Karthika Deepam 25 December Today Episode 1232 : ప్రజా వైద్యశాల ఓపెన్ చేద్దాం డాక్టర్ బాబు అన్న దీప.. బస్తీలో అదే పని చేసిన మోనిత, కార్తీకదీపం డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ డిసెంబర్25 శనివారం 1232 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
కార్తీకదీపం డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
గడిచిన ఎపిసోడ్ లో దీప సరుకులు మోసుకురావడం చూసి బాధపడిన కార్తీక్..దీపను కూర్చోబెట్టి ఆకుతో గాలి విసురుతాడు. పిల్లలకు ఏమీ చేయలేకపోతున్నాం, రుద్రాణి అప్పు ఎలా తీరుస్తాం అంటూ బాధపడతాడు. శనివారం ఎసిపోడ్ అదే కంటిన్యూ అయింది.... అలసిపోయాను దీప..పేరు-హోదా అన్నీ పోయాయి అంటాడు. నేనుండగా మిమ్మల్ని ఓడిపోనివ్వను అంటుంది దీప. ఆస్తి మొత్తం ఇచ్చేసినా కోపం రాలేదా అంటే మీరే నా ఆస్తి డాక్టర్ బాబు.. ఆ పిలుపులోనే ఎంతో ఆనందం ఉంది తెలుసా అంటుంది దీప. ఆ తర్వాత రోడ్డుపై నడిచి వెళుతూ ఆ రోజు ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ చనిపోవడం, ఆ కుటుంబం పెట్టిన శాపనార్థాలు, ఆస్తి మొత్తం ఆ కుటుంబానికి ఇచ్చేసిన విషయాలు, డబ్బు చెల్లించకపోతే ఇద్దరి పిల్లల్లో ఒకర్న తెచ్చుకుంటా అని రుద్రాణి చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకుంటాడు. అప్పెలా తీర్చాలి, రుద్రాణి నా పిల్లలపై కన్నేసింది ...మూడు లక్షల ఇరవై వేలు ఎలా తీర్చాలని ఆలోచిస్తాడు.
Also Read: మనసుకి కళ్లెం వేయొద్దన్న మహేంద్ర.. వసుని ఇంట్లోంచి పంపించే ప్రాసెస్ మొదలెట్టిన జగతి.. గుప్పెడంత మనసు డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్
శౌర్య-హిమ
కడుపులో ఏదోలా ఉందన్న హిమతో..ఏం కాదులే ఇంటికెళ్లాక నాన్నతో చెప్పు అంటుంది శౌర్య. అమ్మ చెప్పినట్టు అన్నింటికీ అడ్జెస్ట్ అవుదాం అంటుంది శౌర్య. ఇంతలో హిమకి వాంతి అవుతుంటే వెనకనుంచి వచ్చిన కార్తీక్ ఏం కాదులే భయపడకని చెబుతాడు. ఏమైంది నాన్న హిమ ఎందుకు వాంతి చేసుకుందని అంటే.. ఏదో చిన్న సమస్య మాత్రమే అని సర్ది చెబుతాడు. పిల్లలిద్దర్నీ తీసుకుని ఇంటికి వెళుతుంటే రుద్రాణి కనిపిస్తుంది. ఏంటి సారూ పాప వాంతి చేసుకుందా..అమ్మా ఏమైంది ఈ ఊరు , ఈ గాలి కొత్త వాతావరణం పడలేదా ఆసుపత్రికి వెళదాం అంటుంది. నేను బాగానే ఉన్నా అంటుంది హిమ. దీప తెలివైన అమ్మాయి అని రుద్రాణి మాట్లాడుతుంటే.. అడ్డు తప్పుకుంటే వెళతా అంటాడు కార్తీక్. నీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందన్న రుద్రాణితో మీరు జాలి పడే పరిస్థితిలో లేనని కార్తీక్ కొట్టిపడేస్తాడు. నెల రోజుల్లో అప్పు తీరుస్తానని సంతకం పెట్టాను..గడువులోగా తీరుస్తా..ఎలా తీరుస్తానో- ఎలా సంపాదిస్తానో మీకు అనవసరం అని స్పష్టంగా చెబుతాడు కార్తీక్. చేతిలో డబ్బుల్లేకపోయినా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో అన్న రుద్రాణి...సారూ పిల్లలు జాగ్రత్త అంటుంది. ఆ ఆంటీకి-మనకు ఏంటి గొడవ అన్న పిల్లలతో.. మనకేం లేదు కోటేష్ బాబాయ్ వాళ్లు కొంత డబ్బు ఇవ్వాలని చెబుతాడు కార్తీక్.
