News
News
X

karthika Deepam Serial Today Episode: డాక్టర్ బాబుని అవమానించిన పిల్లలు… రుద్రాణి వలలో దీప చిక్కుకుంటుందా, కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్

కార్తీక దీపం ఈ రోజు (శుక్రవారం) ఎపిసోడ్ లో రుద్రాణి అనే కొత్త పాత్ర ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు దీప చెల్లెలు శ్రావ్య అత్తమామల్ని నిలదీయడంతో ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభమైంది.

FOLLOW US: 

పనులు ఎక్కువ చేసి ప్రశ్నలు తక్కువ అడిగే వారికి సీక్రెట్ మార్కులు వేస్తారంటూ దీప పిల్లలతో చెబుతుంది. మరోవైపు  సౌందర్య, ఆనంద్ రావులు కొడుకును తలుచుకుని బాధపడుతుంటారు. ఇంతలో శ్రావ్య వచ్చి తిరగబడుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్తే పరువు తిరిగి వస్తుందా? ఆస్తి కూడా దానం చేసేశారట అది అడిగే హక్కు ఎలాగూ లేదు, పరువులు పోయి, ఆస్తులు పోయి ఇంకా ఏం సాధించాలని అంటూ శ్రావ్య బయటపడుతుంది. మీ అమ్మ నీకు ఎలా ప్రవర్తించాలో నేర్పించలేదా అని అడిగిన అత్తగారు సౌందర్యతో అవును..నా బతుకు, దీపు గాడి బతుకు ఏమవుతుందా అని మాట్లాడుతున్నాను అంటుంది. బావగారు వెళ్లినంత మాత్రాన మోనిత ఇంటికి రాకుండా ఉందా? ఇంట్లోంచి వెళ్లడం వల్ల ఎవరు సుఖంగా ఉన్నారు.. బావగారు అలా చేసి ఉండాల్సింది కాదు.. ఇదే సమయంలో మోనిత అదును చూసుకుని ఇక్కడే ఉంటానని అంటే..ఆమె కొడుకు కూడా ఈ ఇంటికి వారసుడే కదా? అని శ్రావ్య అంటుంది. ఆ మాటతో సౌందర్య శ్రావ్య అని గట్టింగా అరుస్తుంది. మీకు కోపం వచ్చినా నిజం అదే కదా? వెళ్లిపోయి బావగారు ఏం సాధించారు అంటుంది. 
Also Read:  1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
వేరే ఉరికి వెళ్లిన డాక్టర్ బాబు, దీప ఖాళీగా ఉన్న ఓ ఇంటి తలుపులు తీశారు. లోపలంతా దుమ్ము పట్టిపోయి ఉంది. లోపలకు అడుగుపెట్టడంతోనే పిల్లలు ఏంటి ఇలాఉందంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు.  ఛీ ఛీ ఈ ఇంట్లో మనం ఉండాలా?.. మనకు అంత పెద్దిళ్లు ఉండి కూడా.. ఇలాంటి ఇంట్లో మనం ఎందుకు ఉండాలి అంటూ పిల్లలు ప్రశ్నిస్తారు. కోప్పడిన దీప ఏమీ అడగొద్దని చెప్పాను కదా అంటుంది. ప్రశ్నలు అడగొద్దని అంటే అయిపోయిందా?.. డాడీ అబద్దాలు చెప్పడం మానేశారని అనుకున్నాను. ఏం చెప్పడం లేదు.. డాడీ వేస్ట్ అంటుంది హిమ.  దీంతో దీపకు కోపం వస్తుంది. హిమ అంటూ కొట్టబోతుంటే డాక్టర్ బాబు అడ్డుకుని హిమ నిజమే చెప్పింది. నేను వేస్టే  వేస్ట్ ఫెల్లోనే అని కార్తీక్ బాధపడుతుంటాడు. తనేదో నోరు జారింది. చిన్నపిల్ల అని దీప అంటుంది. చిన్నపిల్లైనా కరెక్ట్ గానే చెప్పింది, నేను ఒక పనికి మాలినవాడిని ఏదో ఒక అబద్దం చెప్పేవాడిని ఇప్పుడు అబద్దాలు చెప్పడానికి కూడా అవకాశం లేదని  కార్తీక్ బాధపడుతుంటాడు. మీరు తప్పు చేయలేదు న్యాయమే చేశారు అని దీప సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. న్యాయం అని నువ్ అంటున్నావ్.. పాపం చేశానని నా మనసు అంటోంది.. అంటూ కార్తీక్ కుమిలిపోతాడు.
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
అదే సమయంలో పిల్లపై మండిపడుతుంది దీప. ఏం పిల్లలే మీరు.. అసలు ఇళ్లే లేని వాళ్లు.. రోడ్డు పక్కన ఉన్నవాళ్ల సంగతి ఎప్పుడైనా ఆలోచించారా?.. మీ నాన్న చాలా మంచివాడు.. మీ లాంటి వయసు పిల్లలకు కొందరికి.. అమ్ముంటే నాన్న ఉండరు.. నాన్నుంటే అమ్మ ఉండరంటూ క్లాస్ పీకుతుంది.  నాన్నకు మీరంటే ప్రాణం నాన్నను అలా అనొచ్చా? చిన్న పిల్లలురా మీరు.. చెప్పింది అర్థం చేసుకోండి.. వయసుకు మించి ఆలోచనలు చేయకండి.. ప్రశ్నలు వేయకండి.. మీకు జ్వరం వస్తే.. ఆయన భోజనం మానేస్తారు తెలుసా? అలాంటిది మీరు అలా అనొచ్చా అంటుంది. స్పందించిన సౌర్య... నాన్న హిమ తెలీక ఏదో అందిలే తన తరుపున నేను సారీ చెబుతున్నా, నువ్వంటే మాకు ఇష్టం నాన్న, నువ్వుంటే మాకు ధైర్యం నాన్న అంటుంది. హిమ కూడా సారీ అమ్మ ఇంకెప్పుడు డాడీని ఏమీ అనను.. డాడీకి నేను అంటే ఎంతిష్టమో నాకు తెలుసు.. మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను.. మీరిద్దరు కలిసి ఉంటే.. మీతో మేముంటే అంతే చాలు మాకు అంటారు. 
