Karthika Deepam December 16 Episode: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

ఆ బిడ్డకు తండ్రిని నేను కాదు అని అన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్
కార్తీక దీపం సీరియల్ ఈ రోజు (గురువారం) ఎపిసోడ్ లో మోనిత హారతి తీసుకొచ్చి ఆంటీ, అంకుల్, ఆదిత్య అంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఎవ్వరూ స్పందించకుండా మోనితను సీరియస్ గా చూస్తుంటారు. పాట ప్రాక్టీస్ లేక శ్రుతి తప్పింది రేపటి నుంచి పూర్తిగా పాడతాను అంటూ  ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం.. కార్తీక్ దీప మరి నేనెక్కడున్నాను..అందుకే రేపటి నుంచి మార్చి పాడుతా ..ఆరనీకుమా ఈ దీపం కార్తీక్ మోనిత దీపం అని చెలరేగిపోతుంది. ప్రియమణీ ఆంటీగారు, మావయ్యగారు, ఆదిత్య, శ్రావ్య వచ్చారు నాలుగు కాఫీ తీసుకురా అని చెబుతుంది. వెరీ గుడ్ ప్రియమణి నీ టైమింగ్ నాకు నచ్చుతుంది ఇలా చెప్పానో లేదో అలా వచ్చేశావ్ అంటుంది. మావయ్యగారు మీకు పెద్దవారు మొదట తీసుకోండని అనడంతో సౌందర్య కాఫీ విసిరికొడుతుంది. ఎవరే నువ్వు అని సౌందర్య క్వశ్చన్ చేస్తుంటే ఇంకా మాటలేంటి మెడపట్టుకుని బయటకు గెంటేయకుండా అని మండిపడతాడు. అసలేం అనుకుంటున్నావ్? నీకేం కావాలి.. కార్తీక్ ఎక్కడున్నాడో తెలీక మేం బాధపడుతుంటే.. నీకు ఇది మర్యాదగా ఉందా అంటాడు ఆనందరావు. దానికి మర్యాద గురించి చెప్పడం అంటే క్రూరజంతువలకు అహింస గురించి బోధించినట్టే ఉందంటుంది సౌందర్య.
ఇక్కడి నుంచి వెళ్లిపో అన్న సౌందర్యతో కోడలినా నాకు అర్హత ఉందన్న మోనిత...బుల్లి ఆనందరావుని మీ ఇంటి వారసుడు అనిపించేలా చేస్తా అంటుంది. ఈ ఇంటి వారసత్వం, ఆస్తి బుల్లి ఆనందరావుకి వస్తుంది..వాడు మీ మనవడే, నేను మీ కోడిలినే అంటుంది మోనిత. ఏంటి ప్రియమణి అలా చూస్తున్నావ్ అత్తగారు అత్తగారే కాఫీ క్లీన్ చేయి అని చెబుతుంది. ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోతారు. 
Also Read:  దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
ఇంటికొచ్చి  రుద్రాణి సామ్రాజ్యం అని ఆమె చేసిన హంగామాను తలుచుకుని కార్తీక్ బాధపడతాడు.  నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందని దీప అంటూ గతంలో మాట్లాడిన మాటలను కార్తీక్ తలుచుకుంటాడు. కార్తీక్ బాబు కాఫీ చల్లారిపోతోంది తాగండి ఏంటి అలా చూస్తున్నారు తాగండి కార్తీక్ బాబు అని దీప అంటుంది. రాత్రి జరిగిన విషయాన్ని మరిచిపోండి ఆ రుద్రాణి గురించి తలుచుకుంటూ బాధపడకండి. మిమ్మల్ని, పిల్లల్ని నేను చూసుకుంటాను కార్లు, బంగ్లాలు ఇవ్వలేనేమో గుట్టుగా సంసారాన్ని నడపగలను. ఏవో కష్టాలు వచ్చాయని అనుకోకండి.. అని దీప అంటే.. ఇంకా ఏం కష్టాలు వస్తాయ్ అని కార్తీక్ అంటాడు. ఇప్పుడేం జరిగింది డాక్టర్ బాబు నుంచి కార్తీక్ బాబు అంటున్నాను. పిలుపు మారినా ప్రేమ ఉంది కాఫీని కప్పులో ఇచ్చేదాన్ని ఇప్పుడు గ్లాసులో ఇస్తున్నాను కానీ టేస్ట్ మారలేదు. ఇంట్లో సోఫాల్లో కూర్చునేవాళ్లం కానీ ఇప్పుడు ఇలా దగ్గరదగ్గర కూర్చుంటాం. ఇంకా ఎక్కువ ప్రేమగా ఉంటున్నాం. జరిగిందేదో జరిగింది. జరగబోయేదాని గురించి ఆలోచిద్దాం. పదకొండేళ్లు విడిపోయాం దగ్గరగా ఉండాలని ఇలా చేశాడేమో అని దీప అంటుంది. నీ ధైర్యమేంటి దీప అని కార్తీక్ అంటే మీరే నా ధైర్యం ఇంత కంటే పెద్ద ధైర్యం ఏముంటుంది అని అంటుంది. నాకు ముగ్గురు పిల్లలు మిమ్మల్ని అపురూపంగా చూసుకుంటాను అని దీప లోలోపల అనుకుంటుంది. నేను స్కూల్‌కి వెళ్తాను. మీరు పిల్లల్ని స్కూల్‌కు తీసుకురండని చెప్పి దీప వెళ్లిపోతుంది. వంటలక్క కాఫీ బాగుందని కార్తీక్ అంటే దీప నవ్వేసి వెళ్లిపోతుంది.
Also Read: కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు షాకింగ్ ట్విస్ట్.. మోనిత బిడ్డ మాయం, రుద్రాణిని లాగిపెట్టి కొట్టిన దీప, హర్ట్ అయిన డాక్టర్ బాబు..
ఒరేయ్ అబ్బులు ఊర్లో సంగతులేంటి  చెప్పరా అని రుద్రాణి అడుగుతుంది.  మీ సొమ్మేదో పోయినట్టు అలా చూస్తారేంట్రా.. ఊర్లో మన గురించి ఏమని అనుకుంటున్నారు.. అని రుద్రాణి అడుగుతుంది. ఇదేం బాగా లేదక్క.. ఒరేయ్ చెప్పరా శ్రీవల్లి వాళ్లింట్లోకి వచ్చినవాళ్లు అని అబ్బులు అంటే కోపంతో ఊగిపోతోంది రుద్రాణి. అది వాళ్ల ఇళ్లు కాదు మనది. ఇప్పుడు చెప్పరా అంటుంది.  వాడు మమ్మల్ని కొట్టాడు వాడు కొట్టి వాడి పెళ్లాం కొట్టి ఊర్లో మన పరిస్థితి ఏంటి మన మాట ఎవరైనా వింటారా అంటాడు అబ్బులు. ఒక్కోసారి అందరి మీద పెత్తనం చెలాయించలేం జింక ముందుగా పరిగెత్తినా పులే గెలుస్తుంది గెలుస్తాననన్న ధైర్యం పులిది ఓడిపోతోన్నానన్న భయం జింకది టైం చూసి కొట్టాలి. మరీ పిచ్చుకల మీద పులి వేటాడదు.. ఎక్కడి నుంచో బతకడానికి వచ్చారు తోక జాడిస్తే అప్పుడు చూద్దాం అంటుంది రుద్రాణి.
Also Read: కార్తీక్ ఆచూకీ కోసం ఫస్ట్ స్టెప్ వేసిన మోనిత.. డాక్టర్ బాబుకి క్లాస్ పీకిన దీప.. ‘కార్తీకదీపం’ డిసెంబర్ 13 ఎపిసోడ్
మరోవైపు మోనిత నట్టింట్లో కూర్చుని శోకాలు మొదలెట్టింది. ఆనంద్ రావు కాళ్ల మీద పడిన మోనిత మామయ్య గారు మీరు ఈ ఇంటి పెద్ద మీరంటే నాకు గౌరవం కార్తీక్ మీ అబ్బాయి కాబట్టి.. అందరూ ఆ వైపు నుంచే ఆలోచిస్తున్నారు. నన్ను విలన్‌ని చేస్తున్నారని అంటుంది. ఏంటమ్మా నీ గోల అని ఆనంద్ రావు విసుక్కుంటాడు. కార్తీక్ నా దగ్గరకు వచ్చాడు ప్రేమ, పెళ్లి అన్నాడు, బాబును కన్నాను. మీ మీద ప్రేమతో పేరు పెట్టాను కార్తీక్ ఎక్కడికి వెళ్లాడో తెలీదు నా బాబును ఎవరో ఎత్తుకెళ్లారు నేనేం చేయగలను. కార్తీక్ వస్తాడు బాబు దొరుకుతాడు ఈ ఇంట్లో ఉండేందుకు మీరు నాకు సాయం చేయండి. పెళ్లి కాకపోయినా తల్లిని అయ్యాను. అయినా గ్రాము ప్రేమ కూడా తగ్గలేదు మామయ్య గారు నా మొహం చూడండి కార్తీక్ కోసం ఎన్ని కష్టాలు పడ్డాను ఈ ఇంట్లో చీపురు, వంటసామాగ్రి, స్టోరూంలో సామాన్లలా పడి ఉంటాను ఇంత చోటివ్వండి ఇంత కన్నా నాకు ఏ కోరిక లేదని నాటకం మొదలెట్టింది. చాటునుంచి ఇదంతా విన్న ప్రియమణి.. 
మోనితమ్మ గారు మీరు మామూలు నటి కాదు నట శిరోమణి అంటుంది. ఇలా నట్టింట్లో ఏడ్వకు అని మోనితపై ఆనంద్ రావు విసుక్కుంటాడు. నా బిడ్డ కనిపించడం లేదని కంప్లైంట్ ఇద్దామంటే తండ్రి ఎవరని అడుగుతారు తండ్రి ఎక్కడ అని అంటారు మళ్ళీ మన ఫ్యామిలీకే చెడ్డ పేరు వస్తుంది మావయ్య గారు. మీ కాళ్లకు దండం పెడతాను మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటాను అని మోనిత అంటుంటే..ఆనందరావు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మిమ్మల్ని మచ్చిక చేసుకుంటే ఈ ఇంట్లో కోడలిగా నా స్థానం పదిలం అవుతుందని అనుకున్నా నా కొడుకు ఎక్కడున్నాడో ఏమో అంటుంది మోనిత. 
Also Read: తనలో డాక్టర్ బాబుని కంట్రోల్ చేసుకున్న కార్తీక్.. ఇదేంటని ప్రశ్నించిన దీప.. మరింత ఎమోషనల్ గా మారిన కార్తీక దీపం సీరియల్
ఇక పనికోసం స్కూల్ కి వెళ్లిన దీపతో పని వేరేవాళ్లకి ఇచ్చాం అంటుంది.  జీతం కొంచెం తగ్గించి ఇచ్చినా పర్లేదని దీప ప్రాధేయపడుతుంది. ఎవ్వరికి ఇచ్చినా కూడా పర్లేదు నీకు మాత్రం ఇవ్వొద్దని రుద్రాణి అన్నారని చెబుతారు. సారీ దీప నేను నీకు మాటిచ్చాను కానీ రుద్రాణిని ఎదురించలేనని దీనంగా చెబుతుంది.  థ్యాంక్స్ అండి మీ వంతు మీరు సాయం చేద్దామని అనుకున్నారు మీరు బాగుండాలని దీప చెబుతుంది. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. 

