Guppedantha Manasu Serial Today Episode: రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…
గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ( శనివారం) ఎపిసోడ్ మొత్తం దేవయాని రివెంజ్ చూట్టూ తిరిగిందనే చెప్పుకోవాలి. ప్లాన్ చేసి రెస్టారెంట్ కి వెళ్లిన దేవయాని.. జగతి, వసుని రెచ్చగొట్టడంలో సక్సెస్ అయినట్టే ఉంది.
![Guppedantha Manasu Serial Today Episode: రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే… Guppedantha Manasu Serial Today Episode, Rishi-Vasudhara Love Track Very Interesting And Devayani Questions Vasu And Jagathi In Rishi Matter, Know In Details Guppedantha Manasu Serial Today Episode: రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/11/7cf0869bf71021b17fa3efc2d326272d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జగతి ఇంటికి వచ్చి దేవయాని గొడవ పెట్టుకుంటంది. వనభోజనాలకు వెళ్లిన వారు ఇంటికి రాకుండా అర్దరాత్రుళ్లు తిరగడం ఏంటో నువ్వైనా నీ శిష్యురాలికి చెప్పొచ్చు కదా అని దేవయాని అంటే ఒకరు చెబితే వినేంత చిన్నదాన్ని కాదు ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసు మీకు డౌట్ ఉంటే వెళ్లి రిషి సర్‌ని అడగొచ్చు అని వసు కౌంటర్ వేస్తుంది. మాటకు మాట చెబుతుంది జగతి ...ఇదే దూకుడు తగ్గించుకో అని దేవయాని అంటుంది. చేయాలో మీరు నాకు చెప్పాల్సిన పని లేదు. నేను ఏం చేయాలో ఎక్కడెక్కడికి వెళ్లాలో చెప్పాల్సింది మీరు కాదంటుంది వసు. వాళ్లు అరిచారని మనం అరిస్తే వాళ్లకు మనకు తేడా ఉండదని జగతి అంటుంది. ఒకరు అరుస్తూ చెబితే అదే భాషలో మనం కూడా సమాధానం ఇవ్వాలి మేడం.. మీలా మృదువుగా చెబితే అర్థం కాదు అంటుంది వసుధార. ఇదే నా చివరి హెచ్చరిక..నేనేం చేయగలనో నీకు తెలుసు, పద్దతి మార్చుకోకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని దేవయాని హెచ్చరిస్తుంది. మీరు వీధిలోకి వచ్చి అరిచినంత మాత్రాన మేం సమాధానం చెప్పాల్సిన పనిలేదని జగతి అంటుంది. మీ ఇద్దరికి ఈ దేవయాని అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని అంటుంది. మీ బెదిరింపులకు భయపడే అవసరం లేదు, తప్పు చేయలేదు, సమాధానం చెప్పాల్సిన పని లేదంటూ వసు ఆన్సరిస్తుంది.
Also Read: తనలో డాక్టర్ బాబుని కంట్రోల్ చేసుకున్న కార్తీక్.. ఇదేంటని ప్రశ్నించిన దీప.. మరింత ఎమోషనల్ గా మారిన కార్తీక దీపం సీరియల్
ఇక రిషికి దేవయాని ఫోన్ చేయగా..లంచ్ టైంలో మాట్లాడుతా అని కట్ చేస్తాడు. రిషి నాతో సరిగ్గా మాట్లాడటం లేదు, అబద్దం చెబుతున్నాడు, రిషి చెప్పే ప్రతి అబద్ధం నన్ను రిషికి దూరం చేస్తోంది. జగతికి దగ్గర చేస్తోంది. పోనీలే అనుకుంటుంటే.. నువ్ నీ శిష్యపరిమాణువు ఎక్కువ చేస్తున్నారు.. మీ ఆటలు ఎలా సాగుతాయో నేనూ చూస్తానంటూ దేవయాని ప్లాన్ వేస్తుంది. ఇక తప్పుచేస్తే ఒప్పుకుంటాను కానీ తప్పు లేకపోతే ఎవ్వరూ ఏమన్నా పడనంటుంది వసుధార. తప్పొప్పులు పక్కనపెడితే సమయం సందర్భం కూడా చూసుకోవాలంటుంది జగతి. ఈ విషయాన్ని రిషి గ్గర ప్రస్థావించకు అని అనడంతో చెప్పకపోతే రిషి సర్ కి ఎలా తెలుస్తుందని వసు అంటుంది. చెప్పకపోతే మనమే దోషుల్లా ఉంటాం.. దాని కంటే నిజం చెప్పడమే కరెక్ట్ అంటుంది వసు. నువ్ ఆవేశంలో మాట్లాడుతున్నావ్ నువ్ చెప్పిందాంట్లో నిజం ఉంది.. నేను అనే దాంట్లో ఆలోచన ఉంది.. రిషి దృష్టిలో దేవయాని ఓ దేవత. రిషి చెప్పినా నమ్మడు, డిస్టర్బ్ అవుతాడంటూ జగతి చెబుతుంది. మీరెన్ని చెప్పినా కూడా నా మనసు మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదంటున్న సమయంలో రిషి ఎంట్రీ ఇస్తాడు.
