Revanth counter to KCR: గట్టిగా కొడతవా.. సరిగ్గా నిలబడు చూద్దాం - కేసీఆర్‌కు రేవంత్ ఘాటు కౌంటర్!
Telangana: ఫామ్‌హౌస్‌లో పార్టీ నాయకులతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ చెల్లని వెయ్యి రూపాయల నోటు లాంటి వాడన్నారు.

CM Revanth Reddy gave a strong counter to KCR: మాజీ సీఎం కేసీఆర్ చెల్లని వెయ్యి రూపాయల నోటు లాంటి వాడని .. సీఎం రేవంత్ విమర్శించారు. షాద్ నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉదయం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కేసీఆర్ గట్టిగా కొడున్నానని అంటున్నారని .. సరిగ్గా నిలబడగలరా అని రేవంత్ ఎద్దేవా చేశారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన ఆయన ప్రజలతో సంబంధాలు కోల్పోాయరన్నారు. వెయ్యి రూపాయల నోటుకు గతంలో చాలా వాల్యూ ఉండేదని.. ఇప్పుడు అ నోటు ఉంటే తీసుకెళ్లి జైల్లో పెడతారని రేవంత్ గుర్తు చేశారు. అసెంబ్లీకి రా.. చర్చ పెడదామని రేవంత్ సవాల్ చేశారు. రైతు బంధు కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని.. ధనిక రాష్ట్రమంటూ అబద్ధాలు చెబుతూ.. అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారని మండిపడ్డారు.
ఫామ్ హౌస్ లో ఉండి సోది మాట్లాడటం కాదని ప్రజల్లోకి.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు. పోల్ పెడితే కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని సంబర పడుతున్నారని.. సోషల్ మీడియా లైకులు చూసి సంబర పడుతున్న ఈ పెద్దాయన మానసిక పరిస్థితి చూస్తే జాలేస్తోందన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసినోడు.. కేంద్ర మంత్రిగా పని చేసినోడు.. టిక్ టాక్ లో ఎక్కువ లైకులు వచ్చాయని సంబర పడుతున్నారన్నాడు. సల్మాన్ ఖాన్ కు.. రాఖీ సావంత్ పోల్ పెడితే...రాఖీ సావంత్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని రేవంత్ సెటైర్ వేశారు. అన్ని పథకాలు అమలు చేస్తున్నామని.. నీ నాయకత్వం మీద నమ్మకం ఉంటే.. అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ చేశారు.
మైసమ్మకు, జహంగీర్ పీర్ దర్గాలకు మేకపోతులను వదిలినట్లు కేటీఆర్, హరీష్ రావులను కేసీఆర్ వదిలిండని కేసీఆర్ వారిని కంట్రోల్ లో పట్టుకోవాలన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులకు అభినందించడం ఇష్టం లేకపోతే ఫామ్ హౌస్ లోనే పండుకోవాలని ఎవరూ అడగడం లేదన్నారు. కేసీఆర్ చేసిన రుణమాఫీ మిత్తీకే సరిపోయిందని తాము ఇరవై ఒక్క వేల కోట్ల రణమాఫీ చేశామన్నారు. ఫిబ్రవరి 7న అసెంబ్లీ సమావేశానికి రా.. అక్కడ మాట్లాడుకుందాం అని కేసీఆర్‌కు సీఎంకు సవాల్ చేశారు. ఫామ్ హౌస్‌లో కూర్చుని అబద్దాలుచెబుతున్నారు. ఈ అబ్దదాల వల్లే ఒక్క ఎంపీ సీటు కూడా రాకుండా దారుణంగా ఓడిపోయారని మండిపడ్డారు. ఫౌమ్‌హౌస్‌లో ఉండి లెక్కలు చెప్పొద్దు. అబద్దాల వల్లే ఒక ఎంపీ కూడా గెలవలేదు. తెలంగాణ సమాజానికి నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి మొదటి సంవత్సరంలోని 50వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలకు సంబంధించి దేశ చరిత్రలోనే రికార్డ్ సృష్టించామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ శ్రేణులు గాలి ఊదితే కేసీఆర్ కొట్టుకుపోతారన్నాని.. తెలంగాణ ప్రజలను అవమానించేలా తులం బంగారానికి ప్రజలు అమ్ముడుపోయారని అన్నందుకు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలోనే రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్నారు. గద్దర్ కార్యక్రమంలో కేసీఆర్ గురించి మరింత మాట్లాడతానని చెప్పి వెళ్లారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

