Karthika Deepam జనవరి 6 ఎపిసోడ్: దీపా నీ మంచితనం రోజురోజుకీ భరించలేనంత బరువుగా మారుతోందంటూ డాక్టర్ బాబు ఆవేదన.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనవరి 6 గురువారం 1242 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…
కార్తీకదీపం జనవరి 6 గురువారం ఎపిసోడ్
దీప పిల్లలకు అన్నం పెట్టడంతో నిన్నటి( బుధవారం) ఎపిసోడ్ ముగిసి..ఈ రోజు ( గురువారం) సేమ్ సీన్ తో ప్రారంభమైంది. రుద్రాణి మీతో గొడవ పెట్టుకుని మాతో బాగా ఉంటుంది ఎందుకని అడిగిన హిమతో...ఆమె గురించి ఆలోచించడం మానేయండి అంటుంది దీప. శౌర్య కూడా రుద్రాణి గురించి మాట్లాడబోతుంటే ఆమె గురుంచి ఆలోచించొద్దన్నా కదా అంటుంది. అటు కార్తీక్ తన కుటుంబంతో కలిసున్న ఆనంద క్షణాలు గుర్తుచేసుకుని బాధపడతాడు. అందర్నీ బాధపెట్టి ఏం సాధించాను, వీటికి తోడు రుద్రాణి తలనొప్పి ఒకటి అనుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన దీప ఎందుకు బాధపడతారు..మీ బలం ఏంటో మీ గొప్పతనం ఏంటో మీకు తెలియడం లేదు..ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది..రుద్రాణి అప్పుగురించి టెన్షన్ పడుతున్నారా అని అడుగుతుంది దీప. అప్పు మాత్రమే కాదు మన బిడ్డల్లో ఒకర్ని తీసుకెళతా అందని నీకెలా చెప్పాలి అనుకుంటాడు కార్తీక్.
Also Read: మోనిత కొడుకుపై ప్రేమ పెంచుకుంటున్న డాక్టర్ బాబు, వంటలక్క.. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
మీరు అప్పుతీరుస్తా అని సంతకం చేసినప్పటి నుంచీ రుద్రాణి పదే పదే ఇంటికొస్తోంది, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది ఎందుకు..అంత ఆస్తిని అలా ఇచ్చేసిన మీరు రుద్రాణి అప్పుకోసం ఇంత టెన్షన్ పడతారనుకోను..నా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నారా అని అడుగుతుంది దీప. తప్పని పరిస్థితుల్లో కార్తీక్ నిజం చెబుతాడు. గడువు లోగా ఒప్పుకున్న బాకీ సొమ్ము చెల్లించకపోతే పిల్లల్లో ఒకర్ని తీసుకెళ్లిపోతానందని చెబుతాడు. అలా ఎలా ఒప్పుకున్నారు, మాటకోసం బిడ్డని ఇచ్చేస్తారా, నా బతుకింతేనా...ఎప్పుడూ బిడ్డల్ని దూరం చేసుకునే బతకాలా అని కన్నీల్లు పెట్టుకుంటుంది. ఆవేశంలో సంతకం పెట్టాను..అందులో తను అలా రాసుకుందని తర్వాత తెలిసింది అంటాడు. అంటే మీరు సంతకం పెడితే నా బిడ్డని తను ఎలా తీసుకెళుతుంది..అంతా మీ ఇష్టమేనా..ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు..తప్పులు మీద తప్పులు జరుగుతున్నాయి..దేవుడా ఏంటిది అని ఏడుస్తుంది దీప. ఎన్నో బాధలు పడ్డాను, అన్నీ సర్దుకున్నాయి అనేసరికి దిక్కులేని వాళ్లలా రోడ్డున పడ్డాం, ఆస్తి పోయినా మిమ్మల్ని ఒక్కమాట కూడా అనలేదు..అంతా కలసి ఉంటే చాలనుకున్నాను. ఇక్కడేదో కష్టం చేసుకుని బతుకుతుంటే ఆ రుద్రాణికి నా బిడ్డలపై కన్ను పడిందా..నన్ను ఏం చేద్దాం అనుకుంటారు డాక్టర్ బాబు అని ప్రశ్నిస్తాడు.
Also Read: డాక్టర్ బాబు తమ్ముడిని 'బుజ్జి బంగారం' అంటూ వెంటపడుతోన్న మోనిత
నువ్వేదో డబ్బులు అడిగావు కదరా గుర్తుచేయాలి కదా అని తన వద్ద ఉన్న రౌడీని అడుగుతుంది రుద్రాణి. డబ్బులు తీసుకోవడమే కాదు చెప్పిన పని చేయడం కూడా నేర్చుకోండి అంటుంది రుద్రాణి. ఇంతలో అక్కడకు వచ్చిన కార్తీక్ ని చూసి..ఏంటి ఈ టైంలో దారితప్పి వచ్చారని అడుగుతుంది. మీరు పెత్తనం చేస్తారో, అధికారం చేస్తారో మీ ఇష్టం..కానీ నా పిల్లల జోలికి, నా కుటుంబం జోలికి రావొద్దని హెచ్చరిస్తాడు. మీ బాకీ తీర్చడంతో మీకు-మాకు ఎలాంటి లావాదేవీలు ఉండవని తేల్చి చెబుతాడు. రూపాయి రూపాయి పోగేస్తే లక్షల్లో అప్పు ఎలా తీరుస్తారు..అందుకే అగ్రిమెంట్ లో రాసుకున్నదాని ప్రకారం నీ కూతుర్లలో ఒకర్ని తెచ్చుకోవడం ఖాయం, పెంచుకోవడం ఖాయం..అప్పుడొచ్చి రామ్మా అంటే పిల్లలు రారుకదా అందుకే ఇప్పటి నుంచి మచ్చిక చేసుకుంటున్నా అంటుంది. మీ మంచి కోరి చెబుతున్నా నా పిల్లల గురించి ఆలోచించడం మానేయండని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. అరిచినంత మాత్రాన అప్పులు తీరవు కదా...జరిగేదేదో నా కళ్లకు కట్టినట్టే కనిపిస్తోంది అంటుంది రుద్రాణి.
Also Read: వసుధారపై ప్రేమను బయటపెట్టే ప్రయత్నాల్లో రిషి, మరి గౌతమ్ సంగతేంటి..గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
రుద్రాణి ఇంటి నుంచి వచ్చిన కార్తీక్ ని ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది దీప. అప్పు తీర్చకపోతే అమ్మాయిని తీసుకెళ్తా అంటుందా తల్చుకుంటేనే కడుపు మండిపోతోంది, కానీ మనం ఆవేశపడే స్థితిలో లేం, ఆలోచించండి అన్న దీప..మనం జాగ్రత్తగా ఉండాలి...ఇలాంటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు..ఎలాగైనా అప్పు తీర్చేద్దాం అంటుంది దీప. గడువులోగా అప్పు తీర్చకపోతే బిడ్డను ఇస్తాం అని సంతకం చేసిన గొప్ప తండ్రిని కదా ..ఈ విషయం నా పిల్లలకు తెలిస్తే ఏమని సమాధానం చెప్పను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మీరు తెలిసి ఏ తప్పూ చేయలేదు డాక్టర్ బాబు .. ఆ అప్పు తీరుద్దాం అని ధైర్యం చెబుతుంది దీప. నేను ఎన్ని తప్పులు చేసినా ఎందుకు గట్టిగా అరవ్వు, నాపై ఎందుకు కోపం తెచ్చుకోవు..నీ మంచితనం ఓపిక రోజురోజుకీ నన్ను కుచించుకుపోయేలా చేస్తున్నాయి... నన్ను తిట్టు, నిలదీయ్..కోపం రావట్లేదా..అప్పుడేమో నా అనుమానంతో దూరం చేసుకున్నాను..కానీ నువ్వు భరించావు... ఇప్పుడు ఉన్నదంతా వేరేవాళ్లకి ఇచ్చేసి నిన్ను రోడ్డుమీద నిలబెట్టాను అయినా అదే చిరునవ్వుతో మాట్లాడుతున్నావు ఈ మంచితనం రోజురోజుకీ భరించలేనంత బరువుగా మారుతోంది..నీ కోపం పోయేదాకా రోజంతా నన్ను తిట్టు.. నేను చేసిన తప్పులు ఎత్తిచూపించి తిట్టు అంటాడు. స్పందించిన దీప... డాక్టర్ బాబు మీరు తెలిసి ఏ తప్పూ చేయరని నా నమ్మకం.. పిల్లలకు ఈ విషయం తెలియదు కదా.. ఆ రుద్రాణి సంగతి.. అప్పు సంగతి మనం చూసుకుందాం..ఆవేశ పడొద్దు..కోపంలో కొత్త తప్పులు చేస్తాం..ఓ చీటీ వేసి అప్పు తీర్చేద్దాం అంటుంది దీప. మీరు అవునన్నా కాదన్నా ఎప్పటికీ నా డాక్టర్ బాబే అంటుంది దీప. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది....
రేపటి ఎపిసోడ్ లో
తయారు చేసిన పిండి వంటలు అమ్మేందుకు దుకాణాల చుట్టూ తిరుగుతుంది దీప. అయితే అప్పటికే రుద్రాణి అన్ని దుకాణాలకు పిండి వంటలు సప్లై చేయడంతో ఎవ్వరూ తీసుకోరు. అంటే దీప వ్యాపారానికి గండికొట్టే ప్రయత్నంలో పడిందన్నమాట...
Also Read: దీప వ్యాపారం దెబ్బకొట్టేందుకు, కార్తీక్ ని అవమానించేందుకు పక్కా ప్లాన్ వేసిన రుద్రాణి.. కార్తీకదీపం అప్ డేట్స్
Also Read: వసుధార విషయంలో గౌతమ్ కి షాకిచ్చిన రిషి, సర్ ప్రైజ్ చేసిన గౌతమ్..గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి