News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

WhatsApp Channel : వాట్సాప్ ఛానల్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ ప్రముఖులు ఎవరు? ఎవరి ఫాలోయింగ్ ఎంత?

Telugu Celebrities On WhatsApp Channel : సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ వాట్సాప్ కొత్తగా ఛానల్ ఫీచర్ తీసుకు వచ్చింది. మరి, వాట్సాప్ ఛానల్స్ స్టార్ట్ చేసిన తెలుగు హీరోలు ఎవరు? ఎవరి ఫాలోయింగ్ ఎంత?

FOLLOW US: 
Share:

వాట్సాప్ లేనిదే కొంత మందికి రోజు గడవదు. స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి, సమాచారం షేర్ చేసుకోవడానికి, ఏదైనా అంశం మీద చర్చలు మొదలు పెట్టడానికి - ఒక్కటి అని ఏమిటి? ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ వాట్సాప్ (Whatsapp)ను జనాలు చాలా విధాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ  వాట్సాప్ కొత్తగా తీసుకు వచ్చిన ఫీచర్ - ఛానల్! 

ఇప్పుడు మీరు కూడా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. స్టార్స్ కూడా తమ తమ వాట్సాప్ ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు. మరి, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవరెవరు వాట్సాప్ ఛానల్స్ క్రియేట్ చేశారు? ఎవరి ఫాలోయింగ్ ఎంత? అనేది ఒకసారి చూడండి!

ఓ అడుగు ముందున్న విజయ్ దేవరకొండ!
వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసిన తొలి తెలుగు హీరోగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నిలిచారు. సెప్టెంబర్ 6వ తేదీన ఆయన ఛానల్ క్రియేట్ అయ్యింది. ఈ నెల 12వ తేదీన తొలి పోస్ట్ చేశారు. ఫ్యామిలీ ఫోటోలను, స్నేహితులతో దిగిన ఫోటోలను ఆయన షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఛానల్ ఫాలోయర్స్ సంఖ్య సుమారు ఏడున్నర లక్షలు (7,42,068). 

విజయ్ దేవరకొండ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి : Vijay Devarakonda whatsapp channel

లేటెస్టుగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్!
కొత్తగా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసిన తెలుగు హీరో మన మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR). ఆయన ఛానల్ బుధవారం క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం తారక్ ఛానల్ ఫాలో అవుతున్న వారి సంఖ్య 35 వేలు మాత్రమే. రెండు మూడు రోజుల్లో మిలియన్ మార్క్ చేరుకోవచ్చని అంచనా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు ఫాలోయింగ్ ఉంది. అందుకని, స్పీడుగా ఫాలోయర్స్ పెరిగే అవకాశం ఉంది. ఆయన ఛానల్ క్రియేట్ చేసినట్లు కూడా ఈ రోజే అభిమానులకు తెలిసింది. 

తారక్ వాట్సాప్ ఛానల్ ఫాలో కావడానికి ఇక్కడ క్లిక్ చేయండి : Jr NTR Whatsapp Channel

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సైతం 
సరికొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు... తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిది. ఆయన కూడా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఛానల్ ఫాలో అవుతున్న ప్రేక్షకుల సంఖ్య 15 వేలు. 

రాజమౌళి వాట్సాప్ ఛానల్ ఫాలో కావడానికి ఇక్కడ క్లిక్ చేయండి : Rajamouli Whatsapp Channel

హిందీలో అక్షయ్ కుమార్, కట్రీనా కైఫ్... 
మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్!
హిందీ చిత్రసీమలో పలువురు తారలు సైతం వాట్సాప్ ఛానల్స్ క్రియేట్ చేశారు. ఆ హీరోలలో అక్షయ్ కుమార్ టాప్ ప్లేసులో ఉన్నారని చెప్పాలి. నాలుగు మిలియన్స్ కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఆయన కంటే టాప్ ప్లేసులో హీరోయిన్ కట్రీనా కైఫ్ ఉన్నారు. ఆమెను 8 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. 4 మిలియన్ ఫాలోయర్లతో పంజాబీ సింగర్ కమ్ హీరో దిల్జీత్ దోసాంజ్, 3 మిలియన్ ఫాలోయర్లకు చేరువలో సన్నీ లియోన్ ఉన్నారు.  

Also Read బాలకృష్ణ, రవితేజకు గట్టి పోటీ, దసరా బరిలో సిక్సర్ - 'జైలర్', 'జవాన్' సక్సెస్ రిపీట్ చేసేదెవరు?  

మలయాళ హీరో మోహన్ లాల్ కూడా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశారు. ఆయనను 8 లక్షల మంది ఫాలో అవుతున్నారు. మరో మలయాళ హీరో మమ్ముట్టిని 7 లక్షల మంది ఫాలో అవుతున్నారు. యువ మలయాళ హీరోలు పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, ఉన్ని ముకుందన్, కుంచకో బోబన్, సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ తదితరులు సైతం వాట్సాప్ ఛానల్స్ క్రియేట్ చేశారు.     

Also Read ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 21 Sep 2023 12:15 PM (IST) Tags: SS Rajamouli Jr NTR Vijay Devarakonda latest telugu news Whatsapp Channel Tollywood Celebs Whatsapp Channels

ఇవి కూడా చూడండి

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Namo Movie: నమో - నరేంద్ర మోడీ కాదండోయ్, సర్వైవల్ కామెడీ సినిమా!

Namo Movie: నమో - నరేంద్ర మోడీ కాదండోయ్, సర్వైవల్ కామెడీ సినిమా!

Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!

Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!

‘మంగళవారం’ ఓటీటీ స్ట్రీమింగ్, ‘బ్రహ్మాస్త్ర 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘మంగళవారం’ ఓటీటీ స్ట్రీమింగ్, ‘బ్రహ్మాస్త్ర 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Brahmanandam: ‘యానిమల్’లో కొడుకు పాత్రలో బ్రహ్మానందం, తండ్రి ఎవరో తెలుసా? ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

Brahmanandam: ‘యానిమల్’లో కొడుకు పాత్రలో బ్రహ్మానందం, తండ్రి ఎవరో తెలుసా? ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే