అన్వేషించండి

Karthika Deepam December 22 Episode: కార్తీక్ మళ్లీ డాక్టర్ బాబుగా మారనున్నాడా, నా కొడుకూ మీ మనవడే అంటూ మోనిత రచ్చ.. కార్తీకదీపం డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్..

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ డిసెంబర్22 బుధవారం 1229 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే

కార్తీకదీపం సీరియల్ డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్

గత ఎపిసోడ్‌లో దీప కార్తీక్‌కి ముద్దుగా సామీ అని పేరు పెట్టింది. కార్తీక్‌ని ఇంటికి పంపించి.. ఓ సేటు దగ్గరకు వెళ్లి మొత్తం ఒంటి మీద బంగారం అమ్మేసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఎపిసోడ్ ముగిసింది. ఈ రోజు ఎపిసోడ్...  మొనిత కొడుకుని గుర్తుచేసుకోవడంతో ప్రారంభమైంది. అమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్లిపోయారు ఆనందరావుగారు, మనిద్దర్నీ విడదీసిన వారు నాశనమైపోతారు, మీరెక్కడున్నా మీ అమ్మ  కనిపెడుతుందని అంటుంది మోనిత. అక్కడకు వచ్చిన ఆదిత్య, శ్రావ్యను చూసి కాఫీ కావాలా అని అడుగుతుంది. అనవసరమైన వరసలు కలపకుండా ఇంట్లోంచి వెళ్లిపోతే మేం సంతోషంగా ఉంటాం అంటాడు ఆదిత్య. నువ్వు సొసైటీలో డాక్టర్ వి అని క్లాసివ్వబోతుంటే మోనిత రివర్సవుతుంది. నా ఆనందరావుని ఎక్కడ దాచారో చెప్పాలని అడుగుతుంది మోనిత. నానెందుకు దాచుతా అంటే..నా కొడుకు దొరికే వరకూ ఇక్కడే ఉంటా అంటుంది. దాంతో శ్రావ్య ఆదిత్యని బలవంతంగా అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోతుంది.

Also Read: వసుధారని ఇంట్లోంచి పంపించేయాలని జగతికి షాకిచ్చిన రిషి.. గుప్పెడంత మనసు డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్
దీప ఇంట్లో: బాబు గుక్కపట్టి ఏడుస్తుంటే శౌర్య, హిమ ఆడిస్తారు. ఇంతలో అక్కడకు వచ్చిన కార్తీక్ ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తాడు. డాక్టర్ బాబు తప్ప ఎవ్వరు ఎత్తుకున్నా ఏడుస్తుంటాడు. డాడీ నువ్వెత్తుకోగానే తమ్ముడు ఏడుపు ఆపేశాడు భలే విచిత్రంగా ఉందంటారు పిల్లలు.  మొత్తానికీ ఆ బాబు తన తండ్రిని గుర్తు పట్టి ఏడుపు ఆపుతున్నాడని వాళ్లకి తెలియకపోవడమే ఆ సీన్‌ వెనుక ఉద్దేశం. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న దీప రుద్రాణి అన్నమాటలు గుర్తుచేసుకుంటుంది. బంగారు తాడు తాకట్టు పెట్టి ఇది కొనుక్కున్నానని కార్తీక్ బాబుకి తెలియకుండా జాగ్రత్త పడాలి. నాతు నా భర్త, పిల్లలే నిలువెత్తు బంగారం అనుకుంటూ ఇంటికి చేరుతుంది. 

Also Read: సామీ సాంగేసుకున్న డాక్టర్ బాబు-వంటలక్క, నెక్ట్స్ లెవెల్ కి చేరిన రుద్రాణి పంతం , కార్తీకదీపం డిసెంబరు 21 మంగళవారం ఎపిసోడ్
ఇక శ్రీవల్లి, కోటేష్... బాబుని తీసుకుని చుక్కల మందు వేయించడానికి వెళ్తుంటారు. అప్పుడే అటుగా కారులో వెళుతున్న రుద్రాణి కోటేషుని చూసి కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడటగా ఏది బాబుని నాకు చూపించవా దత్తత తీసుకున్నావట కదా అంటుంది. బాబుకి డబ్బులతో దిష్టి తీసి అటుగా వెళ్లే ఓవ్యక్తిని పిలిచి ఇచ్చేస్తుంది. కాలం కలిసొచ్చింది కదా అని దేవుడి గుడికెళ్లడం మానేస్తామా, దేవుడిని మొక్కడం మానేస్తామా.. మనం ఎంత గొప్పోళ్లమైనా దేవుడిపై భయం ఉండాలి. నీ ఇంట్లోకి ఎవరో తెలియని ఇద్దరు వచ్చి ఉండే సరికి నేనంటే భయం పోయిందా... వాళ్లని ఏం చెయ్యాలో ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఆల్ రెడీ గడువు ఇచ్చాను. అది ముగిస్తే మీ పరిస్థితి ఏంటో తలుచుకుంటే నాకే భయమేస్తోంది. ఏయ్ శ్రీవల్లీ నీ మొగుడికి చెప్పు ఈ ఊరిలో ఉండాలంటే ఈ రుద్రాణి అటే భయం ఉండాలంటూ కారు పోనీమంటుంది. 

Also Read: శౌర్య, హిమపై కన్నేసిన రుద్రాణి, కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్ బాబు, దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం డిసెంబరు 20ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ .. ఈ ఇంట్లో మనం ఉండాలా అన్న పిల్లల మాటల, అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు చెల్లించకపోతే నీ బిడ్డని తెచ్చుకుంటా అన్న రుద్రాణి మాటలు గుర్తుచేసుకుంటాడు కార్తీక్.  ఇంతలో ఓ వ్యక్తి.. డాక్టర్ బాబు అంటూ పరుగున రావడం చూసి తననే అనుకుంటాడు. ఆ వ్యక్తి వచ్చి డాక్టర్ బాబు మా ఆవిడకు మందులు మార్చి ఇవ్వండి జ్వరం తగ్గలేదు అనడంతో.. కార్తీక్ షాక్ అవుతుంటాడు. కార్తీక్ వెనక్కి తిరిగే సరికి నిజంగా ఓ ఆర్.ఎం.పి డాక్టర్ మందులు ఇస్తుంటాడు. మీరిచ్చే పది ఇరవై రూపాయలకి.. మందులు కూడా మార్చాలా’ అంటూ తిడుతూ టాబ్లెట్స్ ఇస్తాడు. అదంతా చూసి బాధపడిన కార్తీక్ ఈ ఊర్లో మంచి డాక్టరే లేడా అనుకుంటాడు.

Also Read: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
సీన్ కట్ చేస్తే సౌందర్య ఇంట్లో: అక్కా అక్కా అని తిరుగుతావు కదరా వారణాసి..దీప గురించి ఏదైనా సమాచారం తెలిస్తే చెప్పరా అని సౌందర్య దీనంగా అడుగుతుంది. వాళ్లు ఎక్కడున్నారని అడగను..వాళ్లు బావున్నారనే మాట చెప్పరా చాలు అంటుంది. బస్తీ వాసులంతా దీప గురించి వెతుకుతున్నాం అంటాడు వారణాసి. ఇంతలో అక్కడకు వచ్చిన మోనిత... ఆదర్శ అత్త అవార్డు ఇవ్వొచ్చంటూ సౌందర్యకి కౌంటర్లు వేస్తుంది. మీ కొడుకు, కోడలు, పిల్లల గురించి ఎంక్వైరీ చేస్తున్నారు..నా కొడుకుని ఎవ్వరో ఎత్తుకెళ్లారు, నా బాబు గురించి ఆలోచించరా అంటుంది. మీకు దీప పిల్లలే కాదు నా కొడుకు కూడా మీ మనవడే అంటుంది. నువ్వు తల్లివేనా కొడుకు కనిపించకపోతే నువ్వు నిజంగా తల్లివే అయితే పిల్లడి కోసం తల్లడిల్లిపోవాలి, ఇంట్లో కూర్చుని మమ్మల్ని సాధిస్తున్నావ్ కానీ కొడుకుని వెతుకుతున్నావా అంటుంది. దీప-కార్తీక్ ను కలపడానికి హిమని ఎత్తుకెళితే...నన్ను-కార్తీక్ ను విడదీయడానికి నా బిడ్డను ఎత్తుకెళ్లారేమో అంటుంది మోనిత. నోర్ముయ్ మోనిత అని సౌందర్య గట్టిగా అరవడంతో ఎపిసోడ్ ముగిసింది. 

రేపటి ఎపిసోడ్ లో
మొక్కలు నాటుతున్నారా మంచి పని చేస్తున్నారు డాక్టర్ బాబు, నేను కూడా వచ్చి నాటుతా అంటుంది. దీపను గమనించిన శ్రీవల్లి అక్కా నీ మెడలో బంగారు తాడు ఏది అని అడుగుతుంది. బంగారం అమ్మేశావా అని కార్తీక్ అడుగుతాడు .
Also Read: నట్టింట్లో పెద్ద పెంట పెట్టిన మోనిత, కడిగేసిన ఆదిత్య.. రుద్రాణిని ఎదుర్కొనేందుకు సిద్ధపడిన దీప.. కార్తీకదీపం డిసెంబరు 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: రిషిని ఆలోచనలో పడేసిన మహేంద్ర మాటలు, వసు విషయంలో రిషి తీరుపై గౌతమ్ కి బోలెడు డౌట్స్, గుప్పెడంత మనసు డిసెంబరు 21 మంగళవారం ఎపిసోడ్…
Also Read: వసు దగ్గర తగ్గలేక, నెగ్గలేక రిషి పాట్లు.. వసుధారకి క్లోజ్ అవుతున్న గౌతమ్.. గుప్పెడంత మనసు డిసెంబరు 20 సోమవారం ఎపిసోడ్
Also Read: గౌతమ్ కి కాల్ చేసిన వసుధార.. షాక్ లో రిషి.. ఎంజాయ్ చేస్తున్న మహేంద్ర..గుప్పెడంత మనసు డిసెంబరు 17 శుక్రవారం ఎపిసోడ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget