By: ABP Desam | Updated at : 01 Jan 2022 10:45 AM (IST)
Edited By: RamaLakshmibai
guppedanthaGuppedantha Manasu January 1 Episode (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంత మనసు 2022 జనవరి 1 శనివారం ఎపిసోడ్
వసుధార విషయంలో నువ్విలా ప్రవర్తించడానికి రిషి కారణమా అని మహేంద్ర అడిగితే.. నువ్వు అనుకున్నదే నిజం అనుకో మహేంద్ర అని జగతి చెబుతుంది. ఎవరికోసమో అర్థం లేని పనులు చేయొద్దన్న మహేంద్రతో ఒక్కోసారి మనకి నచ్చిన వారికోసం ఎంతదూరమైనా వెళ్లాలి మహేంద్ర అంటుంది. కాఫీ బావుంది జగతి..కానీ ఇక్కడ జరిగింది నువ్వు చేసింది అస్సలు బాగాలేదు అని చెప్పేసి వెళ్లిపోతాడు మహేంద్ర.
Also Read: వసుపై ప్రేమతో ప్లేట్ ఫిరాయించిన రిషి, మహేంద్ర క్లాస్-జగతి షాక్, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
కట్ చేస్తే .. గౌతమ్ బొమ్మగీస్తూ ఉంటాడు, రిషి కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. బొమ్మ కళ్లు అందంగా రావాలి, ఆ కళ్లు చూస్తే ప్రపంచాన్ని మరిచిపోయేలా ఉండాలి, ఆకళ్లు చూస్తే తనే మన ప్రపంచం అనుకోవాలి అంటాడు. అటు రిషి మాత్రం వసుధార నువ్వు ఎక్కడికీ వెళ్లడం లేదని చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటాడు. అందమైన కళ్లు నన్ను కలవరపెడుతున్నాయన్న గౌతమ్ తో ఏంటిరా నీ కళ్లగోల అని చిరాకు పడతాడు రిషి. నువ్వు ఎప్పుడూ చిరాకుగానే ఉంటావ్ కదా మళ్లీ నేను కూడా అంటావేంటి అంటాడు గౌతమ్. ఇంతలో రిషికి కాల్ చేసిన మహేంద్ర నువ్వు కోరుకున్నదే జరిగింది కదా రిషి అని కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్చాఫ్ చేస్తాడు. బొమ్మలో హెల్ప్ చేయి అన్న గౌతమ్ తో.. నీది రాతి హృదయంరా బాబు అంటుండగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. నువ్వు సాయం చేయకపోతే నేను గీయలేనా అని గౌతమ్ ఆ పనిలో పడతాడు.
Also Read: రుద్రాణికి కార్తీక్ వార్నింగ్, అప్పు తీర్చకపోతే కథ వేరే ఉంటదన్న రుద్రాణి.. ‘కార్తీకదీపం’ అప్ డేట్స్..
జగతి ఇంట్లో
రోజూ కారు అలవాటైందా, రెస్టారెంట్ డ్యూటీ అయిపోగానే ఇంటికి రావాలి అంటూ జగతి మేడం అన్న మాటలు, వసుధారా నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దన్న రిషి మాటలు తలుచుకుంటుంది వసుధార. ఇంతలో జగతి అక్కడకు వచ్చి.. వసుతో ఇలా అంటుంది... 'నాకో విషయం అర్థం కావడం లేదు నేను నిన్ను వెళ్లమన్నానే అనుకో వెళ్లిపోవడమేనా అలా ఎలా వెళతావ్ వసు..నాపై నీకు గౌరవం లేదా... నువ్వు వెళతావని నేను ఊహించలేదు తెలుసా.. నా అంచనాలను తల్లకిందులు చేశావ్... నేను చెప్పాను సరే నా మనసు తెలుసుకోవాలి కదా' అంటుంది. స్పందించిన వసుధార.. మీరెందుకు అలా ప్రవర్తించారని అడుగుతుంది. అయితే ప్రతి ప్రశ్నకు సమాధానం ఉండదు..ఒక్కోసారి సమాధానం వెతుక్కుని వస్తుంది-ఇంకోసారి సమాధానాన్ని మనం వెతుక్కుని వెళ్లాలి అంటుంది. రిషి సార్ ఒక్కోసారి ఇలాగే ప్రవర్తిస్తుంటారు...మనం ఏదైతో అడగాలనుకుంటామో-ఆయన రివర్స్ లో మనల్ని అడుగుతారు..ఆయన ఎందుకిలా చేస్తారో నాకిప్పుడు అర్థంమైంది అంటుందు వసుధార. తల్లీ-కొడుకులు ఒకేలా ఉన్నారు అనుకుని నిద్రపోతుంది.
