News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Guppedantha Manasu Serial December 15th Episode: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్

'గుప్పెడంత మనసు' సీరియల్ డిసెంబరు 15 ఎపిసోడ్ లో గౌతమ్ , రిషి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలుస్తుంది. ప్రేమలో పడ్డా అని చెప్పిన గౌతమ్ ..రిషి సాయం అడుగుతాడు. ఈ లెక్కన మళ్లీ రిషి-వసుధార మధ్య దూరం పెరుగుతుందా

FOLLOW US: 
Share:

గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబరు 15 బుధవారం ఎపిసోడ్


గుప్పెడంతమనసు డిసెంబరు 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే... పెద్దమ్మకు ఎలా ఉందని ఫోన్ కూడా చేయడం లేదు, సారీ సర్ అని ఒక్క మెసేజ్ కూడా లేదు,  కనీస మర్యాద లేదు పైగా ఉపన్యాసాలిస్తుందని వసుధారని ఉద్దేశించి రిషి అనకుంటాడు. అయినా వసు ఫోన్ చేస్తుందని నేను ఎందుకు వెయిట్ చేయడం నేను ఫోన్ చేసి క్లాస్ పీకుతా అని డయల్ చేస్తాడు. స్విచ్చాఫ్ రావడంతో తెలివిగా ముందే స్విచ్చాఫ్ చేసి పెట్టుకుందనుకుంటాడు. తెల్లారాక  కాలేజ్‌లో పుష్ప, వసు నడుచుకుంటూ వెళ్తారు. సెమిస్టర్ హాలీడేస్ ఇట్టే గడిచిపోయాయ్ కదా ,  మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. ఏమైంది వసుధారా ఏం మాట్లాడడం లేదని పుష్ప అడగడంతో నువ్వు మాట్లాడుతున్నావు కదా అని సమాధానం చెబుతుంది. ఎదురుగా రిషి కనిపిస్తే ఇద్దరూ గుడ్ మార్నింగ్ అని చెబుతారు. ఓసారి క్యాబిన్ కి రా మాట్లాడాలని వెళ్లిపోతాడు.  సర్ కోపంగా ఉన్నట్టున్నాడు కదా అని పుష్ప అంటే.. ఆయన గారు కోపంగా ఎప్పుడు లేరు చెప్పు అని వసు కౌంటర్ వేస్తుంది. ఆ మాటలు రిషి వింటాడు. వచ్చేటప్పుడు జగతి మేడంను కూడా తీసుకురా అని చెబుతాడు. 

Also Read: రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…

ఇక గౌతమ్ ఫుల్ స్పీడులో బైక్ పై కాలేజ్‌కు వస్తాడు. నమస్తే డీబీఎస్టీ కాలేజ్ కాలేజ్ సూపర్ అంటూ అక్కడి పువ్వులను  కోయాలనుకుంటాడు. ప్యూన్ వచ్చి అడ్డుకోవడంతో మీ ఎండీ గారి కాబిన్ ఎక్కడుందని అడుగుతాడు. మీరు కాలేజ్‌లో జాయిన్ అవుతున్నారా,  క్లాసులు చెబుతారా అని ఫ్యూన్ అడుగడంతో మీ ఎండీ జాబ్ ఇస్తే  చేస్తానంటాడు. రిషి సర్ మీతో  ఫ్రెండ్లీగా? కోపంగా? ఎలా ఉంటాడని అడిగితే చాలా బాగుంటారని చెబుతాడు ప్యూన్.  కట్ చేస్తే  వసు.. రిషి సర్ రమ్మన్నాక వెళ్లకపోతే బాగుండదు కదా అంటుంది జగతి. ఇప్పుడెల్లి మాటలు పడాల్సిన అవసరం లేదు. తిట్టడానికి ఆయన సిద్దపడి పిలిచినప్పుడు గొడవపడటానికి మనం సిద్దంగా ఉంటే తప్పేంటని వసు బదులిస్తుంది. నేను కూడా వస్తాను అని జగతి అంటే నువ్ వెళ్తే ఇంకో మాట ఎక్కువ అంటాడు అసలే వాళ్ల పెద్దమ్మ ఇంకో నాలుగు మాటలు నూరిపోస్తోందని  మహేంద్ర వద్దని చెబుతాడు. ఏది ఏమైనా సరే రిషి సర్‌కి నిజం చెప్పే వస్తాను. ప్రతీ దానికి ఎక్కువగా ఆలోచిస్తే మనం ఏ పనులు చేయలేం. నేను వెళ్తున్నాను అని  వసు తెగేసి చెబుతుంది.

