Vinaro Bhagyamu Veera Katha: ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ కాంబినేషన్ మళ్లీ కలిసింది.. మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా?
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ప్రారంభం అయింది.
వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ప్రారంభం అయింది. ఈ సినిమాకు ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ అబ్బవరంతోనే ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ వంటి సూపర్ హిట్ ఆల్బమ్‌ను అందించిన చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు.
రాజా వారు రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాలతో హిట్లు కొట్టిన కిరణ్ అబ్బవరం చేతిలో ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాలు ఉండటం విశేషం. సెబాస్టియన్ పీసీ 524, సమ్మతమే సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండగా.. కొత్త దర్శకురాలు కోడి దివ్య దర్శకత్వంలో ఒక సినిమా, మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లలో కూడా సినిమాలు చేస్తూ ఉన్నాడు.
ఈ సినిమా లాంచ్‌కు హాజరైన అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల స్క్రిప్ట్ అందించారు. కాశ్మీరా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.
#AlluAravind garu Presents 💫#GA2Pictures7 - #KA7 is titled as #VinaroBhagyamuVishnuKatha 🤩
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 7, 2022
Helping Nature Begins Soon! 💚#BunnyVas @kashmiraofficial @kishoreabburu @chaitanbharadwaj #MarthandaKVenkatesh @daniel_viswas @sarathchandranaidu @ga2pictures #VBVK pic.twitter.com/kBE3tWFjMR
#AlluAravind Presents 💫#GA2Pictures7 - #KA7 is titled as #VinaroBhagyamuVishnuKatha 🤩
— Geetha Arts (@GeethaArts) January 7, 2022
Helping Nature Begins Soon! 💚#BunnyVas @Kiran_Abbavaram @kashmira_9 @KishoreAbburu @chaitanmusic #MarthandaKVenkatesh @daniel_viswas @imsarathchandra @GA2Official #VBVKMovie pic.twitter.com/KlZHNdPvgQ
Also Read: రూ.180 కోట్ల భారం.. తన నెత్తిన వేసుకున్న జక్కన్న..
Also Read:'బంగార్రాజు' కష్టాలు.. చెప్పిన టైంకి వస్తాడా..?
Also Read: షూటింగ్ క్యాన్సిల్.. ఇంట్లోనే చిల్ అవుతోన్న రౌడీ హీరో..
Also Read: క్లాసులు షురూ.. ధనుష్ 'సార్' ఆన్ డ్యూటీ..
Also Read: కోవిడ్ పాజిటివ్ వైఫ్.. నితిన్ బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేశాడో చూశారా..?
Also Read: 'హృదయమా' ఫస్ట్ సింగిల్.. రిలీజ్ చేసిన మహేష్ బాబు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.