News
News
X

Karthika Deepam December 21 Episode: 'పుష్ప'లో సామీ సామీ సాంగేసుకున్న డాక్టర్ బాబు-వంటలక్క, నెక్ట్స్ లెవెల్ కి చేరిన రుద్రాణి పంతం , కార్తీకదీపం డిసెంబరు 21 మంగళవారం ఎపిసోడ్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ డిసెంబర్21 మంగళవారం 1228 ఎపిసోడ్‌కి ఎంటరైంది. డాక్టర్ బాబులో ఆవేదన, మోనితలో అంతర్మథనం రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే

FOLLOW US: 

కార్తీకదీపం సీరియల్ డిసెంబరు 21 మంగళవారం ఎపిసోడ్

గత ఎపిసోడ్‌లో మోనిత తన కొడుకుని తలుచుకుని ఎమోషనల్ అవుతుంది. మరోవైపు పిల్లలు కనిపించలేదని కార్తీక్-దీప వెతుకుతారు. ఈ రోజు ఎపిసోడ్ కార్తీక్-దీప పిల్లల్ని వెతకడంతోనే ప్రారంభమైంది.

కార్తీక్, దీప ఇద్దరూ  పిల్లల కోసం వెతుకుతారు. అదే సమయంలో రుద్రాణి ఓ అమ్మాయిని తెచ్చుకుంటాని అగ్రిమెంట్ లో రాయించా కదా అన్న మాటలు కార్తీక్ గుర్తుచేసుకుంటాడు. బయట ఇద్దరూ వెతుకుతుండగా ఓ చోట బాధగా మౌనంగా కూర్చున్న  పిల్లల్ని చూసి హమ్మయ్య అనుకుంటారు. ఇక్కడ కూర్చున్నారేంటమ్మా అని అడిగితే ..మనం నానమ్మ వాళ్ల దగ్గరకి వెళ్లిపోదాం అంటుంది శౌర్య. అవునమ్మా మనం మనింటికి వెళ్లిపోదాం అంటుంది హిమ. ఈ మాట అడగొద్దని చెప్పాకదా అని దీప రెట్టించడంతో.... ఇందాక ఓ అమ్మాయి స్కూల్‌కి వెళ్తూ వెళ్తూ ఎం అందో  తెలుసా మనకు ఏం లేకుండా ఒక బ్యాగ్ పట్టుకుని వచ్చామట. మనకి ఎవరూ లేరట, మనం నాన్నమ్మ వాళ్లింటికి వెళ్లిపోదాం అమ్మా ప్లీజ్ నాన్నా అంటారు.  మనకు అన్నీ ఉన్నాయని మనకు తెలుసు కదా ఎవరో అంటే మనకేంటీ అంటుంది దీప. కనీసం మాతో ఎవరూ ఆడుకోవట్లేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉంటోంది, మమ్మల్ని స్కూల్లో అయినా జాయిన్ చెయ్యండి ప్లీజ్ డాడీ అంటుంది హిమ. దాంతో సరే అన్నట్లుగా పిల్లల్ని గుండెలకు హత్తుకుంటారు దీప, కార్తీక్‌లు.

Also Read:  శౌర్య, హిమపై కన్నేసిన రుద్రాణి, కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్ బాబు, దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం డిసెంబరు 20ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
రుద్రాణి ఇంట్లో:  తన దగ్గరున్న రౌడీని  చెంపపై కొట్టిన రుద్రాణి... ఎవరో ఏంటో తెలియకుండా ఎలా పెంచుకుంటాంరా.. పిల్లలంటే కుక్కపిల్లలు కాదు ఒక బంధం అంటుంది. పిల్లలు పుట్టడం లేదని బావనే వదిలేసి ఒంటరిగా ఉంటున్నావ్.. ఇంకో పెళ్లిచేసుకోకుండా ఒంటరిగా ఉంటూ పోస్టర్ పై పిల్లల్ని చూసి ఎన్నాళ్లుంటావ్ ఎవరో ఒకర్ని దత్తత తీసుకోవచ్చు కదా అంటాడు రౌడీ. కార్తీక్ పిల్లలు హిమ, సౌర్యలను గుర్తు చేసుకుంటూనే..శ్రీవల్లి బిడ్డను తెచ్చుకుందన్న సమాచారం నాకు పనికొస్తుంది అంటుంది రుద్రాణి.  ఏ మాట్లాడినా ఈ అక్కకో లెక్కుంటుంది ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. చూస్తూ ఉండు అంటుంది. 

Also Read: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
కట్ చేస్తే  దీప, కార్తీక్ రోడ్డు మీద నడుస్తూ ఉంటారు. ‘పిల్లలు అలా బాధపడుతుంటే.. ఏదోలాఉంది దీపా’ అంటాడు కార్తీక్. ఏం కాదులే డాక్టర్ బాబు పిల్లలు కదా  నేను నచ్చజెబుతానులే అని మీరు ఇంటికి వెళ్లండంటుంది. ఎక్కువ దూరం నడవలేరు నేను ఏదైనా పనిచూసుకుని ఇంటికి వస్తాను అంటుంది. నువ్వు అలా అండి  అండి అనకు దీపా ఏదోలా ఉందన్న కార్తీక్ తో... మిమ్మల్ని డాక్టర్ బాబు అనడమే ఇష్టం.. కార్తీక్ బాబు అని పేరు పెట్టి పిలవలేను.. అసలు మిమ్మల్ని ఏమని పిలవాలి సామీ అంటుంది దీప. సరిగ్గా అప్పుడే రోడ్డు మీద ఓ వ్యక్తి.. పుష్ప సినిమా సాంగ్ నా సామీ సాంగ్ వింటూ వెళ్తుంటాడు. అది వినగానే వంటలక్క డ్రీమ్స్‌లోకి వెళ్తుంది. సామీ.. నా బంగారు సామీ  బాగుంది కదా పిలుపు అందరూ ఉన్నప్పుడు పిలవను లెండి అంటూ ఇంటికి వెళ్లమని పంపించేస్తుంది. ఇప్పటికే మమ్మల్ని పోషించడం లేదని ఇప్పటికే మీరు బాధపడుతున్నారు డాక్టర్ బాబు.. ఇప్పుడు నేను బంగారం తాగట్టు పెడుతుంటే చూసి తట్టుకోలేరు అందుకే పంపించేశాను అని మనసులో అనుకుంటుంది దీప. 

Also Read:  నట్టింట్లో పెద్ద పెంట పెట్టిన మోనిత, కడిగేసిన ఆదిత్య.. రుద్రాణిని ఎదుర్కొనేందుకు సిద్ధపడిన దీప.. కార్తీకదీపం డిసెంబరు 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
సౌందర్య ఇంట్లో: ఎస్పీ గారూ మా కార్తీక్ ని ఎలాగైనా వెతికిపట్టుకోండని సౌందర్య ఫోన్ మాట్లాడుతుంటే మధ్యలో లాక్కున్న ఆనందరావు..ఎంక్వరీ చేయొద్దు-ఎవరికీ చెప్పొద్దు ఏదైనా ఆధారం దొరికితే చెప్పండి అని ఫోన్ కట్ చేస్తాడు. కార్తీక్ ని మనం వెతుకుతూ వెంటాడుతుంటే ఇంకా డిస్టబ్ అవుతాడు..పోలీస్ వ్యవస్థ గట్టిగా వెతికితే దొరక్కపోడు కానీ బలవంతంగా వెతికి తీసుకొచ్చి ఏం సాధిస్తాం చెప్పు..మళ్లీ మోనిత వస్తుంది, గొడవ చేస్తుంది ..కార్తీక్ ఒక్క క్షణమైనా ప్రశాంతంగా నిద్రపోతాడా చెప్పు అంటాడు ఆనందరావు. ఎస్పీని నేను నవ్వుతూ చెప్పినా నా మనసులో కూడా బాధగా ఉందంటాడు. ఎక్కడున్నాడో సంతోషంగా ఉన్నాడో లేదో తెలియదు కానీ మోనికతు దూరంగా ఉన్నాడు..అంటే ప్రశాంతంగా ఉన్నాడు కదా ఇకపై అయినా ఆలోచించు అని సౌందర్యకి చెప్పి.. వాళ్లు అమెరికా వెళ్లారనుకో అని సర్దిచెప్పాడు. నా పెద్ద కోడలే నాధైర్యం అని చెప్పిన ఆనందరావు..మన కొడుకుని బాగా చూసుకుంటుందని చెబుతాడు.

Also Read: దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
సీన్ కట్ చేస్తే :  దీప కన్నీళ్లు పెట్టుకుంటూ , అతి కష్టంతో బంగారం తాకట్టు పెడుతుంది. సేటు చాలా అవసరంగా ఉన్నాను ఎంతోకొంత ఇవ్వండి, మళ్లీ తిరిగి తీసుకుంటా అంటుంది. ఇంతలో రుద్రాణి అక్క ఈవిడ వస్తే డబ్బు ఇవ్వొద్దని చెప్పిందని గుర్తుచేసుకుని మీకు నేను డబ్బివ్వలేనంటాడు సేటు. మీ దగ్గర డబ్బుల్లేకపోవడం ఏంటి మీ వ్యాపారమే బంగారం తాకట్టుపెట్టుకుని డబ్బులివ్వడం కదా అంటుంది. మీ కష్టం చూసుకుని పాపం అనుకుంటే నేను కష్టాల్లో పడతా కదా అంటుంది. రుద్రాణి ఇవ్వొద్దన్నారా అని అడిగి ..మీ రుద్రాణి ఫోన్ నంబర్ ఉందా అని అడిగి తీసుకుని దీప మాట్లాడుతుంది. 

