Karthika Deepam December 15 Episode: దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...

ఓవైపు మోనిత బిడ్డ మాయం..మరోవైపు రుద్రాణిపై తిరగబడిన దీప..చూస్తుంటే మొత్తానికి సీరియల్ సరికొత్త మలుపు తిరిగేట్టే ఉంది. డిసెంబరు 15 కార్తీకదీపం ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇఫ్పుడు చూద్దాం...

FOLLOW US: 

(డిసెంబరు 15 కార్తీకదీపం ఎపిసోడ్ ముందుగానే మీకోసం)

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు( బుధవారం) ఎపిసోడ్ లో కార్తీక్ అని అరుచుకుంటూ ఏకంగా స్కూటీతో సౌందర్య ఇంట్లోకి మోనిత ఎంట్రీ ఇచ్చింది. నా బిడ్డను ఎత్తుకెళ్లారంటూ మోనిత నానా రచ్చ చేసింది.  నా బిడ్డను ఆదిత్య ఎత్తుకెళ్లాడంటూ మోనిత నానా హంగామా చేసింది.  కిడ్నాప్‌లు, ఎత్తుకెళ్లడం వంటివి నీకు తెలిసిన విద్యలు ఆదిత్య ఎందుకు ఎత్తుకెళ్తాడంటూ సౌందర్య, ఆనంద్ రావు అంటాడు. నా బిడ్డను నేను ఎందుకు ఎత్తుకెళ్తాను అని మోనిత అంటుంది. ఎందుకిలా మమ్మల్ని టార్చర్ పెడతావ్ వెళ్లిపో అమ్మ నీకు మాకు సంబంధం లేదని  ఆనంద్ రావు అంటాడు. అలా అంటారేంటి మామయ్య గారు మిమ్మల్ని ఆది దంపతుల్లా చూస్తాను. నేను మీకు దేవుడిచ్చిన కోడల్ని అంటుంది మోనిత. నా బిడ్డను ఎత్తుకెళ్తే మోనిత ఏడుస్తూ కూర్చుకుంటుందని అనుకుంటున్నారా... మోనిత ఏడ్చే రోజులు పోయాయ్, ఏడిపించే రోజులు వచ్చాయ్ నా కొడుకు దొరికే వరకు ఇక్కడే ఉంటాను..నా కొడుకు దొరికే వరకూ ఈ మోనిత అత్తామామలో సేవలో తరిస్తుంది ఇక్కడే ఉంటుంది. ఆడదానికి పెళ్లయ్యాక అత్తిల్లే దిక్కుకదా ఆంటీ అని బండిని బయటకు తీసుకెళుతూ దీపక్క లేదని మీరు టెన్షన్ పడకండి వంటా వార్పూ నేను చూసుకుంటా అంటుంది మోనిత.

Also Read: కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు షాకింగ్ ట్విస్ట్.. మోనిత బిడ్డ మాయం, రుద్రాణిని లాగిపెట్టి కొట్టిన దీప, హర్ట్ అయిన డాక్టర్ బాబు..
మళ్లీపురిట్లోనే బిడ్డను కోల్పోయానని శ్రీవల్లి ఏడుస్తుంది. అయ్యో దేవుడా? నాకు మళ్లీ ఇలా ఎందుకు చేశావ్ అని శ్రీవల్లి బాధపడుతుంటే కోటేష్ ఓ బిడ్డను తీసుకొస్తాడు. ఆబిడ్డ ఎవరో కాదు మోనిత బిడ్డే. ఎలా ఎత్తుకొచ్చాడో బ్యాంగ్రౌండ్లో చూపిస్తారు.  శ్రీవల్లి నీ బాధను ఎలా తీర్చాలి అని కోటేష్ బాధపడుతూ రోడ్డు మీద వెళ్తుంటే కారులో బిడ్డ కనిపిస్తాడు, దేవుడా ఏంటిది పరీక్ష పెడుతున్నావా? దారి చూపుతున్నావా? తప్పు చేశానో, ఒప్పు చేశానో నా శ్రీవల్లి మాత్రం సంతోషంగా ఉందని కోటేష్ అనుకుంటాడు. కానీ ఆ బిడ్డను ఎత్తుకొచ్చినట్టు చెప్పడు. ఎవరో వదిలేసి వెళ్లిపోయారన్నట్టుగా చెబుతాడు. 

