Bangarraju: 'బంగార్రాజు' కష్టాలు.. చెప్పిన టైంకి వస్తాడా..?
మరో వారం రోజుల్లో రిలీజ్ పెట్టుకొని ఇప్పటివరకు 'బంగార్రాజు' సినిమా ఫస్ట్ కాపీ రెడీ చేయలేదట చిత్రబృందం.
'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' సినిమాలు వాయిదా పడడంతో చాలా సినిమాలు సంక్రాంతికి క్యూ కడుతున్నాయి. అందులో దాదాపు అన్నీ చిన్న సినిమాలే. పదికి పైగా సినిమాలు సంక్రాంతి సీజన్ లో సందడి చేయనున్నాయి. వీటితో పాటు నాగార్జున నటిస్తోన్న 'బంగార్రాజు' సినిమా కూడా విడుదల కాబోతుంది. జనవరి 14న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. మరో వారం రోజుల్లో రిలీజ్ పెట్టుకొని ఇప్పటివరకు ఫస్ట్ కాపీ రెడీ చేయలేదట చిత్రబృందం.
నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. సంక్రాంతికి రావాలనే ఉద్దేశంతోనే చాలా త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయిస్తున్నారు. కానీ ఈ సినిమాలో సీజీ వర్క్ పెండింగ్ లో ఉందట. అది ఎప్పటికి పూర్తవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. రెండు మూడు స్టూడియోలలో రోజు మొత్తం కష్టపడుతూ.. సీజీ వర్క్ ను పూర్తి చేస్తున్నారట. ఈ సినిమాకి సీజీ వర్క్ చాలా ముఖ్యం.
ఈ సన్నివేశాలు సరిగ్గా రాకపోతే నెగెటివ్ మార్క్ పడే ఛాన్స్ ఉంది. గ్రాఫిక్స్ వర్క్ కి టైమ్ పడుతుందని చిత్రబృందానికి ముందే తెలుసు. అందుకే సంక్రాంతికి రావాలా వద్దా అని ఆలోచించింది. కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు వాయిదా పడడంతో వెంటనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసింది. కానీ ఇంకా ఫస్ట్ కాపీ మాత్రం రెడీ అవ్వలేదట.
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమాతో ఇతర సినిమా పనులు కూడా ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ పక్కన పెట్టేసి అందరూ 'బంగార్రాజు'ని రెడీ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఆఖరి నిమిషం వరకు గ్రాఫిక్స్ వర్క్ మీద కూర్చోకుండా.. వీలైనంత త్వరగా సినిమా పనులు పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా కనిపించనున్నారు.
Also Read: షూటింగ్ క్యాన్సిల్.. ఇంట్లోనే చిల్ అవుతోన్న రౌడీ హీరో..
Also Read: క్లాసులు షురూ.. ధనుష్ 'సార్' ఆన్ డ్యూటీ..
Also Read: కోవిడ్ పాజిటివ్ వైఫ్.. నితిన్ బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేశాడో చూశారా..?
Also Read: 'హృదయమా' ఫస్ట్ సింగిల్.. రిలీజ్ చేసిన మహేష్ బాబు..
Also Read: టికెట్ ధరల పెంపుపై నాగార్జున స్పందన.. అలా అనేశారేంటీ? నిర్మాతలకు షాకే!
Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..