Telugu Movies: 'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా

కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన సినిమాల్లో హీరోలు... 'సామజవరగమన'లో శ్రీ విష్ణు, 'ఎఫ్ 3'లో వెంకటేష్ & వరుణ్ తేజ్, 'టిల్లు స్క్వేర్'లో సిద్ధూ జొన్నలగడ్డ, 'జాతి రత్నాలు'లో నవీన్ పోలిశెట్టి, 'మ్యాడ్' హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్
Blockbuster Comedy Movies Post Covid In Telugu: కరోనా తర్వాత సినిమాను చూసే తీరు మారిందని కొందరు అంచనా వేశారు. కామెడీ సినిమాలకు కాలం చెల్లిందన్నారు. కానీ, కరెక్టుగా తీస్తే కామెడీ కోట్లు కొల్లగొడుతుంది.
కరోనాకు ముందు, కరోనా తర్వాత... ప్రపంచమే మారింది. ఆ ప్రపంచంలో సినిమా ఉంది. ఇప్పుడు ఆ సినిమాను ప్రేక్షకులు చూసే తీరు మారిందని చెప్పాలి. కరోనా కాలంలో, ముఖ్యంగా లాక్‌డౌన్ పీరియడ్‌లో... ఇంటి

