Mega 157 Update: అనిల్ రావిపూడి లెక్కే వేరప్పా... 'మెగా 157' గ్యాంగ్ ఇంట్రడ్యూస్ చేశారుగా... రఫ్ఫాడించారు
Mega 157 Update: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న 'మెగా 157' మూవీ టెక్నికల్ టీమ్ ను తాజాగా ఓ స్పెషల్ వీడియో ద్వారా పరిచయం చేశారు. అందులో ఒక్కొక్కరుగా చిరుకి పరిచయం చేసుకున్నారు.

'సంక్రాంతికి వస్తున్నాం' బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీని మెగాస్టార్ చిరంజీవితో తీయబోతున్నాను అని అఫిషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఉగాది రోజున ఈ మూవీ లాంచ్ ను పూజా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. తాజాగా అనిల్ రావిపూడి ఈ మూవీకి పని చేయబోతున్న టెక్నీషియన్ల వివరాలను ఓ స్పెషల్ వీడియో ద్వారా వెల్లడించారు.
అనిల్ రావిపూడి క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీ
మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ Mega 157. హిట్ మెషీన్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలం గ్యాప్ తరువాత ఈ చిత్రంలో చిరంజీవి కంప్లీట్ కామెడీ రోల్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ఇంకా మొదలు కాకముందే అంచనాలు మాత్రం భారీగా పెరిగిపోయాయి. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి కేవలం వినోదాత్మక చిత్రాలను రూపొందించడంలో, బ్లాక్ బస్టర్ హిట్‌లను ఇవ్వడంలో మాత్రమే కాదు, తన సినిమాలను ప్రమోట్ చేయడంలో కూడా ప్రత్యేకమైన, వినూత్నమైన విధానాలను ఫాలో అవ్వడంలో ప్రత్యేకమైన శైలిని కనబరుస్తారు. ఆయన విలక్షణమైన ప్రమోషనల్ స్ట్రాటజీలు ఎంత ఎఫెక్టివ్ గా ఉంటాయో 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ తో తేలింది. ఇప్పుడు అనిల్ రావిపూడి అదే క్రియేటివ్ ప్లానింగ్ తో Mega 157 ప్రమోషన్ ను కూడా షురూ చేశారు. ఓ ప్రత్యేకమైన వీడియో ద్వారా ఆయన చిత్రబృందాన్ని పరిచయం చేశారు.
Mega 157 గ్యాంగ్ పరిచయం
ఈ వీడియోలో Mega 157 బృందం చిరంజీవి ఐకానిక్ చిత్రాల పోస్టర్లతో దర్శనం ఇచ్చారు. ఒక్కొక్కరూ ఆయన సినిమాల స్టైల్ లో డైలాగులు చెబుతూ, చిరంజీవికి తమను తాము పరిచయం చేసుకున్నారు. చిరు కూడా వారికి ఆయా సినిమాలలోని డైలాగుల ద్వారానే సమాధానం ఇచ్చారు. చివరకు ఈ గ్యాంగ్ వెనకున్న గ్యాంగ్ స్టర్ అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు. రచయితలు అజ్జు మహాకాళి, తిరుమల నాగ్, ఉపేంద్ర ఈ చిత్రానికి "రత్నాల" లాగా పని చేస్తామని చెప్పగా, రచయిత నారాయణ 'హిట్లర్'లాగా అనిల్ రావిపూడి తీసుకునే ప్రతి క్రియేటివ్ నిర్ణయాన్ని తాను ప్రశ్నిస్తానని సరదాగా వెల్లడించారు.
Meeting our gang of #Mega157 🤗
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 1, 2025
Loved it @anilravipudi, i can imagine how entertaining the shoot is going to be on the sets!
SANKRANTHI 2026 రఫ్ఫాడిద్దాం 😉#ChiruAnil @Shine_Screens @GoldBoxEnt pic.twitter.com/ZKMv76vGfX
ఎగ్జిక్యూటివ్ నిర్మాత, రచయిత ఎస్. కృష్ణ ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని నమ్మకంగా చెప్పారు. ప్రొడక్షన్ డిజైనర్ ఎ.ఎస్. ప్రకాష్ తనను తాను ముఠా మేస్త్రి అని పిలుచుకుంటూ ఎంట్రీ ఇచ్చాడు, ఆ తర్వాత ఎడిటర్ తమ్మిరాజు, డిఓపి సమీర్ రెడ్డి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తనము తాము పరిచయం చేసుకున్నారు. నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రంతో ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ పండుగను ఎక్స్పెక్ట్ చేయవచ్చని మెగా అభిమానులకు హామీ ఇచ్చారు. చివరగా అనిల్ రావిపూడి తనను తాను గ్యాంగ్ లీడర్‌గా పరిచయం చేసుకుంటూ ప్రమోషనల్ వీడియోను ఎండ్ చేశారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