Also Read: నెలకు రెండుసార్లు మంటతో స్నానం చేసే అమ్మవారు..
మరోవైపు ఏంటి ఆదిత్య అంత చిరగ్గా ఉన్నావ్ అని రూంలోకి వచ్చిన ఆదిత్యను చూసి శ్రావ్య ప్రశ్నిస్తుంది. చిరాగ్గ అనే పదం చాలా చిన్నది.. అంతా సెట్ అయిందని అనుకునే లోపు ఇలా చేశాడు అన్నయ్య.  వెళ్లిపోయాడని చెబితే ఎవరితో అని బయట అంటున్నారు. సభ్యత సంస్కారం మరిచిపోయారు, అన్నయ్య గురించి అడిగితే మోనిత టాపిక్ తీస్తూనే ఉన్నారని ఆదిత్య బాధపడతాడు.
జరిగిన దాంట్లో మన తప్పు లేకపోయినా కొన్ని సార్లు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని శ్రావ్య సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇలా ఎందుకు చేశాడు చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడం ఏంటి? ఏం తింటున్నారు.. ఎక్కడున్నారో అర్థం కావడం లేదు.. మోనిత ఇంకా రెచ్చిపోయేలా ఉందని ఆదిత్య భయపడతాడు. రెచ్చిపోవడం ఏంటి? రేపు బిడ్డను తీసుకొచ్చి ఇక్కడే ఉంటానని అంటే మనం ఏం చేస్తాం ఆదిత్య..అని శ్రావ్య అంటుంది.
Also Read: కర్మ అంటే ఏంటి.. పదే పదే ఈ మాట అనొచ్చా.. పురాణాలు ఏం చెబుతున్నాయి...
ఇంకోవైపు  కొత్త పాత్ర రుద్రాణి ఎంట్రీ ఇచ్చింది.  అక్కా కూరగాయల ద్వారా 60 వేలు, వడ్డీలు, చక్రవడ్డీలు 80 వేలు.. ఆదాయం వచ్చిందని రుద్రాణికి చెబుతాడు. అన్నీ చక్కగా చేస్తున్నావా? చదువుకున్నావ్ అని పనిలో పెట్టుకున్నా.. జాతర్లో ఎంత వసులైందని  రుద్రాణి అడుగుతుంది.. అక్కా అక్కా.. అని పనోడు పిలుస్తాడు. లెక్క చెప్పమంటే అక్కా అంటావ్ ఏంట్రా.. కళ్లు తెరువు అక్క.. అని దీపను చూపిస్తాడు.  నమస్తే అండి ఈ ఊరికి కొత్తగా వచ్చాం మీ ఇంట్లో ఉండొచ్చా? అని దీప అడుగుతుంది. నా గురించి ఈ ఊర్లో ఎవ్వరూ చెప్పలేదా?.. అని రుద్రాణి అంటుంది. తలో రకంగా ఏదో చెప్పారు.. చెప్పినవన్నీ నిజాలు కావాల్సిన అవసరం లేదు కదా? అని దీప అంటుంది.. వాళ్లు చెప్పినవన్నీ నిజాలే.. కానీ నువ్ అన్న మాట నాకు నచ్చింది.. అని రుద్రాణి ఇంప్రెస్ అవుతుంది.
అద్దె ఎంతివ్వమంటారు అని దీప అడుగుతుంది. ఈ రుద్రాణికి అద్దె ఇస్తావా? బతకడానికి వచ్చాను అన్నావ్.. అద్దె ఇస్తావా?.. పిల్లలున్నారని అన్నావ్.. అయినా ఈ రుద్రాణి ఇస్తే తీసుకోదు. నచ్చినప్పుడు లాక్కుంటుంది. లెక్కలు తరువాత చూసుకుందాం  అంటుంది. ఐదు కేజీల బియ్యం,  కూరగాయల సంచి ఇవ్వండిరా అని అంటే.. దీప మాత్రం వాటిని వద్దని చెబుతుంది. ఇంట్లో ఉండమన్నారు అదే చాలు సంతోషం.. వెళ్లొస్తానండి అని వెళ్తుంది దీప
Also Read: చేయి నాకి నాకి తింటున్నారా.. మీకు ఆ వ్యామోహం చాలా ఎక్కువట..
ఏంటక్కా.. అద్దె లేకుండా ఇల్లు ఇవ్వడం ఏంటి? అని పనోళ్లు ఆశ్చర్యపోతారు?.. పోనీయ్ లేరా? పాపం.. అని రుద్రాణి అంటే.. నువ్ పాపం అంటున్నావా? అని ఇంకా ఆశ్చర్యపోతారు. ఆమె పద్దతి, మాట్లాడే విధానం నచ్చింది. శ్రీవల్లి అప్పు తీరే వరకు ఆ ఇళ్లు శుభ్రంగా ఉంచాలి.. నా లెక్కలేవో నాకు ఉన్నాయి.. ఈత గింజను ఇచ్చి తాటి గింజను లాక్కుంటాను.. కోడిని ఇచ్చి మేకను లాక్కుంటాను.. వడ్లి గింజను ఇచ్చి వరి పొలం లాక్కుంటాను అంటుంది. ఇక ఇంట్లో కూర్చుని కొడుకుని తలుచుకుని సౌందర్య కుమిలిపోతుంది. ఈ మమ్మీని వదిలి వెళ్తావా? మేం ఎక్కడికి వెళ్తాం బస్తీకే కదా? అంటూ కార్తీక్ గతంలో చెప్పిన మాటలు..మీరు బాగా మాటలు నేర్చుకున్నారే అంటూ పిల్లలతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ సౌందర్య కంటతడి పెడుతుంది. 
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 10 Dec 2021 08:48 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Rudrani karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ Karthika Deepam new Episode 10th December Episode