రేపటి ఎపిసోడ్ లో
రేపటి (శుక్రవారం) ఎపిసోడ్‌లో బిడ్డతో ఇంటికి చేరిన  శ్రీవల్లికి దిష్టితీసి లోపలకు తీసుకెళుతుంది దీప.  కోటేష్ మోనిత నుంచి ఎత్తుకొచ్చిన బిడ్డను దీప ఎత్తుకుంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డలా లేడే పుట్టి చాలా రోజులు అవుతుందని డాక్టర్ బాబు అనుమానం వ్యక్తం చేస్తాడు. నాక్కూడా అదే అనిపిస్తోంది డాక్టర్ బాబు అన్న దీప... ఈ బిడ్డ ఎవరిది? అని కోటేష్‌ను అడుగుతుంది. మరేం జరుగుతుందో చూడాలి...
Also Read: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..
Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్
Also Read: రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
Also Read: 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 16 Dec 2021 09:17 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Rudrani karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ Karthika Deepam new Episode 16th December Episode

సంబంధిత కథనాలు

Balakrishna: బాలయ్యకు కోవిడ్ నెగెటివ్ - నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్ షురూ 

Balakrishna: బాలయ్యకు కోవిడ్ నెగెటివ్ - నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్ షురూ 

NTR: ఎన్టీఆర్ అభిమాని ఆరోగ్య పరిస్థితి విషమం.. ఫోన్ చేసి మాట్లాడిన హీరో!

NTR: ఎన్టీఆర్ అభిమాని ఆరోగ్య పరిస్థితి విషమం.. ఫోన్ చేసి మాట్లాడిన హీరో!

Pranitha On Udaipur Murder: ఆ అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయ్ - ఉదయ్‌పుర్‌ ఘటనపై ప్రణీత స్పందన

Pranitha On Udaipur Murder: ఆ అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయ్ - ఉదయ్‌పుర్‌ ఘటనపై ప్రణీత స్పందన

Khushbu Sundar: మీనా భర్త మృతిపై తప్పుడు ప్రచారం - నటి ఖుష్బూ ఫైర్!

Khushbu Sundar: మీనా భర్త మృతిపై తప్పుడు ప్రచారం - నటి ఖుష్బూ ఫైర్!

Aamir Khan: అసోం ప్రజల కోసం విరాళం ప్రకటించిన అమీర్ ఖాన్, ఆ మంచి మనసును మెచ్చుకోవాల్సిందే

Aamir Khan: అసోం ప్రజల కోసం విరాళం ప్రకటించిన అమీర్ ఖాన్, ఆ మంచి మనసును మెచ్చుకోవాల్సిందే

టాప్ స్టోరీస్

TS SSC Results 2022: ఇవాళే తెలంగాణ పదోతరగతి ఫలితాలు - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

TS SSC Results 2022: ఇవాళే తెలంగాణ పదోతరగతి ఫలితాలు - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

Maharashtra Political Crisis: సుప్రీం కోర్టు తీర్పుతో మారిన మహారాష్ట్ర పొలిటికల్ సీన్- కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌!

Maharashtra Political Crisis: సుప్రీం కోర్టు తీర్పుతో మారిన మహారాష్ట్ర పొలిటికల్ సీన్- కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌!

Relief For Amaravati Employees : మరో రెండు నెలలు ఉచిత వసతి - అమరావతి ఉద్యోగులకు సర్కార్ చివరి నిమిషంలో రిలీఫ్ !

Relief For Amaravati Employees  : మరో రెండు నెలలు ఉచిత వసతి - అమరావతి ఉద్యోగులకు సర్కార్ చివరి నిమిషంలో రిలీఫ్ !

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?