By: ABP Desam | Updated at : 04 Jan 2022 09:32 AM (IST)
Edited By: RamaLakshmibai
guppedanthaGuppedantha Manasu January 4th Episode (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంత మనసు 2022 జనవరి 4 మంగళవారం ఎపిసోడ్
రిషి క్లాస్ రూమ్ కి వెళ్లడం..ఆ వెనుకే వసు-పుష్ప క్లాస్ లోకి వెళ్లడంతో ఈ రోజు ఎపిసోడ్ మొదలైంది. వసులో ఏదో కంగారు చూసిన రిషి.. వసుధార అని పిలిచినా పలకదు. రెండుసార్లు గట్టిగా పిలవడంతో ఉలిక్కిపడిన వసు లేచి నిల్చుంటుంది. వసుధార నీకు క్లాస్ వినడం ఇష్టం లేకపోతే వేరేవాళ్లని డిస్ట్రబ్ చేయొద్దు..నువ్వు క్లాస్ నుంచి బయటకు వెళ్లొచ్చంటాడు. వెంటనే ఎస్ సార్ అనేసి వెళ్లిపోతుంది. షాక్ అయిన రిషి..వెళ్లమంటే వెళ్లిపోవాలా ఉండొచ్చుకదా అనుకుంటాడు. అటు వసుధార మాత్రం సార్ కార్ కీ వెతకడానికి ఇదే మంచి సమయం అనుకుని వెళ్లిపోతుంది. ఈగోమాస్టర్ మాత్రం క్లాస్ లో కూడా వసు ఆలోచనలతోనే ఉంటాడు. ఇక వసుధార కార్ కీ వెతుకుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిన జగతి క్లాస్ వదిలేసి ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుగుతుంది. పోయింది వెతుకున్నా అన్న వసుతో..పోగుట్టుకుంది దొరకడం కష్టం జాగ్రత్త అనేసి వెళ్లిపోతుంది.
Also Read: దీపని రుద్రాణి ఏం చేసింది, కార్తీక్ కంగారులో అర్థ ఉందా.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
కాలేజీ కాన్ఫరెన్స్ రూమ్ లో అంతా మీటింగ్ లో ఉంటారు. డీబీఎస్టీ కాలేజీకి ఇంత మంచి పేరు రావడంతో మీ అందరి కృషి ఉందని పొడుగుతాడు ఫణీంద్ర. బంగారానికి మెరుగుపెట్టినట్టు ఈ కాలేజీకి .. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మంచి పేరు తెచ్చిపెట్టిందని పొడుగుతాడు. అంతా జగతి మేడం-రిషి సార్ కష్టమే అంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ ని బాధ్యతగా భావిస్తున్నాం, ఈ బాధ్యతని ఆనందంగా భుజానికి ఎత్తుకున్నాం అన్న జగతి..మిషన్ ఎడ్యుకేషన్ అనాగనే నా పేరు చెబుతున్నారు కానీ దీని వెనుక అందరి కృషి ఉంటంటుంది జగతి.
Also Read: వసు కోసం పోటాపోటీగా రిషి-గౌతమ్… ఆర్య టైప్ లవ్ స్టోరీలా మారిన గుప్పెడంత మనసు
రిషి కార్ కీ దొరకిన తర్వాత కాలేజీ ఆవరణలో మెట్లపై కూర్చుంటుంది వసుధార. వెళదాం రా అని పుష్ప అన్నప్పటికీ కాసేపు కూర్చుని వస్తానని పంపించేస్తుంది వసుధార. ఇంతలో రిషి రావడం చూసి అటువైపు వెళుతుంది వసుధార. క్లాస్ లో ఆబ్సెంట్ మైండ్ తో ఉండడం నచ్చలేదంటాడు. వసు మాట్లాడేందుకు ప్రయత్నించినా మాట్లాడనివ్వడు. ఆరోపణ చేసినప్పుడు నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి కదా అంటుంది వసుధార. ఇప్పుడేంటి కాలేజీ అయిపోయింది..రెస్టారెంట్ కి వెళ్లాలి కదా లిఫ్ట్ కావాలా నేను ఇవ్వనంటూ కార్ కీ వెతుక్కుంటాడు రిషి. ఇంతలో కీ ఇచ్చిన వసుధార.. ఏం జరిగిందో చెబుతుంది. అంతా విన్న ఈగో మాస్టర్...కార్ కీ కోసం క్లాస్ పోగొట్టుకోవడం నచ్చలేదు..కార్ కీ పోయిందని చెబితే అటెండర్ తో వెతికించేవాడిని అంటాడు. స్పందించిన వసుధార..ఆ క్లాస్ మళ్లీ అడిగితే చెప్పరా అనడంతో రిషి కూల్ అయిపోతాడు..
కట్ చేస్తే రెస్టారెంట్లో సీన్ ఓపెన్ అయంది. వసుధార టేబుల్ ఎక్కడుందో అడిగి మరీ గౌతమ్ కూర్చుంటాడు. ప్రపంచంలో ఇంతమందిని చూశాను ఈ వసుధారకే ఎందుకు కనెక్టయ్యా.. అంతా దేవుడి లీల అనుకుంటాడు గౌతమ్. ఇంతలో రిషి కూడా రెస్టారెంట్ కి వెళ్లి వసు టేబుల్ దగ్గర కూర్చుంటాడు. సార్ కాఫీ తీసుకురమ్మంటారా అని వసు అడిగితే..ఇక్కడకు ఎందుకొస్తా కాఫీ కోసమే కదా అంటాడు.
Also Read: సీతాకోక చిలుకల్లా రెండు మనసులు ఊగిన నెమలి ఈక ఉయ్యాల, గుప్పెడంత మనసు ఎపిసోడ్ అంతా ప్రేమమయం..
జగతి చెప్పింది విన్న మహేంద్ర... నీ కొడుకు నిన్ను అలా కన్ఫ్యూజ్ చేశాడన్నమాట అంటాడు.అవును రిషి క్లియర్ గానే ఉన్నాడు మనమే అర్థం చేసుకోలేకపోయాం అంటుంది జగతి. గోలీలు-నెమలి ఈకలు ఉన్న బాటిల్ పై జగతి రాసిన కొటేషన్ చూపిస్తుంది జగతి. మూడు ముక్కల్లో ఇద్దరి గురించి చెప్పేశావ్ అంటాడు మహేంద్ర. స్పందించిన జగతి.. ఇద్దరూ తెలివైన వాళ్లే కానీ ఎవ్వరూ ముందడుగు వేయడం లేదంటుంది. కొడుకు ప్రేమ కథకు నువ్వే వారధిగా మారితే బావుంటుందేమో అని చెబుతాడు మహేంద్ర. వసు-రిషి ఎవరికి వారే ప్రత్యేకం కానీ మనం ఊహించనిది జరిగితే మళ్లీ మనం బాధపడాలి అంటుంది జగతి. నిప్పు-ప్రేమ రెండింటినీ దాచలేం..ఎంత దాచినా ఎప్పుడో అప్పుడు దానంతట అదే బయటపడుతుంది..ఇద్దరి మధ్యలో ఏముందో తెలియదు కానీ ఏదో ఒక టైమ్ లో ఎవరో ఒకరు బయటపడకపోరు అంటాడు మహేంద్ర.
Also Read: వసుపై ప్రేమతో ప్లేట్ ఫిరాయించిన రిషి, మహేంద్ర క్లాస్-జగతి షాక్, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
మళ్లీ రెస్టారెంట్లో సీన్ ఓపెన్ అయింది. వసుని తలుచుకుంటాడు రిషి. మరోవైపు గౌతమ్ ఏంటో ఈ మాయ అనుకుంటూ హలో వసుధార అని పిలుస్తాడు. అప్పుడు రిషి-గౌతమ్ ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుని షాక్ అవుతారు. నువ్వేంటి ఇక్కడ అంటే నువ్వేంటి ఇక్కడ అని క్వశ్చన్ చేసుకుంటారు. అక్కడకు వచ్చిన వసుధార..సార్ మీ ఇద్దరూ వేర్వేరుగా వచ్చారా అని అడుగుతుంది. కాఫీ తీసుకురా అని పంపించేసి.. ప్రతిసారీ రెస్టారెంట్లో నీకేం పని నేనెప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటున్నావ్ అన్న రిషితో.. నేను వచ్చిన ప్రతీసారీ నువ్వొస్తున్నావ్ ఆ లాజిక్ మరిచిపోతున్నావ్ అంటాడు గౌతమ్. నువ్వెందుకు వస్తున్నావో నేనూ అందుకే వస్తున్నా అని షాకిచ్చిన రిషి..కాఫీ తాగేందుకు అని చెబుతాడు. ఇంతలో చిన్న సర్ ప్రైజ్ అంటూ వసుతో దిగిన సెల్ఫీ చూపిస్తాడు గౌతమ్. అది చూసి రిషి షాక్ అవుతాడు..ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది....
Also Read: దీప వ్యాపారం దెబ్బకొట్టేందుకు, కార్తీక్ ని అవమానించేందుకు పక్కా ప్లాన్ వేసిన రుద్రాణి.. కార్తీకదీపం అప్ డేట్స్
Also Read: రుద్రాణికి కార్తీక్ వార్నింగ్, అప్పు తీర్చకపోతే కథ వేరే ఉంటదన్న రుద్రాణి.. ‘కార్తీకదీపం’ అప్ డేట్స్..
Also Read: రెండు క్యారెక్టర్లు ఔట్..కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?
Pakka Commercial 2nd Single: రాశి, అందాల రాశి - హీరోయిన్ పేరు మీద 'పక్కా కమర్షియల్' సినిమాలో సాంగ్, రిలీజ్ ఎప్పుడు అంటే?
Simha Koduri As USTAAD: రాజమౌళి ఫ్యామిలీలో యంగ్ హీరో కొత్త సినిమాకు 'ఉస్తాద్' టైటిల్ ఖరారు
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
PM Modi In ISB: 25 ఏళ్లకు వృద్ధి మ్యాప్ రెడీ- ఐఎస్బీ హైదరాబాద్లో ప్రధానమంత్రి మోదీ
Keema Recipe: దాబా స్టైల్లో కీమా కర్రీ రెసిపీ, తింటే ఎంతో బలం