Also Read: కార్తీక్, దీపకు మరోసారి షాక్ ఇచ్చిన రుద్రాణి, మోనిత కొడుకుని వెతికే పనిలో పడిన సౌందర్య, కార్తీకదీపం డిసెంబరు 24 శుక్రవారం ఎపిసోడ్
సౌందర్య ఇంట్లో
పిల్లల్ని తలుచుకుని సౌందర్య బాధపడుతుంటే..ఏమైంది శౌర్య-హిమ గుర్తొచ్చారా అని అడుగుతాడు ఆనందరావు. ఎప్పుడూ సంతోషంగా ఉన్నదే లేదు.. కార్తీక్ ఇంట్లోంచి వెళ్లిపోయాడు, మోనిత ఇంట్లోకి వచ్చి చేరిందని బాధపడుతుంది. దోష నివారణ పూజ చేయించడంతో మోనితకి బలం ఇచ్చింది నేనే అని చెప్పిన సౌందర్య..రత్నసీతని కలిసిన విషయం భర్తకి చెబుతుంది.
Also Read: కార్తీక్ మళ్లీ డాక్టర్ బాబుగా మారనున్నాడా, నా కొడుకూ మీ మనవడే అంటూ మోనిత రచ్చ.. కార్తీకదీపం డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్..
దీప ఇంట్లో
చుక్కల మందు వేసినప్పుడు జ్వరం రావడం సహజం.. మధ్య మధ్యలో తడి బట్టతో తుడవండని చెబుతాడు కార్తీక్. రేపు బాబుకి నామకరణం చేసుకోవచ్చా అని శ్రీవల్లి అడుగుతుంది. ఏ పేరు పెట్టాలనుకుంటున్నారని అడిగితే ఆనంద్ అని శ్రీవల్లి చెబుతుంది. ఆ పేరెందుకు అని అడిగిన దీపతో... ఏమో తెలియదు అక్కా బాబుని దత్తత తీసుకొచ్చినప్పటి నుంచీ బాబుకి ఆనంద్ అనే పేరు పెడదాం అంటున్నాడు కోటేష్ అని చెబుతుంది. అదే సమయంలో మోనిత బిడ్డకి ఆనందరావ్ అని పేరు పెట్టిన విషయం గుర్తుచేసుకుంటాడు. అంత్యాక్షరి ఆడుదాం అన్న శౌర్య మాటలు విని కార్తీక్ నవ్వుతాడు. అన్నింటినీ వదిలేసి ఇక్కడున్నాం కదా రౌడీ అంత్యాక్షరి ఆడుదాం అంటే నవ్వొచ్చింది అంటాడు.
Also Read: శౌర్య, హిమపై కన్నేసిన రుద్రాణి, కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్ బాబు, దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం డిసెంబరు 20ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
అమ్మ ...నాన్నని డాక్టర్ బాబు అని పిలిచేది కదా ఈ మధ్య కార్తీక్ బాబు అంటోందేంటని అడుగుతుంది శౌర్య...అవును అత్తమ్మ మా ఆయన్ని నేనెలా పిలిస్తే నీకెందుకు చెప్పు అని దీప అంటే... నేనిక్కడ డాక్టర్ అని ఎవ్వరికీ చెప్పొద్దన్నా కదా అందుకే అలా పిలవొద్దన్నా అంటాడు కార్తీక్. నేను పిండి వంటలు చేసి అమ్మాలనుకుంటున్నా అని దీప చెబితే..వాటిని నన్ను అమ్మమనలేదు అంటాడు కార్తీక్. డాక్టర్ బాబు అని పిలవడం మానేశాను కానీ నా మనసులో మీరెప్పుడూ డాక్టర్ బాబే అంటుంది దీప. నేను ట్యూషన్స్ చెప్పాలనుకుంటున్నా అంటాడు కార్తీక్. బ్యాడ్ ఐడియా కాదు డాక్టర్..టీచర్ అవుతారన్నమాట అంటుంది శౌర్య. నీ ప్రేమతో నన్ను ఏపనీ చేయనీయకుండా చేయొద్దు దీపా అని మాట్లాడుకుంటుంటే.. పిల్లలూ ఎలా ఉన్నారంటూ రుద్రాణి ఎంట్రీ ఇస్తుంది. కాసేపు పిల్లలతో మాట్లాడనివ్వు దీపా అన్న రుద్రాణి.. స్వీట్స్, పళ్లు, ట్యాబ్లెట్స్ తెప్పించానని అన్నీ టేబుల్ పై పెడుతుంది. శౌర్య-హిమ తీసుకోపోవడంతో... నీ పెంపకం గొప్పగా ఉంది దీపా అనేసి సంచి అక్కడే ఉంచేసి వెళ్లిపోతుంది. పొద్దున్నే వంటగదిలో ఉన్న దీప దగ్గరకు వెళ్లిన కార్తీక్..రుద్రాణి ఏంటో అర్థం కావడం లేదని..తన ఆలోచనలేంటో అంతు పట్టడం లేదంటాడు కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది...
Also Read: కార్తీక్ మళ్లీ డాక్టర్ బాబుగా మారనున్నాడా, నా కొడుకూ మీ మనవడే అంటూ మోనిత రచ్చ.. కార్తీకదీపం డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్..
Also Read : బుద్ధి చూపించిన మోనిత, బాధపడిన డాక్టర్ బాబు.. కార్తీకదీపం డిసెంబరు 23 గురువారం ఎపిసోడ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి