IND in IRE, 2 T20Is, 2022 | 2nd T20I | Malahide Cricket Club Ground, Dublin - 28 Jun, 09:00 pm IST
(Match Yet To Begin)
IRE
IRE
VS
IND
IND

Guppedantha Manasu: వసుధారతో గౌతమ్ మాట్లాడుతుంటే భరించలేకపోతున్న రిషి, గుప్పెడంతమనసు డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్

గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్ లో.. రిషి కోసం వసుని బాధపెట్టి తనలో తాను కుమిలిపోతున్న జగతి, వసు... గౌతమ్ కి దగ్గరైపోతాడేమో అనే భావనలో ఉన్న రిషి, ఆసక్తికరంగా సాగిన ఈ రోజు ఎపిసోడ్

FOLLOW US: 

గుప్పెడంత మనసు డిసెంబరు 28 ఎపిసోడ్  
మహేంద్ర-వసుధార
రిషి చెప్పినట్టు వసుధారని హాస్టల్ కి పంపించేందుకు జగతి చిరాకుగా ప్రవర్తించడంతో పాటూ రిషికి కూడా క్లారిటీ ఇవ్వడంతో సోమవారం ఎపిసోడ్ ముగుస్తుంది. ఇదే విషయాన్ని వసుధార మహేంద్రతో చెబుతుంది. జగతి మేడం అలా ప్రవర్తించరని.. అవసరం లేకపోయినా చికాకు పడుతున్నారని అంటుంది వసుధార. కట్ చేస్తే ఇంట్లో కూర్చుని ఆలోచిస్తున్న జగతికి కాల్ చేసిన మహేంద్ర.. ఎలా ఉన్నావ్ అని అడగడంతో మళ్లీ చికాకు పడుతుంది. ఓసారి రెస్టారెంట్ దగ్గర కలుద్దా అని అడినా ఇంట్రెస్ట్ లేదని చెప్పి కట్ చేస్తుంది. మాట్లాడుతుంటూనే కట్ చేసేసిందని వసుతో చెబుతాడు మహేంద్ర. సరే నేను చూసుకుంటా నువ్వు డ్యూటీకి వెళ్లు అని వసు పంపించేస్తాడు. జగతి డిస్ట్రబ్ అయితే వసుని ఎందుకు ఇబ్బంది పెడుతుందనే ఆలోచనలో పడతాడు మహేంద్ర. మరోవైపు రిషి రూమ్ లో బట్టలు సర్దుతుంటుంది ధరణి. వదినా ఎప్పుడూ ఏదోపని చేస్తూనే ఉంటారా అంటాడు రిషి. నీకు ఏమైనా కావాలా అని అడిగితే వద్దు వదినా అంటాడు. గౌతమ్ ఎక్కడికి వెళ్లాడని అడిగితే.. నీ దగ్గరకు రాలేదా అంటుంది ధరణి. నీకేమైనా కావాలంటే అడుగు అనేసి ధరణి అక్కడినుంచి వెళ్లిపోతుంది. ఇంతలో గౌతమ్ వేసిన బొమ్మ ఏంటా అని చూద్దామనుకుని...మొత్తం పూర్తయ్యాక చూద్దాం అనుకుంటాడు రిషి. 

Also Read: వసు విషయంలో రిషికి క్లారిటీ ఇచ్చిన జగతి.. గౌతమ్ ప్రేమకి అడ్డుతగులుతున్న ఈగో మాస్టర్, గుప్పెడంత మనసు డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..
కట్ చేస్తే జగతి ఇంటికి వెళ్లిన మహేంద్ర.. ఏం అడిగినా సమాధానం చెప్పడం లేదంటాడు. నేను తలనొప్పిగా ఉందని చెప్పినా వచ్చావ్.. పదే పదే అడుగుతున్నావ్ ఏమవుతుందని అంటుంది. నిన్ను విసిగించాలని కాదు జగతి నువ్వు డల్ గా మాట్లాడేసరికి ఏం జరిగిందో అని వచ్చానంటాడు. బాగానే ఉన్నాను..నన్నెవరూ ఏమీ అనలేదంటుంది. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని అడగలేదుగా అని కౌంటర్ ఇస్తాడు మహేంద్ర. కాఫీ కలపనా, బయటకు వెళదామా, కాసేపు నడిచి వద్దామా అని అడిగినా..నువ్వెళ్లిపో అంటుంది జగతి. నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు అన్నా స్పందించదు. నీ మోహంలో ప్రతిభావం  కనిపిస్తుందంటాడు. నువ్వు ప్రేమగా అడిగితే చెప్పేస్తానేమో అని మనసులో అనుకుంటుంది జగతి. ఏదో జరిగింది నువ్వు చెప్పడం లేదు నేనే తెలుసుకుంటానని మనసులో అనుకుంటాడు మహేంద్ర

