Guppedantha Manasu Serial December 14th Episode: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..
గుప్పెడంత మనసు ఈ రోజు( మంగళవారం) ఎపిసోడ్ లో గౌతమ్ పాత్ర ఎంట్రీ ఇచ్చింది. ఈ క్యారెక్టర్ ఎంట్రీతో రిషి-వసుధార మధ్య దూరం పెరుగుతుందా. కథ కొత్త మలుపుతిరుగుతుందా. డిసెంబరు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
![Guppedantha Manasu Serial December 14th Episode: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్.. Guppedantha Manasu Serial Today December 14th Episode, Shirish Out Gautam Entry, Ego Master Rishi Thinking About Vasudhaara , Know In Details Guppedantha Manasu Serial December 14th Episode: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/14/47359ee879e9d277e6ad4d1064fb8a78_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వసు ఇంకా ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన జగతి ఎక్కడున్నావ్ అంటూ ఫోన్ చేసి అడుగుతుంది. ఆటో కోసం ఎదురుచూస్తున్నాను వస్తున్నాను మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో ఓ పెద్దాయన్ను కారు గుద్దేసి వెళ్లిపోతోంది. బాబాయ్ బాబాయ్ అంటూ అతడిని కాపాడే ప్రయత్నంలో అటుగా వచ్చే కార్లను ఆపుతుంది. ఓ కారు ఆగుతుంది. అందులో గౌతమ్ అనే కొత్త క్యారెక్టర్ కథలో అడుగపెట్టాడు. వసు టెన్షన్ చూసి యాక్సిడెంట్ అయిన వ్యక్తిని వసు బాబాయ్ అనే ఆలోచనతో కారులో ఎక్కించుకుంది ఆసుపత్రికి తీసుకెళతాడు. మరోవైపు రిషి.. రెస్టారెంట్లో వసుధార మాటల్ని తలుచుకుంటాడు. చేసిందంతా చేసి కనీసం సారీ కూడా చెప్పలేదనుకుంటాడు. అక్కడే ఉన్న ధరణి నేను అత్తయ్య గారి దగ్గర ఉంటాను నువ్వెళ్లి పడుకో అని చెబుతుంది. ఏదైనా అవసరం ఉంటే చెప్పండి వదినా అన్న రిషితో నేను చెబుతాను రిషి నువ్వెళ్లు అని ధరణి అంటుంది. ఏంటి వదినా వాళ్లు అలా బిహేవ్ చేస్తే ఎలా, పెద్దా- చిన్నా తేడా లేకుండా అలా చేస్తే ఎలా అదృష్టవశాత్తు ఎలాంటి ఫ్రాక్ఛర్ కాలేదు, పెద్దమ్మను మనం జాగ్రత్తగా చూసుకుందాం అంటాడు. నేను చూసుకుంటాను రిషి నువ్వు కంగారుపడకు అన్న ధరణి... ఏం జరిగిందో తెలియదు కానీ అత్తయ్య గారు ఎక్కువే చేస్తున్నారని ధరణి మనసులో అనుకుంటుంది. ఈ పొగరు కనీసం సారీ కూడా చెప్పలేదని మనసులో అనుకుని అక్కడినుంచి వెళ్లిపోతాడు రిషి.
Also Read: కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు షాకింగ్ ట్విస్ట్.. మోనిత బిడ్డ మాయం, రుద్రాణిని లాగిపెట్టి కొట్టిన దీప, హర్ట్ అయిన డాక్టర్ బాబు..
ఇక గౌతమ్-వసు కలసి ఆ పెద్దాయన్ను ఆసుపత్రిలో చేర్పిస్తారు. డీటేల్స్ రాసి సంతకం పెట్టండని అంటే ఆయన ఎవరో నాకు తెలీదు ఆమె బాబాయ్ అని గౌతమ్ అంటాడు. నాక్కూడా ఆయన ఎవరో తెలీదు అనడంతో గౌతమ్ ఆశ్చర్యపోతాడు. తెలియన మనిషి కోసం ఇంత ఆరాటపడిందా అని గౌతమ్ కి వసుపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. గౌతమ్ తన పేరు చెప్పుకుని పరిచయం చేసుకుంచాడు. వసు మాత్రం తన గురించి ఏమీ చెప్పదు. షేక్ హ్యాండ్ ఇస్తున్నా కూడా నమస్కారం పెడుతుంది. ఆయన ఎవరో మీకు తెలీదా? వావ్ మీరు నిజంగా గ్రేట్ సాటి మనిషి కోసం ఇంత చేస్తున్నారంటే అని గౌతమ్ పొగిడేస్తుంటాడు. సాటి మనుషులం కదా? ఈమాత్రం చేయకపోతే ఎలా అంటుంది వసు. మీలాంటి వాళ్లు నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది నా పేరు గౌతమ్ అని వసు గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. పేషెంట్ సేఫ్ అని తెలిశాక వెళ్తే అదో ఆనందం కదా అని వసు అంటే..నేనూ అందుకే ఉన్నా అంటాడు గౌతమ్. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని గౌతమ్ అంటే వద్దని వెళ్లిపోతుంది వసు. అలా వెళ్తూ ఒక్క చిరు నవ్వు నవ్వి బాయ్ చెబుతుంది.
