Ummadi Kutumbam Serial: 'ఉమ్మడి కుటుంబం' నుంచి అపర్ణ అవుట్... ప్రీతి పాత్రలో కొత్త నటి ఎంట్రీ, ఎవరో తెలుసా?
Zee Telugu Serials: జీ తెలుగు సీరియల్ 'ఉమ్మడి కుటుంబం'లో ప్రీతిగా నటిస్తున్న అపర్ణ అర్ధాంతరంగా తప్పుకొంది. ఆవిడ స్థానంలో ప్రియాంక ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ టిఆర్పి ఎంత? మిగతా విషయాలేమిటి? అంటే....

Zee Telugu New Serials: జీ తెలుగులో 2024 చివరిలో ప్రారంభమైన కొత్త సీరియళ్లలో 'ఉమ్మడి కుటుంబం' (Ummadi Kutumbam Serial) ఒకటి. జనవరి 15వ తేదీన ఆ సీరియల్ 62వ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. సీరియల్ మొదలైన రెండున్నర నెలలలో ఒక మార్పు చోటు చేసుకుంది. ప్రీతి పాత్రలో కొత్త నటి వచ్చి చేరింది. ఆమె ఎవరు? సీరియల్ నుంచి ఎవరు వెళ్లిపోయారు? వంటి వివరాల్లోకి వెళితే...
అపర్ణ రెడ్డి అవుట్...
ప్రియాంక రేలంగి ఇన్!
'ఉమ్మడి కుటుంబం'లో ఇన్నాళ్లూ ప్రీతి పాత్రలో అపర్ణ రెడ్డి (Aparna Reddy) యాక్ట్ చేశారు. ఇక నుంచి ఆవిడ కనిపించరు. సీరియల్ నుంచి తప్పుకొని వెళ్ళిపోయారు. అపర్ణ రెడ్డి స్థానంలో ప్రియాంకా రేలంగి (Priyanka Relangi) వచ్చారు.
View this post on Instagram
'ఉమ్మడి కుటుంబం' బుధవారం నాటి ఎపిసోడ్ (జనవరి 15)లో ప్రీతిగా అపర్ణ రెడ్డి కనిపించారు. అయితే... ఆ తర్వాత ఎపిసోడ్స్ నుంచి కనిపించే అవకాశం లేదు. ఆల్రెడీ జీ 5 యాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న జనవరి 16వ తేదీ ఎపిసోడ్‌లో ప్రియాంకా రేలంగి ఎంట్రీ ఇచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల ఉమ్మడి కుటుంబం సీరియల్ నుంచి అపర్ణ రెడ్డి వైదొలిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఆవిడ స్థానంలో వచ్చిన ప్రియాంక రేలంగి ఆల్రెడీ 'నువ్వుంటే నా జతగా' సీరియల్ చేస్తున్నారు. 'ఊహలు గుసగుసలాడే' చేశారు. ఇప్పుడు మరొక సీరియల్ ఆవిడ ఖాతాలో చేరింది.
View this post on Instagram
'ఉమ్మడి కుటుంబం' టీఆర్పీ ఎంత?
జీ తెలుగులో టెలికాస్ట్ టైమింగ్ ఏంటి?
నవంబర్ 4వ తేదీన జీ తెలుగులో 'ఉమ్మడి కుటుంబం' సీరియల్ ప్రారంభం అయింది. సోమ నుంచి శని వారం వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. ఉమ్మడి కుటుంబంలో ఉండడం వల్ల కలిగే లాభాలు ఏమిటి? కుటుంబ అనుబంధాలు ఆప్యాయతలు ఎలా ఉంటాయి? అనే నేపథ్యంలో రూపొందుతున్న సీరియల్ ఇది.
'ఉమ్మడి కుటుంబం' సీరియల్ ప్రతి వారం అటు ఇటుగా నాలుగు టీఆర్పీ అందుకుంటోంది. 53వ వారంలో ఈ సీరియల్ 3.41 టీఆర్పీ తెచ్చుకుంది. యాక్టర్ రీప్లేస్మెంట్ సీరియల్ టీఆర్పీ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? లేదంటే అదే విధంగా ఉంటుందా? అనేది చూడాలి. మధ్యాహ్నం టెలికాస్ట్ అయ్యే సీరియళ్లలో 'ఉమ్మడి కుటుంబం' మంచి టీఆర్పీ తెచ్చుకుంటుందని చెప్పవచ్చు.
Also Read: ఈటీవీలో కొత్త సీరియల్... 'ఝాన్సీ' టెలికాస్ట్ టైమింగ్ నుంచి యాక్టర్స్ వరకు - ఈ డీటెయిల్స్ తెలుసా?





















