Adult content creator : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కన్నా అడల్ట్ కంటెంట్ క్రియేటర్‌గా మారడం బెటర్ - Phd వదిలేసి ఈ అందగత్తె చేస్తున్నది అదే !
Zara Dar : ఐటీ ఉద్యోగం ఉంటే చాలు లైఫ్ చాలా సింపుల్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఐటీ ఉద్యోగం కంటే అడల్ట్ కంటెంట్ క్రియటర్ జాబ్ చాలా గౌరవప్రదం అంటోంది జారా దర్ అనే యువతి.
Zara Dar a techie who quit PhD to become adult content creator : అమెరికాలో టెకీగా పని చేస్తూ పీ హెచ్ డీ చేస్తున్న జారా దర్ అనే యువతికి ఓ రోజు జ్ఞానోదయం అయింది. అసలు తాను పుట్టింది ఇలా ఐటీ చాకిరీ చేయడానికేనా అని తనను తను ప్రశ్నించుకుంది. వెంటనే ఉద్యోగాన్ని పీహెచ్‌డీని వదిలేసింది. ఎందుకంటే క్షణం తీరిక లేదు.. దమ్మిడి ఆదాయ లేదు తరహాలో ఎంత కష్టపడుతున్నా తన కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదని ఆమె భావించింది. అందుకే మొత్తానికి వదిలేసింది. కానీ ఇప్పుడు బిందాస్ గా కావాల్సినప్పుడే పని చేస్తోంది. కానీ మిలియన్ల డాలర్లు సంపాదిస్తోంది. ఇంతకు ఆమె ఏం చేస్తోందంటే అడల్ట్ కంటెంట్ క్రియేటర్ గా పని చేస్తోంది.
ఓన్లీ ఫ్యాన్స్ అనే ఓ సంస్థ ఇప్పుడు పాపులర్ అయింది. అది యూట్యూబ్ లాంటిది. కానీ ఫ్రీ కాదు. అలాగని అందరికీ యాక్సెస్ ఉండదు. ఇక్కడ పూర్తిగా పెయిడ్ సర్వీస్ ఉంటుంది. ఆన్ లైన్ అడల్ట్ వీడియోలు చేయడం వాటి ద్వారా డబ్బు సంపాదించడం చేస్తారు. చాట్ సర్వీసులు కూడా ఉంటాయి. ఓన్లీ ఫ్యాన్స్ ఇపుడు అడల్ట్ కంటెంట్ వినియోగదారులల్లో చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఐటీ జాబ్ ను.. పీహెచ్‌డీని వదిలేసిన జారా దర్ ఈ ఓన్లీ ఫ్యాన్స్ లో కెరీర్ ప్రారంభించారు. అడల్ట్ కంటెంట్ క్రియేటర్ గా అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. తన బ్యాంక అకౌంట్ లో మిలియన్ డాలర్లకుపైగా ఉన్నాయని ఆమె గర్వంగా చెబుతున్నారు.
ఇంతకు ముందు ఖర్చుల కోసం డబ్బులు వెదుక్కోవాల్సి వచ్చేదని కానీ ఇప్పుడు నెలలలోనే ధనవంతురాలినయ్యానని అంటోంది. మరి ఐటీ జాబ్, అడల్ట్ కంటెంట్ క్రియేటర్ జాబ్ ఒక్కటేనా అనేవారికి మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇస్తోంది. సాఫ్ట్ వేర్ ఇంజరనీర్లది ధ్యాంక్ లెస్ జాబ్ అని తేల్చేసింది. వారికి అక్కడ చేసే పనికి… వచ్చే వేతనానికి సంబంధం ఉండదని అంటోంది. ఇంకా చెప్పాలంటే.. తాను చేసే గౌరవమైనదని.. ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుందని జారా దర్ చెబుతోంది. ఇప్పుడు తన పెట్టుబడుల ఫోర్ట్ ఫోలియో చాలా బలంగా ఉందని.. త్వరలో ఇల్లు కూడా కొనబోతున్నానని చెబుతున్నారు.
Famous YouTuber Zara Dar has quit her PhD and become an OnlyFans Content Creator Full Time.
— Sensei Kraken Zero (@YearOfTheKraken) December 22, 2024
She used to make videos about Neural Networks, Machine Learning and other Tech Stuff, now she will be making content of a different genre.
Thoughts? pic.twitter.com/DlC3kTeB0e
చాలా మంది ఐటీ ఉద్యోగులకు రెండో ఆలోచన ఉండదు. ఎక్కువ మంది ఇండియా నుంచి వెళ్లే ఎన్నారైలు ఏదో ఓ ఐటీ ఉద్యోగం తెచ్చుకుని స్థిరపడిపోదామనుకుంటారు. కానీ జారా దర్ లా ఆలోచించేవారు తక్కువగా ఉంటారు. అందుకే ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఆమె చేస్తున్నది రైటా రాంగా అని జడ్జ్ చేసే అర్హత ఎవరికీ లేదు. ఆమె చాయిస్ ఆమెది. కానీ చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఆమె మాటలతో మనసులో అయినా ఏకీభవిస్తూంటారు. తాము ఈ పని మానేసి అడల్ట్ కంటెంట్ క్రియేటర్ గా చేసుకున్నా గౌరవం, ధనం రెండూ వస్తాయని అనుకునేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు.