునేందుకు మొత్తం 4 ప్రత్యేక బృందాలు గుర్తించాయి. అతను డీఎంకే కార్యకర్త అని ఉదయనిధితో దిగిన ఫోటోలను బీజేపీతో పాటు ఇతర పార్టీలు షేర్ చేశాయి.
మరో వెండర్ కూడా అత్యాచారానికి ప్రయత్నం
అమ్మాయి అత్యాచారానికి గురయింది కాబట్టి ఎవరికీ చెప్పుకోలేదని భావించారు. అందుకే అన్నా యూనివర్శిటీ ఎదురుగా ఉన్న మరో వెండర్ కూడా విద్యార్థిని నెంబర్ తీసుకుని వేధించడం ప్రారంభించారు. తన వద్ద కూడా వీడియోలు ఉన్నాయని.. తనతో వచ్చి గడపకపోతే బయటపెడతానని బెదిరించడం ప్రారంభించాడు. దీంతో పోలీసులు అతనిని కూడా అరెస్టు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