Also Read:మనసుకి కళ్లెం వేయొద్దన్న మహేంద్ర.. వసుని ఇంట్లోంచి పంపించే ప్రాసెస్ మొదలెట్టిన జగతి.. గుప్పెడంత మనసు డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
రెస్టారెంట్లో సీన్ ఓపెన్ అవుతుంది. రెస్టారెంట్లో వసుధారని చూసి ఏంజెల్ రెస్టారెంట్లో కనిపిస్తోంది అనుకుంటాడు గౌతమ్. ఆర్డర్ ప్లీజ్ అని ఓ అమ్మాయి వచ్చి అడగడంతో వెన్నెల వర్షం కప్ ప్లీజ్ అనేసి..సారీ.. కాఫీ ప్లీజ్ అంటాడు. వసు తనని పట్టించుకోపోవడం చూసి అక్కడే వెయిట్ చేస్తూ కాఫీలపై కాఫీలు తాగుతుంటాడు. ఎట్టకేలకు ఆమె గమనించలేదని పిలవడంతో...సర్ ఎప్పుడొచ్చారని అడుగుతుంది వసుధార. ఈ కాఫీలన్నీ నేను తాగినవే నువ్వు వస్తావని చూస్తున్నా అంటాడు. నీ టేబుల్ ఎక్కడ అని అడిగి కూర్చుంటాడు. కాఫీ తాగేశారు కదా ఇంకేం తాగుతారని అంటే.. ఇప్పుడు నువ్విచ్చే కాఫీ స్పెషల్ అంటాడు.  ఇంట్లో కూర్చున్న ఈగో మాస్టర్ రిషి..వసు జ్ఞాపకాల్లో మునిగితేలుతుంటాడు. అదే సమయంలో రెస్టారెంట్లో వసు తెచ్చిన కాఫీతో సెల్ఫీ తీసుకుని స్టేటస్ పెడతాడు. అది చూసిన రిషి అవాక్కవుతాడు. వెంటనే కాల్ చేయడంతో గౌతమ్ రెస్టారెంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. 

Also Read: రిషి మనసులో ఏముంది.. వసుని ఎందుకు హాస్టల్ కి పంపించేయమన్నాడు, గుప్పెడంత మనసు డిసెంబరు 24 శుక్రవారం ఎపిసోడ్...
మరోవైపు దేవయాని రూమ్ కి వెళ్లిన ధరణితో.. నీకు నాపై కోపం వస్తుందా అని అడుగుతుంది. నాకెందుకు కోపం అన్న ధరణితో..నాకు నీపై వస్తోంది..రిషి-వసుధార మధ్యలో జరిగేవి నాకు చెప్పడం లేదంటుంది దేవయాని. ఇందాక కార్ సౌండ్ వినిపించింది  అంటే.. రిషి బయటకు వెళ్లాడని చెబుతుంది ధరణి. వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని ఆగా అంటుంది. నువ్విక్కడి నుంచి వెళ్లు అంటుంది. రిషి ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్లినట్టు అనే ఆలోచనలో పడుతుంది దేవయాని.

Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్
గౌతమ్ నాకు చెప్పకుండా వెళ్లాడనుకుంటూ రిషి కారేసుకుని బయలుదేరుతాడు. అటు రెస్టారెంట్లో వసుధార బయలుదేరుతుంటే నీకోసం ఇప్పటి వరకూ వెయిట్ చేశా అంటాడు గౌతమ్. ఇంటికే కదా వెళ్లేది..క్యాబ్ బుక్ చేస్తా అంటాడు. నేను ఆటోలో వెళతా అంటే నేను కూడా ఆటోలో వస్తా అంటూ ఆటో గొప్పతనం గురించి పొగుడుతూ ఉంటాడు గౌతమ్. జోక్ చేశా నవ్వవా అంటే.. జోక్ అనుకులేదు అంటుంది. నేను వెళతా అని వసు అంటే నేను వస్తా అంటాడు గౌతమ్...ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన రిషి నేనుకూడా వస్తా అంటాడు. 

Also Read: ప్రజా వైద్యశాల ఓపెన్ చేద్దాం డాక్టర్ బాబు అన్న దీప.. బస్తీలో అదే పని చేసిన మోనిత, కార్తీకదీపం డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
రేపటి ఎపిసోడ్ లో
మేడం మీతో ఓ మాట మాట్లాడాలి అంటుంది వసుధార.  నేను ఏం తప్పు చేశానని అడిగితే నువ్వు ఇంట్లోంచి హాస్టల్ కి వెళ్లిపో అంటుంది. ఎందుకు అని అడిగితే రిషి పంపించేయమన్నాడు అంటుంది. అయితే రిషి సర్ తో తేల్చుకుంటా అంటుంది వసుధార. ( అయితే రిషి తాను చెప్పినట్టు చెప్పొద్దన్నాడు కాబట్టి ఇది జగతి ఊహ అయిండొచ్చు) ఏం జరుగుతుందో బుధవారం ఎపిసోడ్ లో చూడాలి..

Also Read: కార్తీక్-దీప ఉన్న ఊర్లోకి మోనిత పనిమనిషి ప్రియమణి ఎంట్రీ.. కథలో మరో మలుపు.. కార్తీక దీపం డిసెంబరు 27 సోమవారం ఎపిసోడ్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 28 Dec 2021 08:33 AM (IST) Tags: గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Guppedantha Manasu New Episode Guppedantha Manasu serial Guppedantha Manasu Saturday Episode గుప్పెడంత మనసు

సంబంధిత కథనాలు

Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?

Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?

Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!

Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!

Modern Love Hyderabad: అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'మోడర్న్ లవ్ హైదరాబాద్' - ట్రైలర్ చూశారా?

Modern Love Hyderabad: అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'మోడర్న్ లవ్ హైదరాబాద్' - ట్రైలర్ చూశారా?

Sardar Movie: నాగార్జున చేతికి కార్తీ 'సర్ధార్' సినిమా - రిలీజ్ ఎప్పుడంటే?

Sardar Movie: నాగార్జున చేతికి కార్తీ 'సర్ధార్' సినిమా - రిలీజ్ ఎప్పుడంటే?

Manchu Manoj: మంచు మనోజ్ సినిమా నుంచి డైరెక్టర్ వాకౌట్!

Manchu Manoj: మంచు మనోజ్ సినిమా నుంచి డైరెక్టర్ వాకౌట్!

టాప్ స్టోరీస్

Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!

Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!

Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!

Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!

PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ

PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ

Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు

Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు