Dhurandhar 2 Trailer: మార్చి 5న కాదు, ఇంకా ముందుగా... 'ధురంధర్ 2' ట్రైలర్ నయా రిలీజ్ డేట్ ఇదుగో
Dhurandhar 2 Trailer Release Date: మార్చి 5 కంటే ముందుగా 'ధురంధర్ 2' ట్రైలర్ విడుదల కానుంది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన సినిమా ప్రమోషన్స్ మరింత జోరుగా సాగనున్నాయి. ఆ విశేషాలు

'ధురంధర్ 2' అభిమానులకు ఓ శుభవార్త... తొలుత ఈ సినిమా ట్రైలర్ మార్చి 5న విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు మార్చి 8న విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ట్రైలర్ విడుదల తేదీని మార్చారని బాలీవుడ్ నుంచి సమాచారం అందుతోంది. ఇప్పుడీ సినిమా ట్రైలర్ మార్చి 5, 2026 కంటే ముందే విడుదల కానుంది. అది ఎప్పుడో తెలుసా?
మార్చి 5 కాదు... ట్రైలర్ విడుదల ఎప్పుడంటే?
Dhurandhar 2 trailer release date news: నిజం చెప్పాలంటే... ఇప్పుడు 'ధురంధర్ 2' ట్రైలర్ మార్చి 5న కాదు, మార్చి 3న విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానుల్లోనూ చాలా ఉత్సాహం నెలకొంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ కొత్త అవతారంలో కనిపించవచ్చు. లయారి కింగ్‌గా అతన్ని చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు.
'ధురంధర్ 2' కథలో చాలా సీక్రెట్స్ ఉన్నాయిగా!
'ధురంధర్ 2'లోని కథలో మొదటి భాగంలో ఉన్న అనేక సీక్రెట్స్‌ను కూడా వెల్లడించనున్నారు. ట్రైలర్‌లో చూపించిన కొన్ని సన్నివేశాలు అభిమానులకు కొత్త ట్విస్టులను చూపించవచ్చు. ఈ సీక్వెల్‌లో హంజా పాత్రను మరింత కొత్తగా చూడవచ్చు.
Also Read: Adivi Sesh: తిరుమల ప్రసాదం టేస్టీగా ఉంది... లడ్డూ వివాదంలో పరోక్షంగా వైసీపీకి అడివి శేష్ కౌంటర్?
View this post on Instagram
అకాశాన్ని అంటుతున్న అభిమానుల అంచనాలు
సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా చర్చ జరుగుతోంది. ప్రతి ఫోటో, అప్‌డేట్‌తో ప్రజల ఉత్సాహం పెరుగుతూ ఉంది. ట్రైలర్ విడుదల తేదీ ప్రకటించిన తర్వాత అభిమానుల ఉత్సుకత మరింత పెరిగింది. ఈ సినిమాను జియో స్టూడియోస్, దర్శకుడు ఆదిత్య ధర్ సొంత ప్రొడక్షన్ హౌస్ బి6 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. పార్ట్ 1 కంటే భారీ స్థాయిలో రూపొందించారు. ఈద్ సందర్భంగా... అంటే మార్చి 19, 2026న సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
Also Read: Rashmika Mandanna: దేవరకొండ ఇంట్లో రష్మిక గృహ ప్రవేశం... వైరల్ వీడియో చూశారా?