Also Read: కార్తీక్ ఆచూకీ కోసం ఫస్ట్ స్టెప్ వేసిన మోనిత.. డాక్టర్ బాబుకి క్లాస్ పీకిన దీప.. ‘కార్తీకదీపం’ డిసెంబర్ 13 ఎపిసోడ్
మరోవైపు కార్తీక్, దీప, పిల్లలంతా కూడా భోజనానికి కూర్చుంటారు. ఏం ఆలోచిస్తున్నారు కార్తీక్ బాబు అని దీప అంటే ఏమీ లేదని సమాధానం చెబుతాడు. ఏం స్పెషల్ చేశావ్ అమ్మా అని శౌర్య అంటే.. ఆకలితో భోజనం దగ్గర కూర్చుంటే  ఏదైనా స్పెషల్‌గా ఉంటుందంటుంది దీప. ఇలా కింద కూర్చుని తింటుంటే బాగుందమ్మా అని హిమ అంటుంది. ఇలా తింటుంటే ఆనందమే వేరు ఏమంటారు కార్తీక్ బాబు అని దీప అంటుంది. అవును దీప అంటాడు కార్తీక. ఇక ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన రుద్రాణి ఇలా వచ్చారేంటి? కబురు చేస్తే నేనే వచ్చేదాన్ని కదా అంటుంది దీప. వచ్చేలా చేశావ్ మరి నేనేం చేయను అంటూ రుద్రాణి ఇల్లంతూ చూస్తుంది.  టైం బాగా లేక వచ్చాను అన్నావ్ వంట సామాగ్రి అవీ ఇవీ చాలానే ఉన్నాయ్ అవన్నీ నీవేనా అని అడుగుతుంది రుద్రాణి.  బయట వాళ్ల వస్తువులున్నాయ్ అని నేనే తీసుకొచ్చాను అంటాడు కార్తీక్ .ఎవరివి అని రుద్రాణి అడుగుతుంది. శ్రీవల్లి వాళ్లవి అని దీప సమాధానం చెబుతుంది. ఆ మాట నాకు చెప్పాలి కదా? అని రుద్రాణి అంటుంది. ఇది రుద్రాణి సామ్రాజ్యం అని తెలీదా అని అంటుంది. నేనే వచ్చి చెబుదామని అనుకున్నానని దీప అనే లోపు నోర్మూయ్ అని అన్నాన్ని కాలితో తంతుంది. కోపంతో అంతెత్తున లేచిన కార్తీక్ చిన్న పిల్లలు అన్నం తింటున్నారని కూడా చూడరా అని ప్రశ్నిస్తాడు. నా మాట వినక పోతే అంతే గిన్నెలైనా, మనుషులైనా అంతే ఇది రుద్రాణి సామ్రాజ్యం అంటూ కార్తీక్‌ను నెట్టేస్తుంది రుద్రాణి. కార్తీక్ ను నెట్టేయడంతో  ఏయ్ అంటూ చాచి కొట్టింది దీప. మర్యాద.. మర్యాద నేర్చుకోండి ఏం మాట్లాడుతున్నారు మీలాంటి వాళ్లు వంద మంది ఆయనకు చేతులెక్కి మొక్కుతారు తెలుసా? నన్ను ఏమైనా అన్నా కూడా భరిస్తాను కానీ మిమ్మల్నిఎవరైనా తక్కువ మాట్లాడితే మాత్రం ఊరుకోను అని దీప కార్తీక్ తో చెబుతుంది. అంత గొప్ప వాళ్లు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారో అని రుద్రాణి అంటుంది. అది నీకు అనవసరం అని దీప బదులిస్తుంది.

Also Read: తనలో డాక్టర్ బాబుని కంట్రోల్ చేసుకున్న కార్తీక్.. ఇదేంటని ప్రశ్నించిన దీప.. మరింత ఎమోషనల్ గా మారిన కార్తీక దీపం సీరియల్
 బియ్యం ఇస్తాను అని అన్నా కూడా నువ్ తీసుకోలేదు. అప్పుడే డౌట్ వచ్చిందని రుద్రాణి అంటుంది. రెండు లక్షలకు కోటేష్ నా దగ్గర ఈ ఇంటిని తాకట్టు పెట్టాడు. ఇంత వరకు కట్టలేదు అందుకే సామాన్లు బయటకు విసిరేశాను.  విసిరేసినవి మీరు తెచ్చారు. తప్పు చేశారు.. నన్ను ఎదురించి మొదటి తప్పు.. కొట్టి పెద్ద తప్పు చేశావ్ అని రుద్రాణి అంటుంది. మా వారిని ఇంకో మాట అంటే మళ్లీ కొడతా అని దీప రెచ్చిపోతోంది. ఇన్ని ఏళ్లలో నా ముందు మాట్లాడిన వాళ్లే లేరు ఉండనివ్వను అయ్యో పాపం కోటేశు, అయ్యో పాపం శ్రీవల్లి అని బాగానే జాలి పడుతున్నారు కదా? అని రుద్రాణి అంటుంది. జాలి పడితే తప్పేంటంట అని దీప అంటుంది. అంత జాలి ఉంటే కోటేశ్ తీసుకున్న అప్పు, వడ్డి కలిపి 3.20 లక్షలు కట్టి జాలి గుండెను నిరూపించుకోండి. ఏంటి మాట్లాడరేంటి?. లక్షలు అనేసరికి జాలి గుండె జారిపోయిందా ఇంటి బయట నా వాళ్లున్నారు ఒక్క మాట చెబితే మిమ్మల్ని లోకాన్ని దాటించడం కష్టమేం కాదంటుంది దీప. ఏంటి భయపెడుతున్నారా? అని దీప అంటుంది. ఈ ఇంటికి అద్దె ఇద్దామని అనుకున్నాను. అసలు ఈ ఇల్లే మీది కాదు ఇస్తే కోటేష్‌కే అద్దె ఇస్తాను అని దీప అంటుంది. నా అంచనాలకు మించే ఉన్నావ్. ఎవరికి ఏ వాయినం ఇవ్వాలో ఎవరికెలా బుద్ది చెప్పాలో నాకు బాగా తెలుసు. పిల్లలు వెళ్లొస్తానమ్మ ఈసారి వచ్చినప్పుడు చాక్లెట్లు తీసుకొస్తాను అని రుద్రాణి వెళ్లిపోతుంది. 

