Guppedantha Manasu : గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్

గౌతమ్- వసు- రిషి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఓ వైపు ..కొడుకు మాట కాదనలేక-వసుని బయటకు పంపలేక సతమతమవుతోన్న జగతి మరోవైపు... గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్ లో ఏ జరిగిందంటే.

FOLLOW US: 

గుప్పెడంత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్

గౌతమ్-వసు-రిషి
మంగళవారం రెస్టారెంట్లో క్లోజ్ అయిన ఎపిసోడ్.. బుధవారం రెస్టారెంట్లోనే ఓపెన్ అయింది. వసు కోసం రెస్టారెంట్ కి వెళ్లిన గౌతమ్ అక్కడే ఎదురుచూస్తుంటాడు. నేను వెళతాను సార్ అని గౌతమ్ తో వసు అంటే.. నేను కూడా వస్తాఅంటాడు. ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన రిషి నేను కూడా వస్తా అంటాడు. అక్కడి నుంచి ముగ్గురూ కలసి కారులో బయలుదేరుతారు. వసుధారతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటే వీడు విలన్ లా తయారయ్యాడని మనసులో తిట్టుకుంటాడు గౌతమ్.  వసుధార మనసులో థ్యాంక్యూ రిషి సర్.. కరెక్ట్ టైమ్ కి వచ్చి నన్ను కాపాడారు, లేదంటే గౌతమ్ ని వదిలించుకునేందుకు టైం పట్టేది అనుకుంటుంది. అటు రిషి కూడా వీడికి సరైన టైంలో అర్థమయ్యేలా చెప్పాలి లేదంటే ఇంకా ఎక్కువ చేసేలా ఉన్నాడని మనసులో అనుకుంటాడు రిషి. వసుని జగతి ఇంటిదగ్గర దించేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. 

Also Read: వసుధారతో గౌతమ్ మాట్లాడుతుంటే భరించలేకపోతున్న రిషి, గుప్పెడంతమనసు డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్
జగతి-వసుధార
వసుధార రాగానే రిషి గురించి చెబుతుంటే..మనం మన ఆలోచనలు స్ట్రాంగ్ గా ఉండాలి, మాటలు మాత్రమే కాదని క్లాస్ వేస్తుంది జగతి. షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ వర్క్ చేశావా.. వనభోజనాలు, ఉయ్యాలలు, మెసేజ్ లు , కబుర్లు ఇవేనా అని మనసులో బాధపడుతూనే క్లాస్ వేస్తుంది జగతి.ఇంతకు ముందులా చదువుపై, జీవితంపై శ్రద్ధ ఏకాగ్రత లేదంటుంది. నీ క్రమశిక్షణ , పట్టుదల ఉప్పులా కరిగిపోతున్నాయి.. రెస్టారెంట్ డ్యూటీ అయిపోగానే ఇంటికి వస్తే బావుంటుంది, ఇష్టం వచ్చినప్పుడు వచ్చే దాన్ని ఇల్లు అనరు..నేను తినేశాను, నువ్వు వంట చేసుకుని తిను అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయిన జగతి డోర్ వేసుకుని బాధపడుతుంది. సారీ వసు.. రిషి చెప్పినట్టు నిన్ను ఇంట్లోంచి పంపించేయడానికి ఇంతకన్నా నాకు వేరే మార్గం లేదంటుంది.  మరోవైపు వసుధార కూడా మేడం ఇలా ఎప్పుడూ ప్రవర్తించలేదని బాధపడుతుంది. 

Also Read:  వసు విషయంలో రిషికి క్లారిటీ ఇచ్చిన జగతి.. గౌతమ్ ప్రేమకి అడ్డుతగులుతున్న ఈగో మాస్టర్, గుప్పెడంత మనసు డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
కారులో రిషి-గౌతమ్
వసుని ఇంట్లోంచి పంపించేయమన్నా కదా..జగతి మేడం ఆ పనిలో ఉన్నారా లేదా అనే ఆలోచనలో పడతాడు రిషి. మరోవైపు గౌతమ్ ఇంత సైలెంట్ గా ఉండడం నావల్ల కాదంటాడు. పాటలు పెడతా అని గొడవ పెట్టుకోవడంతో కారు రోడ్డుపక్కన ఆపేసి కిందకు దిగి మాట్లాడుకుంటారు. వసుని ఈ టైమ్ లో కలిసే అవసరం ఏంటి.. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దు, ఆ అమ్మాయి విషయంలో జాగ్రత్తగా ఉండని చెబుతాడు. రోడ్డుమీద యాక్సిడెంట్ తో యాక్సిడెంటల్లీ కలిశాం.. నేను వెళ్లి ఆమెను పరిచయం చేసుకున్నానా అని రివర్స్ లో క్వశ్చన్ చేస్తాడు గౌతమ్. నీ స్టూడెంట్ అని తెలియకముందే నాకు పరిచయమైంది..దీనికి నువ్వెందుకు ఫీలవుతున్నావ్ అంటాడు గౌతమ్. తనకో గోల్ ఉంది, తనని డిస్ట్రబ్ చేయకు అని చెబుతాడు రిషి.  వసుధార తెలివైన అమ్మాయి.. తను అధ్బుతాలు చేస్తుంది నీ మైండ్ లో ఏమైనా ఉంటే తీసెయ్ అంటాడు. 