Also Read: కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు షాకింగ్ ట్విస్ట్.. మోనిత బిడ్డ మాయం, రుద్రాణిని లాగిపెట్టి కొట్టిన దీప, హర్ట్ అయిన డాక్టర్ బాబు..
రుద్రాణి:  డబ్బు కనిపెట్టిన వాడికి దీనితో అభిషేకం చేయాలని అంటే అక్కా డబ్బు పాపిష్టిది అంటాడు. ఇవన్నీ కథలు నాకు చెప్పొద్దంటుంది. ఇంతలో దీప కాల్ చేసిందని ఒకడు ఫోన్ తెచ్చి ఇస్తాడు. నమస్తే రుద్రాణిగారు నేను దీపను మాట్లాడుతున్నా అంటుంది. నాకు పనివ్వొద్దు అన్నారు, బంగారం తాకట్టు పెట్టడానికి వస్తే అక్క చెబితేనే డబ్బులిస్తా అంటున్నారు. మీకు ఏం కావాలి అక్కా నేను బాధపడడమే కదా..ఒంటిమీద బంగారం, మెడలో తాళి కూడా తాకట్టు పెడుతున్నా ఇది మీకు సంతోషమే కదా..డబ్బులివ్మని చెబుతారో లేదో మీ ఇష్టం అంటుంది. తనకి డబ్బులిచ్చెయ్ అని సేటుకి చెబుతుంది రుద్రాణి. దీపా..ఏదో మాయచేసి తెలివినా నన్ను బుట్టలో పడేసి డబ్బులు తీసుకుంటున్నావని సంబర పడుతున్నావా..ఎవరిది తెలివో ముందు ముందు నీకే తెలుస్తుంది దీపా అంటుంది. పిల్లిగడ్డం వాడిని నమ్మొచ్చా..ఎందుకైనా మంచిది ఓసారి బ్యాంకుకు వెళదాం పదా అంటుంది. మరోవైపు  రోడ్డుపై ఒంటరిగా నడిచివెళుతూ రుద్రాణి మాటలు గుర్తుచేసుకుంటుంది దీప. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.

రేపటి ఎపిసోడ్ లో
మొక్కలు నాటుతున్నారా మంచి పని చేస్తున్నారు డాక్టర్ బాబు, నేను కూడా వచ్చి నాటుతా అంటుంది. దీపను గమనించిన శ్రీవల్లి అక్కా నీ మెడలో బంగారు తాడు ఏది అని అడుగుతుంది. బంగారం అమ్మేశావా అని కార్తీక్ అడుగుతాడు .

Also Read: రిషిని ఆలోచనలో పడేసిన మహేంద్ర మాటలు, వసు విషయంలో రిషి తీరుపై గౌతమ్ కి బోలెడు డౌట్స్, గుప్పెడంత మనసు డిసెంబరు 21 మంగళవారం ఎపిసోడ్…
Also Read: వసు దగ్గర తగ్గలేక, నెగ్గలేక రిషి పాట్లు.. వసుధారకి క్లోజ్ అవుతున్న గౌతమ్.. గుప్పెడంత మనసు డిసెంబరు 20 సోమవారం ఎపిసోడ్
Also Read: గౌతమ్ కి కాల్ చేసిన వసుధార.. షాక్ లో రిషి.. ఎంజాయ్ చేస్తున్న మహేంద్ర..గుప్పెడంత మనసు డిసెంబరు 17 శుక్రవారం ఎపిసోడ్
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
Also Read:  రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 21 Dec 2021 09:34 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Rudrani karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ Karthika Deepam new Episode 21 December Episode Karthika Deepam December 21 Episode

సంబంధిత కథనాలు

Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ గుడ్ న్యూస్, ఆ సినిమాకు మరో సీక్వెల్ - రిలీజ్ డేట్ ఇదే

Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ గుడ్ న్యూస్, ఆ సినిమాకు మరో సీక్వెల్ - రిలీజ్ డేట్ ఇదే

Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?

Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?

Dj Tillu 2: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?

Dj Tillu 2: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?

NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్ నీల్

NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్‌తో - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Naga Chaitanya: అక్కడ రొమాన్స్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డా, షాకింగ్ విషయం చెప్పిన నాగ చైతన్య

Naga Chaitanya: అక్కడ రొమాన్స్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డా, షాకింగ్ విషయం చెప్పిన నాగ చైతన్య

టాప్ స్టోరీస్

CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన

CM Jagan :  ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన

ఖాతాదారులకు ఎస్బీఐ షాకింగ్ న్యూస్, నేటి నుంచి ఈఎంఐల బాదుడు!

ఖాతాదారులకు ఎస్బీఐ షాకింగ్ న్యూస్, నేటి నుంచి ఈఎంఐల బాదుడు!

Pawan Kalyan: పదవులపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు, 2009లోనే ఎంపీ అయ్యేవాడినన్న జనసేనాని

Pawan Kalyan: పదవులపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు, 2009లోనే ఎంపీ అయ్యేవాడినన్న జనసేనాని

Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి

Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు మృతి