Nithiin: నితిన్ భార్యకు కోవిడ్.. ఆమె బర్త్‌డేను ఎలా సెలబ్రేట్ చేశాడో చూడండి
భార్యకు కరోనా సోకినప్పటికీ.. డిఫరెంట్ గా ఆమె బర్త్ డే సెలబ్రేట్ చేసి సర్ప్రైజ్ చేశారు హీరో నితిన్.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, విశ్వక్ సేన్ ఇలా చాలా మంది సెలబ్రిటీలకు కరోనా సోకింది. నితిన్ భార్య షాలిని కూడా కోవిడ్ బారిన పడింది. ఈరోజు ఆమె పుట్టినరోజు కావడంతో నితిన్ ఆమె బర్త్ డే సెలబ్రేట్ చేయాలనుకున్నారు. భార్యకు కరోనా సోకినప్పటికీ.. డిఫరెంట్ గా ఆమె బర్త్ డే సెలబ్రేట్ చేసి సర్ప్రైజ్ చేశారు.
షాలినికి కరోనా రావడంతో వాళ్ల ఇంట్లోనే ఒక రూమ్ లో ఆమె ఐసోలేషన్ లో ఉన్నారు. ఆమె కిటికీలోంచి చూస్తూ ఉండగా.. గార్డెన్ ఏరియాలో నితిన్ తన ఫ్యామిలీతో కలిసి కేక్ కట్ చేసి తన భార్యకు విషెస్ చెప్పారు. భార్యకు దూరంగా ఉంటూనే ఆమె పుట్టినరోజుని ఇలా సెలబ్రేట్ చేయడంతో నితిన్ కు ఆమెపై ఉన్న ప్రేమను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
'కోవిడ్ కి బారియర్స్ ఉన్నాయేమో కానీ మన ప్రేమకి లేవు. హ్యాపీ బర్త్ డే మై లవ్.. లైఫ్‌లో ఫస్ట్ టైం నువ్వు నెగిటివ్ కావాలని కోరుకుంటున్నాను' అంటూ సోషల్ మీడియాలో విషెస్ చెబుతూ వీడియో పోస్ట్ చేశారు నితిన్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. షాలిని త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కోరుకుంటున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమాలో నటిస్తున్నారు. ఎస్‌ఆర్ శేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఇందులో నితిన్‌కు జోడీగా కృతిశెట్టి కనిపించనుంది. కేథరిన్ థ్రెసా సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రేష్ఠ మూవీస్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
COVID has barriers…
— nithiin (@actor_nithiin) January 6, 2022
But LOVE has no BARRIERS..
HAPPY BIRTHDAY MY LOVE❤️
LIFE lo 1st time nuvvu negative kavalani korukuntunnanu 😘😘 pic.twitter.com/5zFuOOIaqe
Also Read: 'హృదయమా' ఫస్ట్ సింగిల్.. రిలీజ్ చేసిన మహేష్ బాబు..
Also Read: టికెట్ ధరల పెంపుపై నాగార్జున స్పందన.. అలా అనేశారేంటీ? నిర్మాతలకు షాకే!
Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..
Also Read: కొడాలి నాని ఎవరో తెలియదు.. నాచురల్ స్టార్ నానీ ఒక్కడే తెలుసు! ఆర్జీవీ రివర్స్ పంచ్ రేంజే వేరు
Also Read: ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అదిరిపోయే రికార్డ్, బాలకృష్ణ ఎక్కడా తగ్గట్లేదుగా..
Also Read: అజిత్ సినిమాకు కరోనా ఎఫెక్ట్... వలిమై రిలీజ్ వాయిదా వేసిన చిత్ర బృందం