Also Read: మనసుకి కళ్లెం వేయొద్దన్న మహేంద్ర.. వసుని ఇంట్లోంచి పంపించే ప్రాసెస్ మొదలెట్టిన జగతి.. గుప్పెడంత మనసు డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
జగతి ఇంట్లో:
తన రూమ్ లో కూర్చుకున్న వసుధార.. జగతి తనని అన్న మాటలన్నీ గుర్తుచేసుకుని బాధపడుతుంది. నేను ఏదైనా తప్పు చేశానా, మేడంని నొప్పించానా, అలా చేయలేదు కదా మరి ఎందుకిలా మాట్లాడుతున్నారు, తన తత్వానికి విరుద్ధంగా ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారని ఆలోచిస్తుంది వసుధార. కట్ చేస్తే ఫణీంద్ర-మహేంద్ర-గౌతమ్ ముగ్గురూ కూర్చుని మాట్లాడుకుంటుండగా .. మహేంద్రకి వసుధార కాల్ చేసి ఏం జరిగిందో చెబుతుంది. మేడం ఇలా ఉండరు.. ఎందుకిలా ప్రవర్తిస్తున్నారని అడిగితే..నాక్కూడా అర్థం కావడం లేదంటాడు మహేంద్ర. నా ప్రయత్నం నేను చేస్తున్నాను..ఏంటో తెలుసుకుంటా నువ్వు బాధపడొద్దని చెబుతాడు మహేంద్ర. ఇదంతా రిషి వింటాడు.

Also Read: రిషి మనసులో ఏముంది.. వసుని ఎందుకు హాస్టల్ కి పంపించేయమన్నాడు, గుప్పెడంత మనసు డిసెంబరు 24 శుక్రవారం ఎపిసోడ్...
జగతి-వసుధార
 కట్ చేస్తే ఉదయం నిద్రలేచి మళ్లీ వసుధార అదే ఆలోచనలో పడుతుంది. ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో డైరెక్ట్ గా అడుగుతా అని అడిగేస్తుంది. రాత్రి మీరెందుకు అలా ప్రవర్తించారు, నావల్ల పొరపాటు జరిగితే ఇదిగో నువ్వు ఈ తప్పు చేశావ్ అని అడగండి, నన్ను అడిగే హక్కు, నిలదీసే హక్కు మీకున్నాయి చెప్పండి మేడం ప్లీజ్ అంటుంది. అప్పుడు ఓపెన్ అయిన జగతి నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోవాలి వసు అని బాంబ్ పేలుస్తుంది. కారణాలు అడగొద్దు, హాస్టల్ కి వెళ్లిపో అంటుంది. తప్పేంటి అని అడిగితే.. తప్పొప్పులు అనవసరం వెళ్లిపో అన్నాను వెళ్లిపో అంటుంది. నా వల్ల తప్పేంటని మళ్లీ అడగడంతో రిషి పంపించమన్నాడు అని చెబుతుంది జగతి. అవునా..అయితే రిషి సర్ తోనే తేల్చుకుంటా అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ట్విస్ట్ ఏంటంటే ఇదంతా జగతి ఊహించుకుంటుందన్నమాట. వసు అడగలేదా అనుకుంటుంది. సమాధానం చెప్పండి మేడం అని వసు అడిగితే కాసేపు నన్ను వదిలెయ్ ప్లీజ్ అనేసి జగతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్
రేపటి ఎపిసోడ్ లో
మేడం కొత్తగా మాట్లాడుతున్నారు, నేను తన దగ్గర ఉండడం ఇష్టం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారని రిషి తో చెబుతుంది వసుధార.  తనికి ఇష్టం లేనప్పుడు ఏదైనా హాస్టల్ లో ఉండొచ్చు కదా అంటాడు రిషి. అయితే ఎవరో ఏదో అన్నారు.. కానీ చెప్పడం లేదన్న వసుధార.. నేను ఎక్కడికైనా వెళ్లిపోతా అంటుంది. ఇది ఈగో మాస్టర్ కి షాకేమరి..

Also Read: కార్తీక్-దీప ఉన్న ఊర్లోకి మోనిత పనిమనిషి ప్రియమణి ఎంట్రీ.. కథలో మరో మలుపు.. కార్తీక దీపం డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
Also Read: మోనితని ఇంట్లోంచి గెెంటేసిన సౌందర్య, రుద్రాణి దగ్గరకు చేరిన మోనిత బిడ్డ, కార్తీకదీపం డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 29 Dec 2021 08:46 AM (IST) Tags: Raksha Gowda Mukesh Gowda గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Guppedantha Manasu New Episode Guppedantha Manasu serial Guppedantha Manasu Saturday Episode గుప్పెడంత మనసు Sai Kiran

సంబంధిత కథనాలు

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సాంగ్ - ప్రోమో రిలీజ్ చేసిన రాజమౌళి

Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సాంగ్ - ప్రోమో రిలీజ్ చేసిన రాజమౌళి

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 28th May 2022:  ఈ రాశులవారు తమ పనిని  పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు