Karnataka Crime News: అందంతో వల - మంత్రి నుంచి ఎంతో మంది బాధితులు - కర్ణాటక లేటెస్ట్ సెన్సేషన్ శ్వేతగౌడ
Karnataka: కర్ణాటకలో హానీ ట్రాప్ కు పాల్పడుతున్న శ్వేత గౌడ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు ఓ మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు.
Police has arrested a woman named Shweta Gowda who is committing harm trap in Karnataka: కర్ణాటక రాజకీయాలకు హానీ ట్రాప్ ఎపిసోడ్లకు చాలా సంబంధం ఉంది. ప్రభుత్వాలు పడిపోయిన ప్రతి సారి ఈ హనీ ట్రాప్‌లే కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. తాజాగా ఓ హానీ ట్రాప్ తరహా కేసులు వెలుగులోకి వచ్చాయి. మంత్రి వర్తూరు ప్రకాష్ కు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న శ్వేత గౌడ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె మంత్రి పేరు చెప్పి చాలా మందిని మోసం చేశారని ఫిర్యాదులు రావడంతో అరెస్టు చేశారు. ఆమె ఫోన్ తీసుకుని పరిశీలించిన పోలీసులకు అసలు విషయాలు తెలిసి వచ్చాయి.
శ్వేతగౌడ తన అందంతో చాలా మందిని పడగొట్టేసి వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుకునేదని పోలీసులు గుర్తించారు. ఆమె ఫోన్ తీసుకుని పరిశీలించిన పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. ఆమె ఫోన్ కాంటాక్ట్స్ లో చాలా పేర్లు భిన్నంగా ఉన్నాయి. మంత్రి సోదరుడి పేరును రసగుల్లా అని పేరు పెట్టుకుంది. మరో వ్యక్తి పేరును మైసూర్ పాక్ అని పెట్టుకుంది. ఆయా నెంబర్లకు పోలీసులు కాంటాక్ట్ చేస్తే సరసమైన సంభాషణలు చేసేందుకు అవతవలి వారు ఆసక్తి చూపించేందుకు ప్రయత్నించారు.దీంతో చాలా కథలు ఉన్నాయని పోలీసులకు స్పష్టమయింది.
ఈ శ్వేతా గౌడ సినీ పరిశ్రమలోనూ కాలు పెట్టారు. ఇటీవల దర్శన్ కేసులో అరెస్టు అయిన పవిత్రగౌడ కు శ్వేత గౌడ మిత్రురాలు అని పోలీసులు చెబుతున్నారు. గతంలో చాలా సార్లు శ్వేత, పవిత్రా ఇద్దరూ కలిసి కనిపించారని అంటున్నారు. పవిత్రాగడౌడను జైల్లో కూడా శ్వేత పలుమార్లు పరామర్శించినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో చాలా మంత్రి వర్తూరు ప్రకాష్ పై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.