సంబంధిత కథనాలు

ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ -  ఇందులో నిజమెంతా?

ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ - ఇందులో నిజమెంతా?

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

Oscars 2023: 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ - రాజమౌళి సినిమాకు అవార్డు గ్యారెంటీ అంటున్న మరో టాప్ సైట్!

Oscars 2023: 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ - రాజమౌళి సినిమాకు అవార్డు గ్యారెంటీ అంటున్న మరో టాప్ సైట్!

అనసూయను చూస్తే తన క్రష్ గుర్తొచ్చిందన్న దర్శకేంద్రుడు - విష్ణు ప్రియకు రెండు పెళ్లిలట!

అనసూయను చూస్తే తన క్రష్ గుర్తొచ్చిందన్న దర్శకేంద్రుడు - విష్ణు ప్రియకు రెండు పెళ్లిలట!

Anasuya: ఇండస్ట్రీలో ఆడవాళ్లు మాట్లాడకూడదు, గిల్లితే గిల్లించుకోవాలి - అనసూయ కామెంట్స్!

Anasuya: ఇండస్ట్రీలో ఆడవాళ్లు మాట్లాడకూడదు, గిల్లితే గిల్లించుకోవాలి - అనసూయ కామెంట్స్!

టాప్ స్టోరీస్

KTR : ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

KTR :  ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Anantapur Crime News :  బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

TS Congress  : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!