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
ఏంటి లేటు అని రిషి అడుగుతున్న ప్రశ్నకు వసు సమాధానం చెప్పబోతుంటే జగతి చేయి పట్టుకుని ఆపుతుంది. నా ముందు వసుని ఇలా కంట్రోల్ చేస్తోందంటే నేను లేని సమయంలో ఇంకెలా చేస్తుందో అని జగతి గురించి తప్పుగా ఆలోచిస్తాడు రిషి. టైం అవుతోంది క్లాసుకు వెళ్తావా అని వసుని పంపించే ప్రయత్నం చేస్తుంది. నేను చిన్నప్పుడు కొన్ని బొమ్మలతో ఆడుకునేవాడిని.. అవి కీ ఇస్తే కదిలేవి..మనుషులు కూడా అలానే తయారవుతున్నారంటూ రిషి తనలో తాను అనుకుంటాడు. కాలేజ్ అయ్యాక కలువు నీతో మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. చూశారా మేడం కాలేజీ అయ్యాక క్లాస్ ఇస్తాడేమో మేడం అని వసు అంటుంది. మీరు ఆవిడకు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదంటుంది వసుధార. తాను భయపడడం లేదని బాధ్యత తెలుసుకుని సైలెంట్ గా ఉన్నానంటుంది జగతి. రిషి దృష్టిలో దేవయాని దేవత..ఆవిడ గురించి ఏం చెప్పినా వినడు అందుకే సైలెంట్ గా ఉండమంటున్నా అంటుందిజగతి. కాలేజ్‌లో ఈ డిస్కషన్స్ వద్దు అని చెప్పి జగతి వెళ్లిపోతుంది. డం ఏంటో ఒక్కోసారి అర్థం కాదు. ఇలా ఓపిక పడితే.. ఎక్కువ కష్టాలు వస్తాయి.. ధైర్యంగా ముందుకు వెళ్తే.. తాడో పేడో తేలుతుంది కదా?. అని వసు అనుకుంటుంది.
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
సీన్ కట్ చేస్తే రెస్టారెంట్‌లో జగతి, వసు ఉంటారు. జగతి రెస్టారెంట్లో కూర్చుని దేవయాని అన్న మాటలు తలుచుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన వసుధారని చూసి... నువ్ ఇలానే సీరియస్‌గా సర్వ్ చేస్తే కస్టమర్లు ఫీలవుతారు కదా?.. మన వ్యక్తిగత అభిప్రాయాలు వృత్తి మీద చూపించొద్దు.. అని వసుకు జగతి సలహా ఇస్తుంది. రిషి నిన్ను కాలేజ్ అయ్యాక కలవమన్నాడు కదా? కలవలేదా? కలవకపోతే .. రిషికి కోపం వస్తుంది కదా? అని జగతి అంటుంది. కోపం వస్తుందనే వెళ్లలేదు. నాకు కోపం వచ్చిందని వెళ్లలేదు.. రిషి సర్‌కి ఎదురుచెబితే.. మళ్లీ మీరు బాధపడతారని వెళ్లలేదు అని వసు చెబుతుంది. వసు ఇంత దూరం ఆలోచించావ్ కదా?.. ఆ కోపాన్ని దూరం పెట్టలేవా? అని జగతి అడుగుతుంది. నా కోపంలో న్యాయం ఉంది. న్యాయంగా కూడా కోప్పడకపోతే.. అన్యాయం కదా మేడం అని వసు అంటుంది. బాగా చెప్పావ్.. మన అనుకునే విషయంలో ఒక మెట్టు తగ్గితే ఏమవుతుందని జగతి అంటే.. రిషి సర్ విషయంలో అలా అనుకోవచ్చు కానీ దేవయాని మేడం విషయంలో కాదంటుంది వసు. కలవడం వీలు కాదని మెసెజ్ పెట్టాను అని చెబుతుంది వసు. దేవయాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేస్తున్నావేమో అని జగతి అనే సరికి రెస్టారెంట్లో అడుగుపెడతుంది దేవయాని.
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ప్లాన్ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్న దేవయాని రిషి రాగానే నాకు మెసెజ్ చేయ్ అని ఒకడిని పురామాయిస్తుంది. అక్కడ సీన్ కట్ చేస్తే ఇంట్లోకి హడావుడిగా వచ్చిన మహేంద్ర ఏంటి ధరణి రమ్మన్నావ్ అంటూ మహేంద్ర కంగారుగా అడుగుతాడు. మీకొక విషయం చెప్పాలి.. అత్తయ్య గారు బయటకు వెళ్లారు అని ధరణి అంటుంది. వెళ్తే వెళ్లారు మనకేంటంటాడు మహేంద్ర. అయ్యో మామయ్య గారు జగతి అత్తయ్యను కలవడానికి వెళ్లారు. ఈటైంలో జగతి అత్తయ్య, వసులు ఎక్కడున్నారో తెలుసుకుని వెళ్లారని ధరణి చెబుతుంది. జగతి చూసుకుంటుందిలే వాళ్ల విషయంలో మనం జోక్యం చేసుకుంటే సమస్య పెద్దది అవుతుందని మహేంద్ర అంటాడు. ఈ మాటలన్నీ కూడా రిషి వింటాడు. పెద్దమ్మ.. వాళ్ల గురించి ఎందుకు ఎంక్వైరీ చేసిందంటూ ఆలోచిస్తూ రెస్టారెంట్‌కు బయల్దేరుతాడు. నన్ను క్షమించు నాన్న.. నీకు నచ్చని వాళ్ల దగ్గరికి నేను వెళ్తున్నాను అది కూడా నీ కోసమే అంటూ ఓ వాయిస్ మెసెజ్ పెడుతుంది రిషికి. ఇక రిషి కారు సౌండ్ వినడంతో మన మాటలు విన్నాడంటావా? అని ధరణితో మహేంద్ర అంటాడు. అటు నుంచి అటే ఎందుకు వెళ్తున్నాడంటూ ధరణి కంగారు పడుతుందది. ఇప్పుడే వస్తానమ్మ అంటూ మహేంద్ర కూడా బయల్దేరుతాడు.
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
రెస్టారెంట్‌కు వస్తే ఏంటి అలా భయపడుతున్నారు అని దేవయాని అంటుంది. వస్తే ఏంటంటా భయం కాఫీ తాగడానికి వచ్చానని దేవయాని అంటుంది. అక్క ఇంత సేపు ఇలా ఇక్కడ ఉందంటే కచ్చితంగా ఏదో ఒక ఆలోచన ఉండాలి అని జగతి అనుకుంటుంది. ఈ మధ్య బాగా మాట్లాడుతున్నావే.. ఎదురు సమాధానాలు చెబుతున్నావ్ అని వసుని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.
సమాధానాలు చెప్పకపోతే ఈ సమాజంలో బతకలేం అంటుంది వసు. అచ్చం నీలానే మాట్లాడుతోందని దేవయాని అంటుంది. మా మేడంతో పోల్చకండి అని వసు ఎదురు సమాధానం చెబుతుంది. నువ్ మీ మేడంలా కాదులే నువ్ అంతకు మించి అని అంటుంది దేవయాని. రెండు కాపీలు తీసుకురా వసు అని జగతి అంటే మూడు తీసుకుని రా నువ్ కూడా తాగు అని వసుని దేవయాని అంటుది. నాతో కాఫీ తాగేందుకు కూడా భయపడుతున్నావా? అని వసుని ఇంకా రెచ్చగొడుతుంది దేవయాని. నాకెందుకు భయం అని వసు అంటే ఇప్పుడు జగతి శిష్యురాలిలా కనిపిస్తున్నావ్ అని దేవయాని అంటుంది. నాకు కావాల్సిన వాళ్లు వచ్చారు. శ్రేయోభిలాషులు వచ్చారు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా నాని అని వసు ఆర్డర్ చెబుతుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: డాక్టర్ బాబుని అవమానించిన పిల్లలు… రుద్రాణి వలలో దీప చిక్కుకుంటుందా, కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్
సోమవారం ఎపిసోడ్
ఇక సోమవారం ఎపిసోడ్‌లో దేవయాని వేసిన ప్లాన్‌కు వసు బలైపోయేలా ఉంది. ఎదిగిన కొడుకు మీదకు అమ్మాయిని ఉసిగొల్పుతావా? అని దేవయాని రెచ్చగొడుతుంది. దీంతో వసు రెచ్చిపోతుంది. ఇంతలో రిషి వస్తాడు. అది గమనించిన దేవయాని కిందపడిపోయినట్టు అది కూడా వసు తోసేసినట్టు నటిస్తుంది. దీంతో వసు మీద రిషి ఫైర్ అవుతాడు.మరి ఏం జరుగుతుందో చూడాలి...
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)