Laila Teaser: మాస్ కా దాస్ సరికొత్త అవతారం, లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్ సేన్ - లైలా టీజర్ చూశారా?
laila Teaser: విశ్వక్ సేన్ నటిస్తున్న మూవీ 'లైలా'. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ప్రచార పోస్టర్స్ గ్లింప్స్‌తో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా టీజర్ విడుదలైంది.

Laila Movie Offical Teaser: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఫలితాలతో సంబంధం లేకుండ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో వచ్చాడు. గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ వంటి సినిమాలు విడుదల చేశాడు. ఈ ఏడాది లైలా సినిమాతో రెడీ అయ్యాడు. వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఓ వైపు నిర్మాణాంతర పనులను జరుపుకుంటూనే మరోవైపు ప్రమోషనల్ కార్యక్రమాలను జరుపుకుటుంది.
టీజర్ ఎలా ఉందంటే..
ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, పోస్టర్స్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. పైగా ఇందులో విశ్వక్ లేడీ గెటప్‌లో అలరించబోతున్నాడు. అయితే ఇంతవరకు దీనికి సంబంధించిన పోస్టర్ కానీ, గ్లింప్స్ కానీ బయటకు రాలేదు. దీంతో లేడీ గెటప్‌లో మన మాస్ కా దాస్ ఏ రేంజ్ అలరించబోతున్నాడా? అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీం లైలా టీజర్ రిలీజ్ చేసింది. ఇందులో విశ్వక్ సోను పాత్రలో నటించనున్నాడు. అదే పేరు బ్యాగ్రౌండ్‌లో వస్తుండగా.. సోను గాడిని వేసేద్దామంటూ అతడిపై కొందరు ఎటాక్‌కు ప్లాన్ చేసే సీన్‌తో టీజర్ మొదలైంది. ఇందులో విశ్వక్ ప్లే బాయ్‌గా కనిపించబోతున్నాడని అర్థమైంది.
తమ వీధిలోని అమ్మాయిలనే కాదు పెళ్లయిన ఆడవాళ్లను కూడా తన మాయలో పడేసే సోనుగా విశ్వక్ పాత్ర ఉండనుందని ఈ టీజర్ చూస్తుంటే అర్థమైపోతుంది. దీంతో ఆడవాళ్లంతా సోను సోను అని కలవరిస్తుంటుంటే వారి భర్తలు పడే బాధను ఈ టీజర్‌లో చూపించారు. జీమ్, కాస్మోటిక్ షో రూం, బ్యూటీ సెలూన్ నిర్వహించే సోను ఆ ఎరియాలో బాగా ఫేమస్. అక్కడి ఆడవారంత అతడిక దగ్గరే వెళుండటం, వారికి బ్యూటీ సలహాలతో ఇవ్వడం వంటివి టీజర్ చూడోచ్చు. టీజర్ చివరిలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా వచ్చే సీన్స్ హెలెరియస్ కామెడీతో నవ్వించనున్నాయని టీజర్ చూస్తుంటే అర్దమైపోతుంది. ఒక నిమిషం నలభై సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ వినోదాత్మకంగా సాగింది. ఇందులో విశ్వక్ సేర్ రోల్, మ్యానరిజాన్ని పరిచయం చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ మూవీ మంచి బజ్ క్రియేట్ చేస్తుంది.
విశ్వక్ సేన్ మొదటి నుంచి వైవిధ్యమైన కథలు పాత్రలతో మెప్పిస్తూ వస్తున్నాడు. కానీ తనలోని మాస్ యాంగిల్‌తో ఎప్పుడూ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటూనే ఉన్నాడు. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ, మాస్ యాక్షన్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. అందుకు మాస్ కా దాస్ అనే గుర్తింపు కూడా పొందాడు. అలాంటి మాస్ ఇమేజ్ ఉన్న విశ్వక్ ఈ సారి డిఫరెంట్ జానర్‌తో వస్తున్నాడు. అదీ కూడా లేడీ గెటప్‌తో కొత్త అవతారతం ఎత్తబోతున్నాడు. మరి ప్రేక్షకుల్లో మంచి మాస్ ఇమేజ్ ఉన్న విశ్వక్ లైలాతో ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

