GBS News: తెలంగాణలో జీబీఎస్ కేసు- ప్రభుత్వం హైఅలర్ట్
GBS News: తెలంగాణలో కొత్త వైరస్ కలకలం రేపుతో్ంది. తాజాగా సిద్దిపేట మహిళలకు సోకిన ఈ కొత్తవైరస్ తో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు వైద్యనిపుణులు. తేడా వస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

GBS In Telangana News: దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల మహారాష్ట్రలో మొదలైన గులియన్ బారే సిండ్రోమ్ కేసులు తెలంగాణలో కూడా నమోదవ్వడం మొదలైంది. కోవిడ్ తరువాత వైరస్ మాట వింటే జనం హడలిపోతున్నారు. అందులోనూ కొత్త వైరస్ అంటే ఇంకాస్తా ఆందోళన తప్పదు. తాజాగా తెలంగాణలో నమోదైన గులియన్ బారే సిండ్రోమ్ కేసు ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేటకు చెందిన ఓ మహిళకు జిబిఎస్ వైరస్ లక్షణాలు సోకినట్లు వైద్యులు గుర్తించారు. హైదరబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఉంచి మహిళలకు వైద్యం అందిస్తున్నారు.
చైనా పుణ్యమా అంటూ కొత్త వైరస్ వ్యాప్తి ఏ రోజు ఎలా ఉంటుందో అనే భయం ప్రపంచదేశాలను వెంటాడుతోంది. కోవిడ్ భయం తరువాత సాధారణ పరిస్థితులు రావడానికి, ఆర్థికంగా అన్ని వ్యవస్థిలు పుంజుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పడున్న పరిస్థితిలో కొత్త వైరస్‌ను ఎదుర్కోవడం అంటే కష్టం. వ్యాక్సినేషన్ పూర్తైన తరువాత ఇమ్యూనిటీ శక్తి పెరిగినప్పటికీ కొత్తగా రూపాంతరం చెందుతున్న వైరస్‌లను లైట్ తీసుకుంటే ప్రమాదమే. కోవిడ్ మిగిల్చిన విషాధ పరిస్థితులను తట్టుకునేందుకు మారిన జీవన విధానం, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి మార్పులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వైరస్ అంటే చాలు వామ్మో అనే పరిస్దితులలోనే జీబిఎస్ వ్యాప్తిపై టెన్షన్ మొదలైంది.
పశ్చిమబెంగాల్‌లో జీబీఎస్ వైరస్ కారణంగా గత నాలుగు రోజుల్లో ఓ చిన్నారి సహా ముగ్గురు మరణించారు. మహారాష్ట్రలోని పుణెలోనూ దాదాపు 130 జీబీఎస్ అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. తెలంగాణాలో జీబీఎస్ కేసు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమైయ్యారు.
Also Read: తెలంగాణలో పల్లీ రైతులకు గిట్టుబాటు ధర గండం- పత్తి రైతుల మాదిరి ఆత్మహత్యలు తప్పవంటు ఆగ్రహం
బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడిన వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరల్ కారణంగా నరాలు బలహీనంగా మారే ప్రమాదం ఉంటుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తికి ఒళ్లంతా తిమ్మిరిగా ఉంటుందని, కండరాలు సైతం బలహీనంగా మారడంతోపాటు డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కలుషిత ఆహారం తీసుకోవడంతోపాటు నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వైరస్ వల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, ఈ జీబీఎస్ అనేది అంటు వ్యాధి కాదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నయం చేసుకోవచ్చని వైద్యనిపుణులంటున్నారు. గులియన్-బారే సిండ్రోమ్ అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఈ వైరస్ ప్రభావంతో కండరాల బలహీనత లేదా పక్షవాతం వచ్చే అవకాశాలున్నాయి.
పశ్చిమబెంగాల్ లో జీబిఎస్ కేసుల తీవ్రతను తెలుసుకున్న తెలంగాణ వైద్యశాఖ, వైరస్ వ్యాప్తి మరింత పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను అప్రమత్తం చేసింది. ఈ వైరస్ సోకిన వ్యక్తిని నేరుగా తాకడం వల్ల మరో వ్యక్తికి సోకే ప్రమాదం లేకపోవడం కొంతవరకూ తీవ్రత తక్కువైనప్పటికీ, కలుషిత నీటి ద్వారా ఈ వైరస్ సోకే ప్రమాదాన్ని గుర్తించడంతో తాగునీరు కలుషితమయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, తగిన చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఆహారకల్తీ ప్రమాదం ఎక్కువగా ఉన్న వేళ దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టడం ద్వారా జీబీఎస్ వైరస్‌ను కట్టడిచేసేందుకు వైద్యశాఖ అప్రమత్తమైంది.
Also Read: బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తాం - రేవంత్ కీలక ప్రకటన
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