Also Read: కార్తీక్ ఆచూకీ కోసం ఫస్ట్ స్టెప్ వేసిన మోనిత.. డాక్టర్ బాబుకి క్లాస్ పీకిన దీప.. ‘కార్తీకదీపం’ డిసెంబర్ 13 ఎపిసోడ్
నా పేరు చెప్పినప్పుడు తన పేరు కూడా చెప్పొచ్చు కదా. నవ్వా అది పూల సునామీ వచ్చిపడ్డట్టుంది. వెన్నెల వర్షం కురిసినట్టు అందం, హెల్పింగ్ నేచర్, ఆ భాష, ఆ మాటతీరు, కల్చర్ అసలు తను మనిషేనా దేవకన్యలా ఉంది అంతే అనుకుంటాడు గౌతమ్. ఇక ఇంటికి చేరుకున్న వసు రిషి ఆలోచనల్లో మునిగి తేలుతుంది. కోపం తగ్గాక మెసెజ్ ఫోన్ చేస్తారని అనుకున్నాను కానీ జరిగిందాంట్లో నా తప్పేమీ లేదు. దేవయాని మేడం ఎందుకంత నటించింది రిషి సర్ అన్నింట్లో తెలివిగానే ఉంటారు కానీ పెద్దమ్మ విషయంలో మాత్రం ఇలా ఆలోచిస్తుంటారు అని వసు అనుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన జగతితో రిషి సర్ ఇప్పటి వరకు కాల్ కూడా చేయలేదంటుంది వసు. నాకు మహేంద్ర ఫోన్ చేశాడు ఇప్పుడు బాగానే ఉందంట అని జగతి చెబుతుంది.
ఎందుకంత రాద్దాతం చేయాలి.. ఎందుకంత సీన్ చేయాలి.. అని వసు ప్రశ్నిస్తుంది. అందరూ నీలా ఉండరు కదా. ధరణి కూడా అలానే ఉంది. రిషి కోసం ఓపిగ్గా ఉండాలి అని జగతి అంటుంది. తప్పు మన వైపు లేకపోయినా కూడా ఎందుకు అలా ఉండాలి మేడం. మన మౌనం దేవయాని మేడంకు తెలిస్తే ఇంకా ఎక్కువ చేస్తారు. దేవయాని గురించి నిజం చెప్పేందుకు ఇది మంచి సమయం, రిషి సర్‌కు నిజం తెలిపిన వాళ్లం అవుతాం.. ఏంటి మేడం అలా చూస్తున్నారని వసు అంటుంది
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
మంచివాళ్లు అని నిరూపించడం ఈజీనే కానీ మంచివారిగా నటించే వారి నిజ స్వరూపాలను అంత ఈజీగా బయటపెట్టలేం అని జగతి అంటుంది. నాకు ఆంక్షలు పెట్టకండి రిషి సర్‌కు ఎలా చెప్పాలో నాకు తెలుసు మేడం సారీ.. ఈ విషయంలో నాకేం చెప్పకండి. రిషి సర్ ఫోన్, మెసెజ్ చేస్తారని ఎదురుచూస్తున్నాను అంటుంది వసు. గుడ్ నైట్ అని జగతి చెప్పి వెళ్లబోతోంటే గుడ్ నైట్ కాదు రిషి సర్ వల్ల బ్యాడ్ నైట్ అని చెప్పి పడుకుంటుంది వసు. వసు చూడక ముందు ఆమె ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేస్తుంది జగతి. వసు మొండితనం నాకు తెలుసు ఫోన్ చేసినా చేస్తుంది ఇద్దరూ డిస్టర్బ్ అవుతారు సారీ వసుధార ఫోన్ స్విచ్చాప్ చేస్తున్నాను అని పక్కన పడేస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది...
రేపటి ఎపిసోడ్ లో
ఇక రేపటి( బుధవారం) ఎపిసోడ్‌లో రిషి క్లోజ్ ఫ్రెండ్ గౌతమ్ అని తెలుస్తుంది. ఓ అమ్మాయిని చూశాను. ఆమెను వెతికి పెట్టాల్సింది నువ్వేనని రిషిపైనే గౌతమ్ భారం వేస్తాడు. ఆ అమ్మాయి నీకే అని రాసి పెట్టి ఉంటే కలుస్తుందిలే అని రిషి అంటాడు. ఇక రోడ్డు మీద వసుని చూసిన గౌతమ్ కారు ఆపమంటాడు. గౌతమ్ వెంట రిషి కూడా ఉంటాడు. గౌతమ్ చెప్పింది వసు గురించేనా అని రిషి కంగారుపడతాడు.
Also Read: డాక్టర్ బాబుని అవమానించిన పిల్లలు… రుద్రాణి వలలో దీప చిక్కుకుంటుందా, కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్
Also Read: తనలో డాక్టర్ బాబుని కంట్రోల్ చేసుకున్న కార్తీక్.. ఇదేంటని ప్రశ్నించిన దీప.. మరింత ఎమోషనల్ గా మారిన కార్తీక దీపం సీరియల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)