By: ABP Desam | Updated at : 06 Jan 2022 10:04 AM (IST)
Edited By: RamaLakshmibai
image credit : Manabalayya/ Twitter
సినిమాలు, రాజకీయాలతో బిజిగా ఉన్న బాలకృష్ణ... క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటూ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ అదుర్స్ అనిపించుకున్నారు. బాలయ్య టాక్ షో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్న వారంతా షాక్ అయ్యేలా షో కంటిన్యూ చేస్తున్నారు నందమూరి నటసింహం. ఏదో నడుస్తోంది అనుకుంటే పొరపాటే..ఎందుకంటే ఈ టాక్ షో హిట్ కాదు సూపర్ హిట్ అయింది. ఈ షో హక్కుల కోసం పలు టీవీ చానెల్స్ పోటీపడుతున్నాయని టాక్. ఈ షో కోసం బాలయ్య చేస్తున్న హోం వర్క్ అంతా ఇంతా కాదు. కొత్తతరంతో కలసి పనిచేస్తూ ఇప్పటి వరకూ చూడని బాలయ్యని పరిచయం చేశారు.
Thank you for the UNSTOPPABLE Response😀#UnstoppableWithNBK features in the top 10 reality TV list on @IMDb #NandamuriBalakrishna #MansionHouse @tnldoublehorse @swargaseema #NandGokulGhee #TilakNagarIndustriesltd #CellPoint pic.twitter.com/zEr1LX3IuP
— ahavideoIN (@ahavideoIN) January 5, 2022
ఇప్పటికే అఖండ సూపర్ హిట్ తో 2021 కి బైబై చెప్పిన బాలకృష్ణ అదే సమయంలో టాక్ షోతో అంతకుమించి అనిపించుకున్నారు. ఇప్పటికే 7 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ తాజాగా రవితేజ, గోపిచంద్ మలినేని ఇంటర్వ్యూతో మరో మజిలీ పూర్తి చేసుకుంది. తన టైమింగ్ తో నవ్వులు పూయించడమే కాదు వాళ్లను ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్లడంతో సక్సెస్ అయ్యారు. పైగా ప్రతి ఎపిసోడ్ లోనూ హ్యూమన్ యాంగిల్ స్టోరీని ప్రసారం చేస్తూ ఎపిసోడ్ కి మరింత మెరుగులు అద్దుతున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. బాలయ్య హోస్ట్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ షో IMDB (ఇండియన్ మూవీ డేటా బేస్)లో చోటు సంపాదించుకుంది. ఈ షో టాప్ 10 రియాలిటీ టీవీలో లిస్టులో చేరినట్టు ప్రకటించింది. IMDB 9.4/10 రేటింగ్‌తో దూసుకుపోతుంది. మొత్తంగా బాలయ్య ‘ఆహా’ ఓటీటీ వేదికతో నిజంగా హోస్ట్‌గా ప్రేక్షకులతో ఆహా అనిపిస్తున్నారు. ప్రస్తుతం అఖండ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న బాలకృష్ణ... సంక్రాంతి తర్వాత గోపీచంద్ మలినేని తో ప్రాజెక్ట్ ను పట్టాలపైకి తీసుకెళ్లనున్నారు.
Also Read: దీపా నీ మంచితనం రోజురోజుకీ భరించలేనంత బరువుగా మారుతోందంటూ డాక్టర్ బాబు ఆవేదన.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
Also Read: వసుధార కోసం పోటాపోటీగా రిషి-గౌతమ్… అయోమయంలో జగతి-మహేంద్ర… గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్
Also Read: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..
Also Read:దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?
Family Star: 'ఫ్యామిలీ సార్' సంక్రాంతి రేసు నుంచి వెనక్కి - 'దిల్' రాజు క్లారిటీ
Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!
Nagarjuna Shirt Rate: బిగ్ బాస్‌లో నాగార్జున ధరించిన ప్యాచ్ షర్ట్ రేటు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువ?
Telangana Election Results 2023 LIVE: 2 రౌండ్లు ముగిసే సరికి మ్యాజిక్ ఫిగర్ కు చేరిన కాంగ్రెస్
Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం
Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?
DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!
/body>