Chamanthi Serial - Zee Telugu: 'కృష్ణ ముకుంద మురారి' రేవతి... ఇప్పుడు జీ తెలుగు సీరియల్ 'చామంతి'లోకి
'జీ తెలుగు'లో కొత్తగా ప్రారంభమైన సీరియల్ 'చామంతి'. ఇందులో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతోంది. 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్‌లో అత్తగా నటించిన రేవతి ఎంట్రీ ఇవ్వనున్నారు.

జీ తెలుగు (Zee Telugu Serials)లో ఇటీవల ప్రారంభమైన కొత్త సీరియల్ 'చామంతి' (Chamanthi Serial). మేఘన లోకేష్ (Meghana Lokesh) టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సీరియల్ లాంచింగ్ వీక్ మంచి టీఆర్పీ (7.60) అందుకుంది. శుక్రవారానికి (జనవరి 17కి) ఈ సీరియల్ 15 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఇందులో ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ కాబోతోంది. ఆవిడ ఎవరో తెలుసా?
'చామంతి'లోకి 'కృష్ణ ముకుంద మురారి' రేవతి!
తెలుగు బుల్లితెర వీక్షకులకు 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ తప్పకుండా గుర్తు ఉండే ఉంటుంది. అందులో ఒక మెయిన్ రోల్ చేసిన యష్మీ గౌడ రీసెంట్ 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8లో పార్టిసిపేట్ కూడా చేసింది. 'స్టార్ మా'లో టెలికాస్ట్ అయిన ఆ సీరియల్ మెయిన్ క్యారెక్టర్స్ గుర్తు ఉన్నాయా? అత్త రేవతి పాత్రలో మాధవి లత నటించారు. ఆవిడకు ఉత్తమ అత్త అవార్డు ఇచ్చింది స్టార్ మా. 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ కంటే ముందు మాధవి లత 'శ్రావణ సంధ్య', 'మనసంతా నువ్వే', 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియళ్లు చేశారు మాధవి లత.
ఇప్పుడు జీ తెలుగు సీరియల్ 'చామంతి'లో ఆ మాధవి లత ఒక మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. అందులో తనది డిఫరెంట్ రోల్ అని సోషల్ మీడియా వేదికగా ఆవిడ వెల్లడించారు. ఆ రోల్ ఏమిటి? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. అప్పటి వరకు సస్పెన్స్.
Also Read: 'ఉమ్మడి కుటుంబం' నుంచి అపర్ణ అవుట్... ప్రీతి పాత్రలో కొత్త నటి ఎంట్రీ, ఎవరో తెలుసా?
View this post on Instagram
టైటిల్ రోల్ చేస్తున్న కన్నడ నటి మేఘన లోకేష్!
'చామంతి' సీరియల్ ప్రధాన పాత్రల విషయానికి వస్తే... ఇందులో కన్నడ నటి మేఘన లోకేష్ టైటిల్ రోల్ చేస్తున్నారు. 'శశిరేఖ పరిణయం' సీరియల్ ద్వారా ఆవిడ తెలుగు బుల్లితెర మీద అడుగు పెట్టారు. 'స్టార్ మా' ఛానల్‌లో ప్రసారం అయిన ఆ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయింది. అంతకు ముందు కన్నడలో కొన్ని సీరియల్స్ చేశారు మేఘన లోకేష్.
తెలుగులో 'శశిరేఖ పరిణయం' ద్వారా విజయం అందుకోవడానికి అంటే ముందు కన్నడలో జీ కన్నడ ఛానల్ సీరియల్ 'దేవి' మేఘన లోకేష్ (Meghana Lokesh Serials)కి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత 'రక్త సంబంధం', 'కల్యాణ వైభోగం', 'కళ్యాణం కమనీయం' వంటి సీరియల్ చేశారు. ఇప్పుడు 'చామంతి'తో మరోసారి ఆవిడ తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఇందులో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ మరొక రోల్ చేస్తున్నారు.
Also Read: ఈటీవీలో కొత్త సీరియల్... 'ఝాన్సీ' టెలికాస్ట్ టైమింగ్ నుంచి యాక్టర్స్ వరకు - ఈ డీటెయిల్స్ తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