ఇక రిషి కేబిన్ వద్ద గౌతమ్ కాసేపు అల్లరి చేస్తాడు. రేయ్ రిషి ఎలా ఉన్నావ్ రా ఎలా గుర్తు పట్టావ్ రా అని గౌతమ్ అంటే ఈ కోతి పనులు చేసేది నువ్వే కదరా? అని రిషి అంటాడు. యూఎస్ నుంచి ఎఫ్పుడొచ్చావ్ రా అని రిషి అంటే నిన్న వచ్చాను.. నిన్ను సర్‌ప్రైజ్ చేద్దామని ఈ రోజు వచ్చానని అంటాడు. నిన్న వస్తే ఈ రోజు నా దగ్గరకు వస్తావారా? అని రిషి అంటాడు. అదో పెద్ద కథ అని గౌతమ్ చెబుతూ ఈ కాఫీ వేడిగానే ఉంది ఇది నాకు రాసి పెట్టి ఉంది తాగేస్తున్నా అంటాడు గౌతమ్. కాలేజ్ ఎలా ఉందిరా అని రిషి అంటే నువ్ ఉన్నాకా కాలేజ్ ఎలా ఉంటుందో నాకు తెలీదా.. ఇంత చిన్న వయసులో పెద్ద కాలేజ్‌ని నడుపుతున్నావ్ అని పొగిడేస్తాడు. ఇక్కడే ఉంటావా? అని రిషి అడిగితే.. సరదాగా కొన్ని రోజులు ఉండాలని అనుకున్నా.. కానీ ఓ యాక్సిడెంట్.. నన్ను ఉండేలా చేసేట్టు చేస్తోంది.. అని గౌతమ్ అంటాడు. యాక్సిడెంటా నీకా.. అని రిషి కంగారు పడితే.. నాకు కాదురా.. ఓ యాక్సిడెంట్ జరిగితే.. ఓ అమ్మాయి నా కారు ఆపింది.. దెబ్బలు తగిలిన పర్సన్‌ని హాస్పిటల్‌కు తీసుకెళ్లింది.. ఆ అమ్మాయి ఉంది..అబ్బబ్బా.. మామూలుగా లేదనుకో.. అని గౌతమ్ అలా చెబుతూ పోతాడు. అడుగుపెట్టావో లేదో ఇలా అమ్మాయి కలిసిందారా? అని రిషి ఆటపట్టిస్తాడు.

Also Read:  తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..

ఈ అమ్మాయి అందరిలాంటిది కాదురా సంథింగ్ స్పెషల్ ముక్కూమొహం తెలీని వ్యక్తికి హెల్ప్ చేసింది. తన లుక్స్‌లో కాన్ఫిడెన్స్ ఉంది,  ధైర్యం ఉన్న అమ్మాయి.  ఆ చిరునవ్వు చూసి కవితలు కాదురా. కావ్యం రాసేయొచ్చు. ఆ అమ్మాయి కోసమైనా నేను ఉంటానని గౌతమ్ అంటాడు. ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాలి నువ్వే హెల్ప్ చేయాలి అంటాడు. నువ్ యమజాతకుడివిరా రాసి పెట్టి ఉంటే నీకే దక్కుతుంది. నీకు కాకపోతే ఎవరికి హెల్ప్ చేస్తాను చెప్పు అంటాడు రిషి. అరగంట వరకూ ఎవ్వరినీ రానివ్వకు అని వసు వచ్చేది చూసిన రిషి  ఫ్యూన్‌కు చెబుతాడు. దీంతో తనని కావాలనే నన్ను వెనక్కి పంపిస్తున్నారేమో అని వసు వెనక్కి తిరిగి వెళ్లిపోతోంది. టూర్ ప్లానింగ్స్ ఏంటని రిషి అడుగుతాడు. వచ్చేటప్పుడు ఎన్నో అనుకున్నా అన్ని క్యాన్సిల్ తనని పట్టుకోవాలి తనే ప్లానింగ్ కలుస్తుందారా? అని గౌతమ్ అంటే.. నేనున్నా కదా? డోంట్ వర్రీ అని రిషి హామీ ఇస్తాడు. ఎక్కడుంటున్నావ్ రా అని రిషి అడిగితే.. హోటల్‌లో ఉన్నానని గౌతమ్ అంటే.. నేను ఉండగా హోటల్ ఏంటి.. రేయ్ ఫూల్.. రారా అని రిషి అంటాడు. పెద్దమ్మకు కూడా రీసెంట్‌గా దెబ్బ తగిలింది అని చెప్పడంతో సరే వస్తాను అని గౌతమ్ అంటాడు.  కావాలనే రిషి సర్ నన్ను వెనక్కి పంపించాడంటూ వసు అనుకుంటే  నిజంగానే బిజీగా ఉండి ఉన్నాడేమో అని జగతి, మహేంద్ర అంటారు. 

Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..

ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించు.. రిషికి అర్థమయ్యేలా చెప్పు అని మహేంద్రను జగతి అడుగుతుంది. ఈ విషయాలను రిషికి నువ్వే చెప్పు వసు. ఈ సారి కరెక్ట్‌గా చెప్పు నువ్ చెబితే వింటాడు అని మహేంద్ర అంటాడు. నేను నీకు చెబితే నువ్ వసుకి చెబుతున్నావ్ ఏంటి.. ఇద్దరికి ఏమైనా గొడవలు జరిగితే ఎలా అని జగతి కంగారు పడుతుంది. అయినా దేవయాని అక్కయ్య గురించి అన్నీ చెప్పడం మంచిది కాదని జగతి అంటే ఏంటి మేడం ఎన్నాళ్లు దాస్తారు అని వసు, నిజనిజాలు ఎన్నేళ్లు దాస్తావ్ అని మహేంద్ర అంటారు. రిషి మంచి మూడ్‌లో ఉన్నప్పుడు నువ్ చెప్పు మహేంద్ర అని జగతి అంటే సరే ప్రయత్నిస్తాను అని మహేంద్ర అంటాడు. 

అక్కడ సీన్ కట్ చేస్తే.. రిషి, గౌతమ్‌లు కారులో వెళ్తుంటారు. ఆ అమ్మాయి కనిపించినప్పటి నుంచి ఏదోలా ఉంది అన్నం తినిపించాలని అనిపించడం లేదు ఏదోలా ఉందిరా అని గౌతమ్ అంటే.. డాక్టర్‌కి చూపించుకోరా ఏం రోగమో ఏమో అని రిషి కౌంటర్ వేస్తాడు. ఇది రోగమే కానీ బాడీకి కాదు గుండెకు.. చప్పుడు కూడా మారిందిరా అని అంటాడు గౌతమ్. ఆ అమ్మాయి కనిపిస్తుందారా? అని గౌతమ్ మళ్లీ అడుగుతాడు. చెప్పాను కదరా.. మనస్పూర్తిగా కోరుకో.. రాసి పెట్టి ఉంటే కలుస్తుందిరా అని రిషి అంటాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్‌లో 
వసు, గౌతమ్, రిషి కలిసి ఒకే కారులో వెళ్తారు. వాడు రమ్మనగానే రావాలా రాను అని చెప్పొచ్చు కదా అని రిషి తన మనసులో వసు గురించి అనుకుంటాడు. మీ పేరేంటని గౌతమ్ అడగడం.. వసుధార అని రిషి చెప్పడం.. నీకెలా తెలుసు  అని గౌతమ్ అడిగితే  తను నా స్టూడెంట్ అని రిషి బదులిస్తాడు. కాలేజ్ పెట్టి మంచి పని చేశావ్ రా అని గౌతమ్ అంటాడు. నాకు మనసులో ఏమనిపిస్తే అదే చెబుతాను అని గౌతమ్ అంటే.. అదే మంచిది.. కొంత మంది ఉంటారు.. మనసులో ఏదో అనుకుంటారు.. ఏదేదో ఊహించుకుంటారు అని రిషి గురించి వసు కౌంటర్లు వేస్తుంది. 

Also Read:  కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు షాకింగ్ ట్విస్ట్.. మోనిత బిడ్డ మాయం, రుద్రాణిని లాగిపెట్టి కొట్టిన దీప, హర్ట్ అయిన డాక్టర్ బాబు..
Also Read:  కార్తీక్ ఆచూకీ కోసం ఫస్ట్ స్టెప్ వేసిన మోనిత.. డాక్టర్ బాబుకి క్లాస్ పీకిన దీప.. ‘కార్తీకదీపం’ డిసెంబర్ 13 ఎపిసోడ్
Also Read: తనలో డాక్టర్ బాబుని కంట్రోల్ చేసుకున్న కార్తీక్.. ఇదేంటని ప్రశ్నించిన దీప.. మరింత ఎమోషనల్ గా మారిన కార్తీక దీపం సీరియల్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 15 Dec 2021 10:38 AM (IST) Tags: గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Guppedantha Manasu New Episode Guppedantha Manasu serial Guppedantha Manasu Saturday Episode గుప్పెడంత మనసు

ఇవి కూడా చూడండి

Keerthy Suresh: నా దగ్గరికి వచ్చే కథలన్నీ అలాంటివే, మరో ఆలోచనే లేదంటున్న కీర్తి సురేష్!

Keerthy Suresh: నా దగ్గరికి వచ్చే కథలన్నీ అలాంటివే, మరో ఆలోచనే లేదంటున్న కీర్తి సురేష్!

Family Star: 'ఫ్యామిలీ సార్' సంక్రాంతి రేసు నుంచి వెనక్కి - 'దిల్' రాజు క్లారిటీ

Family Star: 'ఫ్యామిలీ సార్' సంక్రాంతి రేసు నుంచి వెనక్కి - 'దిల్' రాజు క్లారిటీ

Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్

Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్‌ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!

Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్‌ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఈసీ ట్రెండ్స్ - ముందంజలో కాంగ్రెస్, సంబరాల్లో తెలంగాణ హస్తం నేతలు

Telangana Election Results 2023 LIVE: ఈసీ ట్రెండ్స్ - ముందంజలో కాంగ్రెస్, సంబరాల్లో తెలంగాణ హస్తం నేతలు

Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం

Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం

Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?

Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?

DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!

DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!
×