Also Read: గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
రిషి
రిషి ఫోన్లో వసుతో కలిసున్న ఫొటో చూసుకుంటూ.. వసుని హాస్టల్ కి పంపించేయమన్న విషయం-నువ్వు ఇక్కడే ఉండాలన్న విషయం గుర్తుచేసుకుని నువ్వు ఇంతలా బాధపడతావని అనుకోలేదు.. అందుకే ఇప్పుడు సరిదిద్దుకున్నా అనకుంటాడు. పక్కనే వసుధార ఇచ్చిన గోళీల బాటిల్ చూసి డ్రీమ్స్ లో కి వెళ్లిపోతాడు ఈగో మాస్టర్. నేను నీకు బాధను పంచాను కానీ నువ్వు నాకు జ్ఞాపకాలు పంచుతున్నావ్ అనుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్ ఆ బాటిల్ లాక్కుని నివ్వింకా గోళీలు ఆడుతున్నావా అంటాడు. ఆ బాటిల్ నా పర్సనల్ ఇచ్చెయ్, ఇది నా సొంతం,నాది అంటూ లాక్కునేందుకు ప్రయత్నిస్తాడు ( ఇక్కడ గోళీల ప్లేస్ లో వసుధారని పెట్టి లాక్కునేట్టు చూపించాడు). ఒరేయ్ అందులో ఏమున్నాయి, ఓ 20 రూపాయలు పెడితే వస్తాయి కదా అన్న గౌతమ్ తో .. జ్ఞాపకాలను డబ్బుతో కొనలేం అంటాడు. అబ్బో..నీకు ఎవరు చెప్పార్రా ఈ కొటేషన్ అన్న గౌతమ్ తో..జీవితంలో కొన్ని జ్ఞాపకాలు పోగుచేసుకో, డబ్బులు కాదని చెబుతాడు రిషి. ఒకవేళ ఈ బాటిల్ కొట్టేస్తే ఏం చేస్తావ్ అని గౌతమ్ అంటే చంపేస్తా అంటాడు రిషి ( వసుధార తో జరిగిన ఘటనలన్నీ తలుచుకుని ఆమె నాకు చాలా అందమైన జ్ఞాపకాలు అందించింది..నేను తనని బాధపెట్టా అనుకుంటాడు మనసులో)
Also Read: వసు పయనం ఎటువైపు, రిషి-జగతి ఏం చేయబోతున్నారు.. గుప్పెండత మనసు డిసెంబరు 30 గురువారం ఎపిసోడ్
జగతి ఇంట్లో
పొద్దున్నే వసుధార రూమ్ కి వచ్చిన జగతి.... సారీ వసుధార నిన్ను ఇబ్బంది పెట్టక తప్పలేదు అనుకుంటుంది. పక్కనే ఉన్న గోళీల బాటిల్, నెమలీకలను తీసుకెళ్లి దానిపై కొటేషన్ రాసి అతికించి పెడుతుంది. కట్ చేస్తే నిద్రలేచిన రిషి...రాత్రి డాడ్ కనిపించలేదేంటి లేట్ గా వచ్చారా అనుకుని ఇల్లంతా తండ్రికోసం వెతుకుతాడు. జాగింగ్ కి వెళ్లారని తెలిసి నన్ను పిలవకుండా వెళ్లడమేంటనని అనుకుంటాడు. మరోవైపు నిద్రలేచిన వసుధార ఎదురుగా బాటిల్ కి అతికించి ఉన్న పేపర్ తీసి చదువుతుంది ' సీతాకోక చిలుకల్లా రెండు మనసులు ఊగిన నెమలి ఈక ఉయ్యాల ఇదో తీపి జ్ఞాపకాల జంపాల ' అది చూసిన వసుధార జగతి మేడం ఇది మీరు రాశారు కదా చాలా బావుందని చెబుతుంది. ఇంత తక్కువ పదాలతో ఎంత మీనింగ్ ఉందో ఇందులో..మహేంద్ర సార్ కి మీకు మధ్య ఉన్న ప్రేమ ఇంత అందంగా అపురూపంగా ఉండేదా మేడం అని అడుగుతుంది. పొద్దున్నే ఈ టాపిక్ ఎందుకు వసు..మళ్లీ దేవయాని అక్కయ్యని గుర్తుచేసుకోవడం అంటుంది. థ్యాంక్యూ మేడం మీరు నాకు భలే ఆటోగ్రాఫ్ ఇచ్చారు ఇది నాకు మంచి గిఫ్ట్ లా ఫీలవుతా అంటుంది ( కాసేపు రిషి ఊహల్లో ఉంటుంది). వసుని చూసిన జగతి.... నువ్వు నీరు -రిషి నిప్పు, నువ్వు నిలకడగా ఉండే భూమి-నిలకడలేని గాలి రిషి, మీ ఇద్దరూ ఎంత దూరం వెళతారో, ఎప్పుడు బయటపడతారో తెలీదు అనుకుంటుంది జగతి.
Also Read: వసుధారతో గౌతమ్ మాట్లాడుతుంటే భరించలేకపోతున్న రిషి, గుప్పెడంతమనసు డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్
రేపటి ఎపిసోడ్ లో
గౌతమ్ రాలేదేంటని అడుగుతాడు రిషి.. వసుధార దగ్గరకు వెళతా అన్నాడు అని చెబుతుంది ధరణి. తింటున్న రిషి అక్కడి నుంచి లేచి వెళ్లి వసుకి కాల్ చేసి..గౌతమ్ ఎందుకొచ్చాడని అడుగుతాడు, ఇదంతా మహేంద్ర వినడంతో...ఏంటి డాడ్ గౌతమ్ ఇలా చేస్తున్నాడు, నువ్వు చెప్పొచ్చుకదా అంటే.. నువ్వు చెబితేనే బావుంటుంది రిషి అంటాడు మహేంద్ర.
Also Read: రెండు క్యారెక్టర్లు ఔట్..కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్..
Also Read: కార్తీక్ గురించి సౌందర్యకి మరో అప్ డేట్ ఇచ్చిన రత్నసీత.. రిస్క్ చేసేందుకు సిద్ధమైన డాక్టర్ బాబు, కార్తీకదీపం డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Jagadhatri December 4th Episode : కంగారులో నోరు జారిన మాధురి.. రంగంలోకి దిగిన ధాత్రి, కేధర్!
నయనతార సినిమాకి చిక్కులు, ‘నాసామిరంగ’ హీరోయిన్ రివీల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Bigg Boss 7 Telugu: అందరినీ మోసం చేసే గుణం నీది, ఇదే నీ నిజస్వరూపం - అమర్‌పై ప్రశాంత్ ఫైర్
Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్
Japan OTT Update: ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమయిన కార్తీ ‘జపాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
/body>