Also Read: రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…
మోనిత ఉదయాన్నే లేచి కార్తీకదీపం పాట పాడుతూ పూజలు చేస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. శుభోదయం అత్తయ్య గారు మామయ్య గారు అని చెబుతుంది మోనిత. పూజ చేస్తూ గుడ్ మార్నింగ్ అని చెబితే బాగుండదు అని తెలుగులో చెప్పాను హారతి తీసుకోండంటూ మోనిత అంటుంది. కానీ వారు మాత్రం మొహం తిప్పేసుకుంటారు. ఏంటి పాట బాగుందా ప్రాక్టీస్ లేక కాస్త శ్రుతి తప్పింది. ఒకప్పుడు పాటలు బాగా పాడేదాన్ని అని మోనిత అంటుంది. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగిసింది.

రేపటి ఎపిసోడ్ లో
రేపటి (గురువారం) ఎపిసోడ్‌లో కోటేష్ ఎత్తుకొచ్చిన బిడ్డను దీప ఎత్తుకుంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డలా లేడే పుట్టి చాలా రోజులు అవుతుందని డాక్టర్ బాబు అనుమానం వ్యక్తం చేస్తాడు. ఈ బిడ్డ ఎవరిది? అని కోటేష్‌ను దీప అడుగుతుంది. మరేం జరుగుతుందో చూడాలి...

Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
Also Read: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 15 Dec 2021 09:17 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Rudrani karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ Karthika Deepam new Episode 14th December Episode

సంబంధిత కథనాలు

Pavithra Lokesh: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు - పవిత్రా లోకేష్ ఎమోషనల్ కామెంట్స్

Pavithra Lokesh: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు - పవిత్రా లోకేష్ ఎమోషనల్ కామెంట్స్

The warriorr Trailer: రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్

The warriorr Trailer: రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్

Anushka: ప్రభాస్ సినిమాలో అనుష్క - నిజమేనా?

Anushka: ప్రభాస్ సినిమాలో అనుష్క - నిజమేనా?

Bimbisara: 'ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు' - 'బింబిసార' ట్రైలర్ గ్లింప్స్

Bimbisara: 'ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు' - 'బింబిసార' ట్రైలర్ గ్లింప్స్

Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్

Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్

టాప్ స్టోరీస్

Gold Rate Today 2nd July 2022: పసిడి ప్రియులకు బిగ్ షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, దిగొచ్చిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 2nd July 2022: పసిడి ప్రియులకు బిగ్ షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, దిగొచ్చిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Defence Ministry: ఆర్మీ, నేవీలో అగ్నిపథ్ నియామకాలు ప్రారంభం, ఎయిర్ పోర్స్ లో 2.72 లక్షల దరఖాస్తులు

Defence Ministry:  ఆర్మీ, నేవీలో అగ్నిపథ్ నియామకాలు ప్రారంభం, ఎయిర్ పోర్స్ లో 2.72 లక్షల దరఖాస్తులు

Horoscope 2nd July 2022: ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు, జులై 2 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 2nd July  2022: ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు, జులై 2 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

BJP PLenary Plan On TRS : తెలంగాణలో కాషాయజెండా పాతడమే లక్ష్యం ! బీజేపీ అత్యున్నత భేటీ వెనుక అసలు వ్యూహం ఇదే

BJP PLenary Plan On TRS :  తెలంగాణలో కాషాయజెండా పాతడమే లక్ష్యం ! బీజేపీ అత్యున్నత భేటీ వెనుక అసలు వ్యూహం ఇదే